Jump to content

చర్చ:తెలంగాణ విమోచనోద్యమం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
తెలంగాణ విమోచనోద్యమం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2014 సంవత్సరం, 47 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

రజాకార్లంటే ముస్లింలు మాత్రమే. వారికి సహకరించిన భూస్వాములు మరియు ఇతరులు రజాకార్లు కారు. కావాలంటే ఈ పత్రికని చూడండి.రజాకార్లు ముస్లింలు
అందులోని పేరాని ఇక్కడ రాస్తున్నా.

కొన్ని ప్రాంతాల్లో వారు ప్రజలపై హత్యలు, దోపిడీలు చేశారు. బాధితులు హిందువులు కావడం చేత, రజాకార్లు ముస్లిం పాలకుని నాయకత్వంలోని ముస్లిం రాజ్య సిద్ధాంతంతో ప్రభావితమైన ముస్లింలు కావడం చేత హిందువుల్లో భయాందోళనలు మొదల య్యాయి. --శశికాంత్ 18:13, 16 సెప్టెంబర్ 2010 (UTC)

పేరు మార్పు

[మార్చు]

ఇది హైదరాబాదు విమోచనోద్యమం, కేవలం తెలంగాణ ప్రాంతం మాత్రమే విమోచనానికి చేసిన ఉద్యమం కాదు. కాబట్టి పేరును హైదరాబాదు విమోచనోద్యమంగా మార్చాలని కోరుకుంటున్నాను --వైజాసత్య (చర్చ) 15:24, 27 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వైజాసత్య గారూ, చంద్రకాంతరావు గారూ పేరు మార్పు మాత్రమే కాదు. ఏకంగా తెలంగాణా సాయుధ పోరాటం అంటూ మరో పెద్ద వ్యాసమే తయారైంది దాదాపు ఒకే అంశంపై. రెండింటిలోనూ చాలా విస్తారం, విపులం అయిన మంచి సమాచారం ఉంది. వీటిని ఏం చేయాలో ఒకసారి పరిశీలించగలరు.--పవన్ సంతోష్ (చర్చ) 05:23, 31 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్యగారూ, మీరు చెప్పినట్లు ఇది హైదరాబాదు సంస్థాన విమోచనోద్యమమే. కాని తెలుగు గ్రంథాలు, తెలుగు పత్రికల ప్రకారం చూస్తే తెలంగాణ విమోచనోద్యమం అన్న పేరే ఎక్కువగా వాడుకలో ఉంది. అసలిది విమోచనమా, విలీనమా, విద్రోహమా, స్వాతంత్ర్యమా అనే వాటిపైనా చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలున్నాయి. అయినా సరే గ్రంథాలు, పత్రికలలో వ్యవహరించే విమోచనోద్యమం పదాన్నే మనం వినియోగిస్తున్నాం. అలాగే విమోచనోద్యమం హైదరాబాదు సంస్థానానికి సంబంధించినదైనా తెలంగాణ విమోచనోద్యమం అనే పేరే ఈ ప్రాంతంలో ఎక్కువగా వాడుకలో ఉంది. విమోచన పోరాటం అధికంగా జరిగినది ఇప్పటి తెలంగాణ జిల్లాలలోనే. అందులోనూ ఈ వ్యాసంలో కేవలం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వివరాలే ఉన్నాయి కాని ఉత్తర కర్ణాటక, మరఠ్వాడాలలో జరిగిన ఉద్యమాల గురించి పొందుపర్చలేము. 2013లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన 8వ తరగతి తెలుగువాచకం పుస్తకంలో మాత్రం "హైదరాబాదు సంస్థాన విమోచనోద్యమం" పేరుతో పాఠం ఉంది. ఇటీవలి కాలంలో నా బ్లాగుల్లో నేను కూడా ఈ (హైదరాబాదు ...) పేరు కూడా వినియోగిస్తున్నాను. అలాగే పవన్ సంతోష్ గారూ, విమోచనోద్యమం, సాయుధపోరాటం రెండూ వేరువేరు. దాదాపు రెండూ ఒకే సమయంలో జరగడం మరియు రెండు ఉద్యమాలు నిజాంపైనే తిరగబడటంతో చాలామంది రెండూ ఒకటేనని పొరపడే అవకాశం ఉంది. వాస్తవంగా చూస్తే తెలంగాణ విమోచనం అనేది సంస్థానం నిజాం చెరనుంచి బయటపడటానికి, భారత యూనియన్‌లో కలవడానికి చేసిన పోరాటం. సెప్టెంబరు 17, 1948న సంస్థానం భారత యూనియన్‌లో కలవడంతో విమోచనోద్యమం అంతమైనట్టే. కాని తెలంగాణ సాయుధపోరాటం విమోచన అనంతరం కూడా కొనసాగింది. ఇది భూమికోసం, భుక్తికోసం చేసిన పోరాటం. అప్పటి నిజాంకు తొత్తులైన భూస్వాములు, జాగీర్దారులపై చేసిన ఉద్యమం. విమోచనోద్యమంలో ఎక్కువగా ఆర్యసమాజ్ ప్రభావం ఉంటే, సాయుధపోరాటంలో కమ్యూనిస్టులు అధికంగా పాల్గొన్నారు. (కొందరు రెండు ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు.) విమోచనోద్యమం తెలంగాణకు బయట కూడా కొంతవరకు జరిగిననూ సాయుధపోరాటం మాత్రం పూర్తిగా తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం జిల్లాలలో జరిగింది. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:49, 31 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
చంద్రకాంతరావు గారూ మీ అర్థవంతమైన, వేగమైన సమాధానానికి ధన్యవాదాలు. నాకు నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకున్న రెండు పార్శ్యాలు తెలిసినా ఇన్నేళ్ళుగా తెలంగాణా సాయుధపోరాటాన్ని, తెలంగాణా విమోచనోద్యమాన్ని అంత సున్నితంగా, స్పష్టంగా వాడుతున్నారన్న విషయం తెలియలేదు. మీరు చెప్పిన సమాధానం బావుంది. ఇక నేనేమైనా ఈ పేజీల్లో మార్చేప్పుడు ఈ తేడాను గుర్తించి చేస్తాను. ప్రజల్లో వాడుకలో ఉన్న తెలంగాణా విమోచనోద్యమం వాడుకే సరిపోతుందని నేనూ అనుకుంటున్నాను. నైజాం విమోచనోద్యమం, హైదరాబాద్ విమోచనోద్యమం అన్న పేర్లకు రీడైరెక్టులు ఉంటే చాలునని నేను అనుకుంటున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 16:55, 31 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
చంద్రకాంతరావు, పవన్ సంతోష్ గార్లూ మీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు. సాయుధపోరాటం ఆంధ్రమహాసభలో కమ్యూనిష్టుల ఆధిపత్యంతో మొదలైంది, చంద్రకాంతుల వారన్నట్టు భారత యూనియన్లో విలీనం తర్వాత కూడా "దొరలకు" వ్యతిరేకంగా కొన్నేళ్ళు కొనసాగింది. కాబట్టి ఇవి రెండూ వేర్వేరు వ్యాసాలుగా ఉండాలన్నది నిర్వివాదాంశం. ఇక హైదరాబాదు సంస్థాన విమోచనమా, తెలంగాణా విమోచనమా అన్ని విషయానికొస్తే, గత దశాబ్దంలోనే ఈ పోరాటాన్ని తెలంగాణా విమోచనోద్యమంగా వ్యవహరించడం పెరిగిందని నాకనిపించింది (నా దగ్గర ఖచ్చితమైన ఆధారాలేమీ లేవు) అదీకాక ఇది తెలంగాణా విమోచనోద్యమంగానే ఉంచితే ఇతర ప్రాంతాలలో జరిగిన పోరాటాన్ని ప్రక్కన పెట్టినట్టే. కాబట్టి తెలంగాణ విమోచనోద్యంను దారిమార్పుగా ఉంచాలని నా అభిప్రాయం --వైజాసత్య (చర్చ) 23:16, 26 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసాన్ని పొడిగించడానికి నేను ఎక్కువగా పత్రికలపై ఆధారపడ్డాను. పత్రికలలో తెలంగాణ విమోచనోద్యమం అనే వాడుకలో ఉంది. పేరు మార్పుకు నేనిప్పుడు అభ్యంతరం చెప్పదలుచుకోలేను. అయితే అప్పటి విమోచనోద్యమాన్ని ఇప్పటి చరిత్ర గ్రంథాలలో ఏ పేరుతో పిలుస్తున్నారో మనం మరోసారి పరిశీలిద్దాం. ఎందుకంటే రేపు మరెవరో మళ్ళీ పేరుమార్పుకు ప్రతిపాదించే అవకాశం ఉంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:50, 27 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

నల్లగొండ జిల్లా లో జరిగిన సాయుధపోరాటము - మల్లారెడ్డి గూడెం

[మార్చు]

నల్లగొండ జిల్లాలో జరిగిన సాయుధపోరాటములో మల్లారెడ్డిగూడెం స్థానం అమూల్యమైంది. కానీ నేను చదివిన (వ్యాసంలో) చరిత్రలో మల్లారెడ్డిగూడెంలో జరిగిన కాల్పులల్లో వీర మరణం పొందిన వారిలో అందరికి ఒకే రకమైన ప్రాధాన్యత రాలేదు. ముఖ్యంగా మహిళా అమరులకు అన్యాయం జరిగింది అనే చెప్పాలి. నేను ఈ రోజు అనగా 19.10.2017న మల్లారెడ్డి గూడెం దర్శించాను. ఇక్కడ చాలా మందిని కలిశాను వారిలో ముఖ్యులు ఉస్తెల వీరారెడ్డి గారు, చింత్రియాల శాంభయ గారు,పెరూపంగు వెంకయ్య గారు, చంద్రమ్మగారు ఇంకా ఇతర గ్రామస్తులను కలిశాను. వారు చెప్పిన వివరాల ప్రకారం. మరియు స్థూపం(సెప్టెంబర్ -17-1975 న నిర్మించారు) పై ఉన్నా వివరాల ప్రకారం అమరుల పేర్లు ఈ విధంగా ఉన్నాయి 1. నందిరెడ్డి నర్సిరెడ్డి గారు. 2.ఎరబోయిన అప్పిరెడ్డి గారు 3,ముంగి వీరయ్య గారు. 4,పేరపంగు భూషమ్మ గారు 5, పేరపంగు తిరుపతమ్మ గారు 6, అలుగు వీరమ్మ గారు 1- 12- 1946లో అమరులైనట్లు ఉంది. అలాగే 1948లో కందుల గోపిరెడ్డి గారు. 1949లో రామస్వామి గారు అమరులైనట్లు వివరాలు లభించాయి. కానీ ఇక్కడున్న వ్యాసాలల్లో కొంతమంది పేర్లు రావడం లేదు. ఇది విచారించాల్సిన విషయం. ---- అంజయ్య దేవులపల్లి. m.A, B.Ed. anji2725@gmail.com