చర్చ:తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు (ఆ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

తగిన వికీ ప్రాజెక్టు[మార్చు]

YesY సహాయం అందించబడింది

user:Vemurione గారికి, మీరు నిఘంటువుని వికీలో చేర్చుతున్నందులకు చాలా సంతోషం. కొన్ని సంవత్సరాల క్రిందట మీ నిఘంటువుని విక్షనరీలో చేరుద్దామని (ప్రయత్నం, చర్చ ) చేసాను. కాని సభ్యుల తోడ్పాటు కొరవడినందున చేయలేకపోయాను. అయితే వికీపీడియా దీనికి అనువైనది కాదు. మూలంతో అనువుగా మార్పులు జరగకుండా వుండాలంటే వికీసోర్స్ లో మీరు మూలం చేర్చి ఆ పై ఈ పేజీలు చేర్చడం మంచిది. ఇతరులు ఎప్పటికప్పుడు మార్చగలిగే వీలుండాలనుకుంటే వికీబుక్స్ లేక విక్షనరీ అనువైనది. ఇటీవలి కాలంలో వికీపీడియా మూలసూత్రాలను పాటించకుండా చాలా మార్పులు జరుగుతున్నాయి. వీటివలన వికీపీడియా నాణ్యత పడిపోతుంది. దీనిపై మీరు, ఇతరులు స్పందించిన తరువాత మీ కృషికి పెద్దనష్టం వాటిల్లకుండా తగిన ప్రాజెక్టుకి మార్చవచ్చు. విక్షనరీ కయితే ప్రాగ్రామ్ ద్వారా చేయాల్సి వస్తుంది. సిఐఎస్ వారి తోడ్పాటు కై వాడుకరి:Pavan santhosh.s ని సంప్రదించండి.--అర్జున (చర్చ) 07:07, 24 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

user:Arjunaraoc గారికి: మీ స్పందనకి ధన్యవాదాలు. "మూలంతో అనువుగా మార్పులు జరగకుండా వుండాలంటే వికీసోర్స్ లో మీరు మూలం చేర్చి ఆ పై ఈ పేజీలు చేర్చడం మంచిది." అని అన్నారు. అలా చెయ్యడానికి నేను సుముఖుడనే. ఎలా చెయ్యడమో తెలియదు. మీరు దారి చూపించండి. ఏది చేసినా మూలంలో మార్పులు నేను చెయ్యడానికి వీలుగా ఉండాలి. ఎందుకంటే ప్రతి రోజూ ఏదో చిన్న చిన్న మెరుగులు దిద్దుతూనే ఉంటాను కాబట్టి! తెలిసీతెలియని వాళ్లు మెరుగులు దిద్దుతున్నామనే సదుద్దేశంతో చేసే మార్పులతో అసలు పాడయే అవకాశం ఉండబట్టి నా జాగ్రత్తలో నేను ఉంటున్నాను తప్ప బాగా తెలిసినవాళ్లు మెరుగులు దిద్దుతామంటే నాకు అభ్యంతరం ఉండదు. ఈ విషయంలో మీరు ఏ సలహాలు ఇచ్చినా వాటిని స్వీకరించగలను. ధన్యవాదాలుVemurione (చర్చ) 16:21, 24 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

user:Vemurione గారికి, మీరు చేసిన కృషిని వికీపీడియా ద్వారా తెలుగువారందరికీ అందించాలన్న మీ కోరిక చాలా హర్షించదగినది. మీ నిఘంటువు ముద్రించబడినట్లయితే; దానియొక్క స్కాన్ కాపీని వికీ కామన్స్ లోనికి అప్లోడ్ చేసి సి.సి.బై.వై. 4.0 క్రింద కాపీహక్కులను విడుదలచేస్తే మీరే దాని రచయిత కాబట్టి సరిపోతుంది. అప్లోడ్ అయిన తర్వాత దానిని తెలుగు వికీసోర్స్ లో ఒక పుస్తకంగా మలచడానికి, అర్జునరావు, నేను సహాయం చేస్తాము. దీనిలోని సమాచరం అంతా టైపింగ్ చేయబడివున్నది గనుక ఆయా పేజీలను లిప్యంతరీకరణ సుళువుగా చేయవచ్చును. ఆ పని పూర్తయిన తర్వాత సమాచారం అంతా వికీపీడియాలోను, వికీసోర్సులోను ఉన్నది కనుక తెలుగు విక్షనరీలోనికి ఆయా పేజీలలోని తరలించవచ్చును. ఆ పిదప అవసరమనుకున్న సవరణలు, మెరుగులు దిద్దవచ్చును. మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.--Rajasekhar1961 (చర్చ) 19:42, 25 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
user:Rajasekhar1961 గారికి: "మీ నిఘంటువు ముద్రించబడినట్లయితే; దానియొక్క స్కాన్ కాపీని వికీ కామన్స్ లోనికి అప్లోడ్ చేసి సి.సి.బై.వై. 4.0 క్రింద కాపీహక్కులను విడుదలచేస్తే మీరే దాని రచయిత కాబట్టి సరిపోతుంది." ఈ వాక్యం అర్థం కాలేదు. స్కాన్ కాపీ అంటే ఏమిటి? అట్ట మీద సమాచారాన్ని స్కాన్ చెయ్యడమనా మీ ఉద్దేశం? నిఘంటువుని Asian Educational Services వారు 2000 లో ముద్రించేరు. దరిదాపు 1000 పేజీలు ఉంటుంది. నా దగ్గర original .txt files ఉన్నాయి. వాటిలో కనబడిన తప్పులని సవరించి, కొత్త పదార్థం చేర్చి, ఆ దస్త్రాలని వికీపీడియాలోకి ఎక్కిస్తున్నాను. నేను ఇదే పద్ధతిలో వేమూరి నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు) ఇప్పటికే వికీపీడియాలో ఎక్కించేను. ఇప్పుడు తెలుగు-ఇంగ్లీషు భాగం ఎక్కిస్తున్నాను. అర్జునరావు గారు సూచించినట్లు ఈ రెండింటిని వికీసోర్స్ లో ఒక పుస్తకంగా మలచడానికి నేను ఏ విధంగా వీలయితే అలా సహాయం చేస్తాను. కాని నాకు మీ ఇరువురి సహాయం అవసరం. ఈ పని పూర్తి అయితే నా దగ్గర తెలుగు గ్రామరు, తెలుగు స్టయిల్ మేన్యువల్ కూడా ఉన్నాయి. వాటిని కూడ వికీసోర్స్ లో పుస్తకాలుగా మలచవచ్చు. ధన్యవాదాలు.

Vemurione (చర్చ) 21:43, 25 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

user:Vemurione గారికి, మీనిఘంటువును పి.డి.ఎఫ్.గా స్కాన్ చేసి 1000 పేజీలను ఒక పుస్తకంగా వికీకామన్స్ లో అప్లోడ్ చేయాలి. లేదా ఈ పుస్తకం డిజిటల్ కాపీ ఎక్కడైనా లభిస్తుంటే దానిని కూడా ఉపయోగించుకోవచ్చును. అక్కడ అప్లోడ్ చేసిన పిదప original .txt files మీ దగ్గర ఉన్నాయి కాపట్టి ఒక పుస్తకంగా సులువుగా చేయవచ్చును. మిగలిన పుస్తకాలను కూడా కాపీహక్కుల్ని వికీపీడియా కి ఇద్దమని మీకు ఉద్దేశం ఉంటే అన్నింటిని ఒకేసారి అప్లోడ్ చేయవచ్చును. ఈ లింకు చూడండి. [1] మీకు అర్ధమౌతుంది. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 04:43, 26 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
user:Vemurione గారికి, ఈ విషయం గురించి మీరు, నేను, అర్జున మరియు పవన్ గార్లందరితో వీడియో సమావేశం ఏర్పాటుచేద్దామనుకొంటున్నాను. మీకు వీలైన సమయం తెలియజేయండి. అప్లోడ్ పద్ధతులను వివరిస్తాము. మరేవైనా సందేహాలు నివృత్తి చేసుకోవచ్చును.--Rajasekhar1961 (చర్చ) 02:51, 31 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
user:Rajasekhar1961 తప్పకుండా. రెండు, మూడు రోజులలో మీకు చెబుతాను. ఈ లోగా.... నా పాత నిఘటువు దస్త్రాలు ఎక్కించడానికి రెండు ఇబ్బందులు. ఒకటి, అవి ఎక్కడ ఉన్నాయో మరచిపోయేను. పాత కంప్యూటరులో ఉండిపోయాయో ఏమో! ఇంకా వెతకాలి. రెండు, ఆ దస్త్రాలు కనిపించినా వాటిని వాడడానికి నేనుసుముఖంగా లేను. ఎందువల్ల నంటే అవి కాలదోషం పట్టిపోయాయి. వాటిలో ఉన్న తప్పులన్నిటిని సవరించడమే కాకుండా చాల కొత్త పదార్థం చేర్చేను కనుక వాటిని తిరిగి వాడడం మంచిది కాదేమో. ఇప్పుడు వికీపీడియాలో ఉన్నది అంతా update చేసినది. కనుక ఈ పదార్థాన్నే కామన్‌స్ లో వాడుకోవడం మంచిదని నా అభిప్రాయం. Vemurione (చర్చ) 03:38, 31 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
user:Vemurione గారికి, ధన్యవాదాలు. మీ సమయాన్ని తెలియజేస్తే అందరూ కలసి చర్చిద్దాము.--Rajasekhar1961 (చర్చ) 05:00, 31 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
user:Rajasekhar1961 నేను ఉదయం 6:30 ప్రాంతాలకి లేస్తాను. శనివారం కాని ఆదివారం కాని ఇక్కడ ఉదయపు వేళ (అనగా మీకు సాయంత్రం 6:)) అవుతుందనుకుంటాను) ప్రయత్నించవచ్చు. వారపు రోజులలో కూడ లేస్తాను కాని మనవలని బడికి తీసుకెళ్లే బాధ్యత వల్ల కొంచెం తొడతొక్కిడిగా ఉంటుంది. ఈ కింది వివరాలు మీకు ఉపయోగపడవచ్చు.

నా నివాస స్థలం: కేలిఫోర్నియా (పసిఫిచ్ కాలం) నా skype: rao.vemuri నా ఇ-మైల్: rvemuri@gmail.com అవసరమైతే నేను మిమ్మల్ని ఫోనులో పిలవగలను. లేదా ఉచితంగా కాంఫరెంసు కాల్ చేసే పద్ధతి మీకు తెలిస్తే అలా కూడ ప్రయత్నం చెయ్యవచ్చు. ఈ వారం కుదరక పోతే పైవారం పెట్టుకోవచ్చు. ధన్యవాదాలు Vemurione (చర్చ) 13:51, 31 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

user:Rajasekhar1961, user:Arjunaraoc గార్లకి:

రెండు విషయాలు: (1) అర్జునరావు గారు, రాజశేఖర్ గారు నా రెండు నిఘంటువులకి వికీకామంస్ సరి అయిన స్థానం అని పేర్కొన్నారు. ఇప్పుడున్న స్థలం నుండి ఈ రెండింటిని అక్కడకి తరలించడానికి కాని, మరొక స్థానంలోకి కాని తరలించడానికి నాకు సమ్మతమే. ఒక్క విషయం మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రెండింటిని, దరిదాపు ప్రతి రోజు నేను "మరమ్మత్తు" (అప్‌డేట్‌) చేస్తూనే ఉంటాను: కనిపించిన తప్పులు దిద్దడం, అవసరమైన చోట విస్తరించడం, కొత్త పదాలు చేర్చడం, పాత పదాలకి కొత్త అర్దాలు తగిలించడం, వగైరా. వికీకామన్‌స్లో ఉన్నా నేను చేసే ఈ రకం మరమ్మత్తులు సాధ్యం అయినంత సేపూ ఇబ్బంది ఉండదు. (2) నా దగ్గర తెలుగు వ్యాకరణం (ఇంగ్లీషులో రాసేను) ఉంది. ఇది తెలుగు మాతృభాష కాని వారిని దృష్టిలో పెట్టుకుని రాసేను. దీనిని కూడ అందరికీ అందుబాటులో ఉండేలా తేవాలి. నా దగ్గర ఉన్న "మేన్యుస్క్రిప్ట్" దరిదాపు 70 శాతం పూర్తి అయింది. మిగిలిన 30 శాతం పూర్తి చేసి, దానిని వికీ ఫార్మేట్ లోకి మార్చి, ఆడియో అసిస్ట్ జతచేసి, ప్రచురించాలి. ఇప్పుడు మొదలు పెడితే, హంగులన్నీ చేర్చి పూర్తి చెయ్యడానికి ఒక ఏడాది కాలం పట్టవచ్చు. ఇది ఎక్కడ చెయ్యాలో సలహా ఇవ్వగలరు. Vemurione (చర్చ) 23:10, 4 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ ఈ రెండింటిని, దరిదాపు ప్రతి రోజు నేను "మరమ్మత్తు" (అప్‌డేట్‌) చేస్తూనే ఉంటాను: కనిపించిన తప్పులు దిద్దడం, అవసరమైన చోట విస్తరించడం, కొత్త పదాలు చేర్చడం, పాత పదాలకి కొత్త అర్దాలు తగిలించడం, వగైరా. వికీకామన్‌స్లో ఉన్నా నేను చేసే ఈ రకం మరమ్మత్తులు సాధ్యం అయినంత సేపూ ఇబ్బంది ఉండదు.
ఇలా పుస్తకాన్ని రాయడానికి అనువైన ప్రాజెక్టు బహుశా వికీసోర్సు కాక వికీబుక్స్ కావొచ్చునేమో? --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:31, 5 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
నిఘంటువుని మార్చుకునే అవకాశం వుండాలంటే విక్షనరీలో చేర్చడం మంచిది. ఇక ముద్రితంకాని పుస్తకాలు సముదాయంతో అభివృద్ధి పరచాలని భావిస్తే వికీబుక్స్ మంచిది. అయితే ప్రస్తుత పరిస్థితులలో సముదాయం బలంగా లేకపోవడం వలన, మార్పులు మూల రచయిత నుండి తప్ప అంతగా జరగకపోవచ్చని గమనించండి.--అర్జున (చర్చ) 12:03, 6 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) గారికి, ఈ నిఘంటు పేజీలని విక్షనరీలో చేర్చడానికి సిఐఎస్-ఎ2కె సాంకేతిక సహాయం చేయగలదా? --అర్జున (చర్చ) 00:32, 1 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:vemurione అర్జున, user:Rajasekhar1961, నేను వేమూరి నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు]], వేమూరి నిఘంటువు తెలుగు-ఇంగ్లీషు]] - రెండూ వికీపీడియాలోకి ఎక్కించిన మాట వాస్తవం. ఈ నిఘంటువులు ఉండవలసిన స్థావరం "వికీపీడియా" కాకపోవచ్చు, మూడొంతులు "వికీబుక్స్" కావచ్చు. నాకు తెలియదు. నాకు తెలిసిన వారు సహాయం చేసి ఏమిటి చెయ్యాలో చెబితే ఆ విధంగానే చేద్దాం. నేను కొద్దిగా పరిశోధన చేసి తెలుసున్న విషయం ఇది: హోం పేజిలో ఎడమ పక్క మార్జిన్ లో సగం దూరం కిందికి వెళితే అక్కడ "ఓ పుస్తకాన్ని సృష్టించండి" అనే లంకె ఉంది. అక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం "ఇప్పటికే వికీపీడియాలో ఉన్న సమాచారాన్ని సేకరించి ఒక పుస్తకంగా తయారు చేసుకుని దానిని pdf file రూపంలో దింపుకోవచ్చు. కాని ఈ పద్ధతి అవలంబించడం వల్ల "వికీపీడియాలో నిఘంటువులకి తావు లేదు" అనే వాదం ఒక కొలిక్కి రాదు. మనకి కావలసినది వికీపీడియాలో ఉన్న పుటలని అక్కడ నుండి తీసేసి మరొక స్థావరానికి కదలించాలి. ఆ కొత్త స్థావరంలో ఉన్న ప్రతి edit చెయ్యడానికి వెసులుబాటు కల్పించాలి. సమస్య ఇది. పరిష్కారం ఆలోచించండి. ఈ రంగంలో నాకు ఉత్సాహం ఉన్నంతగా సమర్ధత లేదు. Vemurione (చర్చ) 19:21, 7 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:vemurione గారికి, మీ సమస్య బాగానే అర్ధమయ్యింది. దానికి పరిష్కారం విక్షనరీకి తరలించడమే. అందుకనే మొదటిప్రయత్నం విక్షనరీలో జరిగింది. పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) నుండి ఇంతవరకు స్పందన లేకపోవటం విచారకరం. ఇంకొన్ని రోజులు వేచిచూసి స్పందన లేకపోతే ఈ పేజీలను యధావిధిగా విక్షనరీలోకి తరలించాలి. --అర్జున (చర్చ) 15:19, 11 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

క్షమించాలి. అర్జున గారూ ఈ అంశంపై రేపటిలోగా రచ్చబండపై రాస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 15:42, 11 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియా:రచ్చబండ#విక్షనరీ, వికీసోర్సులకు తగిన వ్యాసాలు తరలించే అంశంపై స్పందన ప్రకారం సిఐఎస్-ఎ2కె వీలువెంబడి సహయం చేయుటకు అంగీకరించింది కావున, ప్రస్తుతానికి విక్షనరీకి తరలింపు మూస చేర్చవలెను. --అర్జున (చర్చ) 23:41, 14 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
తరలింపు మూసచేర్చడం పూర్తయినది. --అర్జున (చర్చ) 01:00, 15 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]