Jump to content

చర్చ:తెలుగు భాషలో ఆంగ్ల పదాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
(చర్చ:తెలుగు భాషలో అంతరిస్తున్న పదాలు నుండి దారిమార్పు చెందింది)

∞నాకు ఈ వ్యాసంపై అభ్యంతరాలు ఉన్నాయి. ఇది ఒరిజినల్ రీసెర్చ్ లా ఉంది. తొలగించాలని ప్రపోజ్ చేస్తున్నాను. లేకుంటా ఆధారాలు సహితంగా వ్యాసాన్ని తిరిగి వ్రాయాలి. Chavakiran (చర్చ) 18:22, 2 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

చావాకిరణ్ గారి అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. ఆధారాలు లేకుండా సభ్యుల స్వంత అభిప్రాయాలుగా తోస్తున్న వాక్యాలు ఉన్నాయి. అంతరిస్తున్న తెలుగు పదాలు విభాగంలో చేర్చిన పదాలను ఎవరు ప్రకటించారు? అంతరిస్తున్న జీవులు లాగా అంతరిస్తున్న ఈ తెలుగు పదాలను అధికారికంగా ఇప్పటివరకు ఎవరూ ప్రకటించలేరు. ప్రామాణిక గ్రంథాలలోనైనా ఈ విషయం ఉన్నట్లుగా ఎవరైన గుర్తిస్తే మూలాలు ఇవ్వాలి. "ఈ రోజుల్లో ఇద్దరు వ్యక్తులు ఇంగ్లీషులో మాట్లాడుకుంటున్నారు అంటే తప్పనిసరిగా వారు తెలుగువారు అయి ఉంటారని భావించవచ్చు" లాంటి స్వంత అభిప్రాయ వాక్యాలు వ్యాసాలలో ఉండటం సమంజసం కాదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:56, 2 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం శిర్షిక కూ వ్యాసానికి సంబంధం లేదు. నేను చంద్రకాంతరావు గారి అభిప్రాయంతొ ఏకీభవిస్తాను. ఈ వ్యాసంలో "తెలుగు వారు వాడుకలో ఉపయోగిస్తున్న ఆంగ్ల పదాలు"సూచించారు. కాని తెలుగు పదాలు పూర్తిగా అంతరించిపోలేదు. పల్లెలలో తెలుగు పదాలను బాగానే వినియోగించు టను నేను మా పాఠశాల పరిధిలో గల గ్రామాలలో గుర్తించాను. నా అభిప్రాయం ప్రకారం కాన్వెంటు లొ ఆంగ్ల కోసం పరితపంచే విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఎక్కువగా ఆంగ్ల పదాలు ఉపయోగిస్తున్నట్లు తోస్తుందిః కొంతమంది తల్లిదండ్రులు కావాలనే తెలుగు భాషలో మాట్లాడుతున్న పిల్లలకు మమ్మీ, డాడీ సంస్కృతిని బలవంతంగా రుద్దటం గమనించితిని. ఇది పట్టణాలలోనే అధికంగా ఉన్నది. కాని తల్లిదండ్రులు మాత్రం తెలుగు భాషాపదాలనే వాడుతున్నారు. తమ పిల్లలు ఆంగ్ల భాష ఉపయోగిస్తె గొప్ప వారు అయిపొతారనే అపోహ తల్లిదండ్రులుకు అధికంగా కలదు.   కె. వి. రమణ. చర్చ 00:18, 3 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

RameshRaju (చర్చ) 14:35, 5 మార్చి 2013 (UTC) తెలుగు భాషలో కొన్ని పదాలు అంతరిస్తున్న మాట వాస్తవమే. ఏ భాష అయినా మార్పులు చెందుతూ ఉంటుంది. ఏ యంత్రాన్నైనా ఉపయోగించకపోతే అది కొన్నాళ్ళు పోయిన తర్వాత పనిచేయకుండా పోతుంది. అలాగే భాషలో అయినా పదాలు వాడకపోతే అవి కాల క్రమేణా వాడుక భాషలోంచి తొలగిపోయి కనుమరుగవుతాయి. ఇప్పటికే కొన్ని సమయల్లో నిఘంటువు చూస్తే గాని ఆంగ్ల పదాలకు తెలుగు అర్ధాలు తెలియడంలేదు. ఉదాహరణకు చిన్నప్పటినుండి ఆంగ్ల మాద్యమంలో చదివిన నాకు ఒక సంధర్భంలో 'చూస్ / చాయిస్ అను ఆంగ్ల పదానికి ఎంచుకోవడం అను తెలుగు పదం ఆన్ లైన్ నిఘంటువు చూస్తే గాని తెలియలేదు. చాలా సిగ్గు పడ్డాను. మన తల్లిదండ్రులు పూర్తి తెలుగులో మాట్లాడినా, నేడు మనం కొన్ని ఆంగ్ల పదాలు వాడుతున్నాం. రేపు మన పిల్లలు ఖచ్చితంగా మనం వాడిన పదాలనే వాడతారు. ఉదాహరణకు కూర అనే పదం బదులు కర్రీ అనే ఇంగ్లీషు పదం వచ్చింది. కూర అనే పదం వాడకపోతే అది వాడుక భాషలోంచి తొలగిపోయి క్రమేణా అంతరించవచ్చు. ఆంగ్ల విద్య దయ వల్ల ఇప్పటికే మనకు చాలా తెలుగు పదాలు తెలియడంలేదు. ఇప్పటికే తెలుగు భాషలోకి చాలా ఆంగ్ల పదాలు వచ్చి చేరిపోయాయి. సాంకేతిక పదాలకు ఏలాగూ తెలుగు పదాలుండవు కాబట్టి, అవి ఇంగ్లీషులో వాడినా పరవాలేదు. కనీసం మిగిలిన ఇంగ్లీషు పదాలకు ప్రత్యాయమ్నంగా తెలుగు పదాలు ఉంటాయికదా? ఈ కాలపు పిల్లల్లో మరియూ యువకుల్లో తెలుగు స్పష్టంగా మాట్లాడలేని, చదువలేని దారుణ పరిస్థితి ఉన్నది. ఈ విషయం పై చాలా టి.వి కార్యక్రమాలు వచ్చాయి, తెలుగు సంఘాలు ఆందోళన పడుతున్నాయి. వికీపిడియాలో వ్యాసాలను వ్రాయడానికి నేను ప్రత్యేకంగా ఒక గురువుగారి వద్ద ఎంతో కొంత తెలుగు నేర్చుకోవాల్సి వచ్చింది. తెలుగువాడినైనా అంతకు పూర్వం తెలుగు భాషలో ఎక్కువగా ఆంగ్ల పదాలే వాడేవాడిని. కనుక ఈ వ్యాసాన్ని తొలగించడం సరికాదు. కావాలంటే ఈ వ్యాసాన్ని అభివృద్ది చేయవచ్చు. భూపతిరాజు రమేష్ రాజు - చర్చ 20:56, 2 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

భూపతి గారి అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తున్నాను. ఈ వ్యాసం తొలగించదగినది కాదు. దీనిని అభివృద్ది చేస్తే భవిష్యత్ తరాలకు చాలా సహాయకారిగా ఉంటుంది.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:35, 5 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
దీనిని వికీకరించి బాగా అభివృద్ధి చేయవచ్చని నా అభిప్రాయం.Rajasekhar1961 (చర్చ) 09:44, 5 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు పదాలు తెలుగు వారు వాడాలి అనేది చాలా మంచి కాన్సెప్టే, కానీ దానికి వికీ వేదిక కాదు. ఇది ఒరిజినల్ రీసెర్చ్ కదా, అందుకని వికీలో ఉంచలేము. ఒరిజినల్ రీసెర్చ్ కాదనుకుంటే కనీసం ఎవరు ఈ పదాలను అంతరించి పోతున్న పదాలుగా వర్గీకరించారో ఆధారాలు ఇవ్వాలి. లేకుంటే ఇవి కేవలం మన అభిప్రాయాలే అయితే వాటికి వికీ వేదిక కాదు, బ్లాగో, లేకుంటే మరో వేదికో సరి అయినది. మరోచోట అయితే ఇది మంచి చర్చించదగిన వ్యాసం, కానీ సాంతేకికంగా వికీలో ఇటువంటి వాటికి చోటు లేదు. I home i am making sense. Chavakiran (చర్చ) 12:30, 5 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
భూపతి గారు మీ అభిప్రాయంతో ఇక్కడ చాలామంది వ్యక్తిగతంగా ఏకీభవిస్తారు. కానీ చావా కిరణ్ గారు చెప్పినట్టు వ్యాసం ఇక్కడ ఉండతగినది కాదు. మొదటి విభాగంలో చాలామటుకు వ్యక్తిగత అభిప్రాయం లేదా Anecdotal evidence. అంతరించిపోతున్న అంటే ఎవరి లెక్కన, అలా అని ఎవరు నిర్ధారించారు అన్న ప్రశ్న వస్తుంది. ఇక్కడ మూలాలేవీ లేవు కనక భూపతి గారు నిర్ణయించారు అనుకుంటారు. అందుకని అది మౌళిక పరిశోధన అవుతుంది. మౌళిక పరిశోధనలు వికీపీడియాలో నిషిద్ధం. ఇది నిజంగా అంతరించిపోతున్న పదాల జాబితా అయినా అది విక్షనరీలో ఉండాలి. వికీపీడియాలో పదాల జాబితాలను ఉంచలేము. మూడవ విభాగం మీ పరిస్కార సూచనలు సలహాలు. సలహాలు కూడా వికీలో ఉండటానికి వీలులేదు. ఈ వ్యాసం ఒక బ్లాగుకో, మేగజిన్లోనో చక్కగా ఉంటుంది. అన్యథా భావించవద్దు. --వైజాసత్య (చర్చ) 08:37, 7 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం పేరు మార్పు ప్రతిపాదన

[మార్చు]

ప్రతిపాదన

[మార్చు]

ఈ వ్యాసం పేరును "తెలుగు వారు ఉపయోగిస్తున్న ఆంగ్ల పదాలు" అనికానీ, "తెలుగు భాషలో వినియోగిస్తున్న ఆంగ్ల పదాలు" అని గానీ పెడితే బాగుండునేమో!

కారణము

[మార్చు]

తెలుగు భాషలో గల నిఘంటువులో అనేక పదములు మనకు తెలియదు. మనం వాటిని ఉపయోగించము. అంతమాత్రాన అవి అంతరించి పోయినట్లేనా! ఈ వ్యాసంలో సూచించిన తెలుగు పదాలు, వాటి అర్థాలు అందరికీ తెలిసినవే, ఉదాహరణకు అమ్మ అంటే తెలుగు వారికందరికీ తెలిసిన పదమే. కాని కొంతమంది వాడనంత మాత్రాన అందరూ దాని అర్థం తెలియనట్లేనా! అది అంతరించి పోయినట్లెనా! మనలో కొందరు వాడనంత మాత్రాన అవి అంతరించి పోతున్నట్లు తన స్వంత అభిప్రాయాలు ప్రకటించడం సరైనది కాదని నా అభిప్రాయం. సౌలభ్యం కోసం కొన్ని తెలుగు పదములలో అన్య భాషా పదాలు ఉపయోగించినంతమాత్రాన తెలుగు పదాలు అంతరించిపోయినట్లు రాయడం శోచనీయం. అవి అంతరించి పోతున్నట్లు ఏవైనా ఆధారాలు ఉంటే తెలియ జేయండి.

ప్రతిపాదన బాగుంది. కాకుంటే మనవాళ్ళు మరీ లక్షల్లో ఆంగ్లపదాలు వాడుతున్నారేమో అని నా అనుమానం. కాబట్టి వ్యాసం పేరు ఉట్టి తెలుగువారు వాడుతున్న ఆంగ్లపదాలు అని కాకుండా, నిత్యవ్యవహారంలో తెలుగు వారు వాడుతున్న ఆంగ్లపదాలు అనో లేదా అదే అర్థంలో మరో పేరో పెడితే అప్పుడు వ్యాసపరిథి మరీ అనంతం కాకుండా ఉంటుంది. కేవలం సంఖ్యలు, అమ్మా నాన్నా, ఇలా నిత్య వ్యవహారంలో వాడే పదాలు ఇస్తే సరిపోతుంది అప్పుడు.

కొన్ని తెలుగు పదములు

[మార్చు]

ఈ క్రింది తెలుగు పదములు పరిశీలించండి ఉదజని, ఆమ్లజని, నత్రజని, బొగ్గుపులుసు వాయువు, ఉదజహరికామ్లము, కర్బనము వంటి రసాయన పదార్థముల తెలుగు పదములు ఎవరికీ ఆర్థం కావు. కాని హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్, హైడ్రోక్లోరికామ్లం, కార్బన్ అనిన చాలా మంది విద్యార్థులకు అర్థం అవుతాయి. వారికి అర్థం అయ్యే రీతిలో అర్థం చేసుకొనుటలో ఆంగ్ల పదముల వినియోగం తప్పనిసరి. అలా కాకుండా అచ్చమైన తెలుగు పదములతో రసాయన శాస్త్రము అభ్యసిస్తే తర్వాత తరగతులలో ఉన్న వివిధ అంశములు అర్థం కావు. విద్యార్థులు ఈ ఆంగ్ల పదాలు సౌలభ్యం కోసం వినియోగిస్తున్నారని తెలుగు నిఘంటువులో ఆ పదాలను తొలగించాలా! అవి అంతరించిపోయినట్లు ప్రకటించాలా! భౌతిక శాస్త్రంలో "ఉత్తేజిత కాంతి ఉద్గారం వలన కాంతివర్థకము" కాంతి అనిన ఎవరికీ అర్థం కాదు కాని "LASER" అనిన విద్యార్థులకు అర్థం అవుతుంది. కొన్ని ఆంగ్ల పదములకు తెలుగు పదములు ఉండవు. "ఎలక్ట్రాన్" "ప్రోటాన్" "పాజిట్రాన్" ఇలా అనేకమైనవి ఉన్నవి. ఇవి ఆంగ్లంలోనె చదవాలి తప్ప తెలుగు భాషాభివృద్ధి కోసం అవి చదవడం మాని వేయాలా! తెలుగు పదములు వినియోగించకపోవడం పిల్లల తల్లి దండ్రులు, పాఠశాలలో ఉపాధ్యాయుల ప్రభావం అని తెలియుచున్నది. వినియోగించనంత మాత్రాన అంతరిస్తున్న పదాల జాబితాగా ఏ ప్రాతిపదిక గా తయారు చేశారో తెలియ జేయాలి. దీనిపై ఏదైనా సర్వే నిర్వహించారా! ఏ పత్రికలోగాని, అంతర్జాలంలో కాని ఆధారాలు ఉన్నవా? ప్రభుత్వం వీటిని అంతరించిపోతున్న పదాలుగా ప్రకటించిందా రచయిత తెలియజేయాలి.

జీవరాశులు అంతరించి పోవుట

[మార్చు]

ప్రకృతిలో కొన్ని జీవరాశువు అంతరించిపోయాయి. ఉదా: డైనోసారులు వంటివి. వాటిని మనం చూడక పోయినా శిలాజాలఅధ్యయనం మూలంగా కనుగొన్నారు. దానికి ఆధారాలు ఉన్నాయి. అదే విధంగా ప్రకృతిలో పులులు, పిచ్చుకలు,రాబందులు వంటివి అంతరించిపోతున్నట్లు స్వష్టమైన ఆధారాలు ఉన్నాయి.పిచ్చుకలు మైక్రో తరంగాల మూలంగా నాశనమవుతున్నట్లు ప్రకటిస్తున్నారు. అలానే తెలుగు భాషలో వ్యాసం లో గల పదాలు అంతరిస్తూ ఉన్నట్లు ఆధారాలు చేర్చితె బాగుంటుంది లేదా వ్యాసం యొక్క పేరును తెలుగు భాషలో వినియోగిస్తున్న ఆంగ్ల పదాలు అని మార్చితే బాగుంటుంది.(  కె. వి. రమణ. చర్చ 16:44, 6 మార్చి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

ఆంగ్ల భాష

[మార్చు]

ఆంగ్ల భాష వ్యాసంలో ఉప విభాగంగా తెలుగువారు అనుదిన జీవితంలో విస్తృతంగా వాడే ఇంగ్లీషు పదాలు పెద్ద జాబితా ఉన్నది. ఇప్పుడు జరుగుతున్న చర్చలో కొన్ని విషయాలు కూడా వున్నాయి. చూడండి.Rajasekhar1961 (చర్చ) 07:00, 7 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Removed below

[మార్చు]

I removed below, as these are either flowery words, own opinions, suggestions.

15వ శతాబ్దంలో నికోలా డా కాంటీ అను బ్రిటీష్ మహాశయుడు తెలుగును "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" గా అభివర్ణించాడు. తుళువరాజు శ్రీకృష్ణదేవరాయలు 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని తెలుగు భాషను కొనియాడాడు. ఎంతో మధురమైన, తియ్యనైన తెలుగు భాష నేడు ఆంగ్లభాష విష ప్రభావానికి గురి అయ్యి ఎన్నో వాడుక పదాలను కోల్పోతోంది. పదాలు వాడుకలో లేకపోతే అవి కాల క్రమేణా భాషలోంచి తమ ఉనికిని కోల్పోతాయి. దురదృష్టవశాత్తు ఈరోజుల్లో సాధారణ వ్యక్తి మాట్లాడే భాషలో దాదాపు సగం వరకూ ఆంగ్ల పదాలే వినిపిస్తున్నాయి. తెలుగు భాష ను స్పష్టంగా మాట్లాడలేని పరిస్తితిలో నేటి పిల్లలు, యువతీ యువకులు ఉన్నారు. ఈ రోజుల్లో ఇద్దరు వ్యక్తులు ఇంగ్లీషులో మాట్లాడుకుంటున్నారు అంటే తప్పనిసరిగా వారు తెలుగువారు అయివుండొచ్చని ఒక వేళ అనుకున్నా అతిశయోక్తి కాదు. తెలుగు మాట్లాడేవారిని చాలా సందర్భాలలో చులకనగా / అనాగరికులుగా చూస్తున్నారు. నేడు తెలుగు భాష ఇంతటి దౌర్భాగ్య స్థితిలో ఉండటం దురదృష్టకరం. పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలుగును భవిష్యత్ తరాలు పుస్తకాలలో మాత్రమే చూడగలరు.


తెలుగు భాషను కాపాడుకునే విధానం

తెలుగు మాతృభాష అని, ఇంగ్లీషు కేవలం బ్రతుకు తెరువు కోసం మాట్లాడే పరాయి భాష అని తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలియజెప్పాలి. ముందుగా మాతృ భాష నేర్చుకుంటే పరాయి భాష చాలా సులభంగా నేర్చుకోవచ్చు. కనుక పిల్లలకు విధ్యార్ధి దశనుండే తెలుగు భాషను అలవరచాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల చేత మమ్మీ, డాడీలకు బదులు అమ్మ, నాన్న అని పిలిపించుకోవాలి. పిల్లలకు పెద్దబాల శిక్ష, చందమామ కధలు, నీతి పద్యాలు వంటివి బోధించాలి.

Also removed wiki-links, as they cannot be references. May be we should put them under Also see... section.

పరిచయం మార్పు

[మార్చు]

ఈ వ్యాసపు పరిచయాన్ని ఎవరో మార్చారు. ఇంకా అభివృద్ది చేయాల్సి ఉన్నది. భారత దేశంలో సుమారు అన్ని భాషలు ఆంగ్ల భాష ప్రభావానికి గురి అవుతున్నాయి. అన్ని భాషలకంటే తెలుగు ఎక్కువగా ఆంగ్ల భాష దాడికి గురి అవుతున్నది. కనుక తెలుగు భాష ఏ విధంగా ఆంగ్ల భాషకు గురి అవుతున్నది మాత్రమే ఇక్కడ వ్రాయాలి. ఇతర భాషల గురించి చర్చ ఇక్కడ అనవసరము. నేను మరలా వ్యాసానికి సరిపోయేలా పరిచయాన్ని మారుస్తాను.

(భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 10:21, 21 మార్చి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

What 106.76.212.68 16:27, 4 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Weeding 175.101.105.11 11:22, 15 మార్చి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Physics 103.157.149.199 17:35, 15 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]