చర్చ:పింగళి దశరధరామ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.
వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పత్రికల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పత్రికలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


పింగళి దశరధరామ్ బొమ్మ ఎవరైనా సభ్యులు వికిలోకి ఎక్కిస్తే బాగుంటుంది. అలాగే ఎన్‌కౌంటరు పత్రిక చిత్రం కూడ వ్యాసంలో ఎక్కించాలి. విజయవాడ ప్రాంత సభ్యులకు ఇవి సులభంగా దొరుకుతాయి, ముఖ్యంగా సెకండ్ హాండ్‌ పుస్తకాల సాపులో దొరుకుతాయి.

ఇతను యెల్లొ జర్నలిజంకు తెలుగు నాట తెర తీశాడు. ఈ విషయం వ్యాసంలో వ్రాద్దామా?? వ్రాశే పద్ధతులలో దాదాపు బూతులు వ్రాస్తున్నట్టుగా ఉండేవి. అతను వ్రాసిన విషయాలు చాలాసార్లు నిజమయినా, వ్రాసే పద్ధతి జనామోదం కాక పోవటంతో, చౌకబారు పేరయితే సంపాయించాడుగాని, మంచిపేరు పెద్దగా రాలేదు.పలుకుబడిగల పెద్దపెద్ద రాజకీయనాయకుల వ్యక్తిగత విషయాలు దాదాపు చీదర పుట్టేట్టు వ్రాశేవాడు.అలా వ్రాసి వ్రాసి ప్రాణంమీదకు తెచ్చుకున్నాడని అంటారు. చివరి రోజులలో బాగా తాగుడికి అలవాటు పడ్డాడని అంటారు.--SIVA 16:24, 25 డిసెంబర్ 2008 (UTC)

యెల్లొ జర్నలిజం అంటే[మార్చు]

ఇంగ్లీషు వికీపీడియా ప్రకారం యెల్లొ జర్నలిజం అంటే:

  • భయం పుట్టించేటటువంటి పెద్ద పెద్ద పతాక శీర్షికలు (హెడ్‌లైనులు), ఎక్కువసార్లు అల్పమైన విషయాల గురించి
  • బొమ్మలు లేదా ఊహా చిత్రాల అతి వాడకం
  • కల్పిత ఇంటర్వ్యూలు, తప్పుదారి పట్టించే పతాక శీర్షికలు, సైన్సు లాగ కనిపించే విధంగా వ్రాయటం, నిపుణులుగా పిలవ బడే వారిచే పనికిరాని తప్పుడు విజ్ఞానం
  • ఆదివారపు అనుబంధాలను (సాధారణంగ వ్యంగ్య చిత్రమాలికలతో )పూర్తి రంగులలో వేయాలన్న పట్టుదల (ప్రస్తుతం ఈ పని అన్ని పత్రికలు చేస్తున్నాయి)
  • సంఘ పద్ధతులకు వ్యతిరేకంగా సామాన్య వ్యక్తి మీద అవసరానికి మించి అసాధారణ (అన్‌రీజనబుల్) సానుభూతి.

పైన ఉదహరించిన విషయాలలో దాదాపు అన్నిటిలోనూ ఎన్‌కౌంటర్ ముందుండేది.--SIVA 00:34, 26 డిసెంబర్ 2008 (UTC)

సుప్రసిద్ధ ఆంధ్రుడు[మార్చు]

వ్యాసానికి సుప్రసిద్ధ ఆంధ్రులు మూస తగిలించబడినది. ఎన్‌కౌంటర్ ‌ పత్రికద్వారా చాలా సంచలనం సృష్టించాడు కాని, సుప్రసిద్ధ ఆంధ్రుడిగా పేర్కొనడం ఎంతవరకు సబబు అన్న విషయం మీద కొంత చర్చ జరగాలి. ఎటువంటి వ్యక్తుల మీద వ్రాసిన వ్యాసాలకు ఈ మూస తగిలించవచ్చు అన్న విషయం మీద ఏమయినా మార్గదర్శక సూత్రాలు ఉన్నాయా??--SIVA 01:08, 27 డిసెంబర్ 2008 (UTC)

మంచిగా ప్రసిద్ధి కావచ్చు, చెడుగా ప్రసిద్ధికెక్కవచ్చు. కానీ మంచిగా ప్రసిద్ధికెక్కిన వాళ్ళను ఈ జాబితాలో చేరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక ఈ వ్యాసం విషయానికొస్తే ఈయన యెల్లో జర్నలిజం అనే పద్దతినిపెట్టి, ఒకవిధంగా పత్రికా రంగాన్ని కలుషితం చేశాడని భావిస్తాను. కాబట్టి సుప్రసిద్ధ ఆంధ్రుల వర్గం నుంచి తొలగించవచ్చు. రవిచంద్ర(చర్చ) 05:14, 27 డిసెంబర్ 2008 (UTC)
ఆంధ్రదేశంలో పేరుమోసిన వాళ్ళందరినీ సుప్రసిద్ధ ఆంధ్రులు అనరనుకుంటా --వైజాసత్య 08:04, 27 డిసెంబర్ 2008 (UTC)
సత్యాగారూ! సుప్రసిద్ధ మాటలోనే ఉన్నది మంచిపేరు అని. కాబట్టి మంచిపేరు తెచ్చుకున్న వారినే సుప్రసిద్ధ అని వ్యవహరించటం సబబు. లేకపోతే ఇలా చెడ్డపైరైనా సరే పేరైతే చాలంటే, ఊరికొక రౌడీగురించి వ్యాసాలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉన్నది,అభిలషిణీయంకాదు.--SIVA 15:29, 27 డిసెంబర్ 2008 (UTC)
నా అభిప్రాయాన్ని ఇక్కడ తెలియజేశాను. -- C.Chandra Kanth Rao(చర్చ) 14:35, 27 డిసెంబర్ 2008 (UTC)