చర్చ:ప్రభుత్వ ఉన్నత విద్య అధ్యయన సంస్థ
స్వరూపం
సంస్థలో పనిచేసే సిబ్బంది పేర్లు కూడా వ్రాసే అవసరం ఉన్నదా? తరుచుగా మారే, అవసరం లేని మరియు పరిశీలించడానికి, తాజాకరణ చేయడానికి వీలులేని విషయాలు వ్రాయకపోవడం మంచిది. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:32, 8 నవంబర్ 2013 (UTC)
- సిబ్బంది తరచూ మారుతుండడం వల్ల వారి పేర్లను తొలగించాలి. కానీ ఈ సంస్థలో గల సిబ్బంది హోదాలను తెలియజేస్తే మంచిది. ఏ ఫాకల్టీ ఎందరు ఉన్నారో తెలియజేస్తే సరిపోతుందని నా అభిప్రాయం.----K.Venkataramana (talk) 17:44, 8 నవంబర్ 2013 (UTC)
- చంద్రకాంతరావుగారి సూచన సరైనదే. సిబ్బంది పేర్లు అక్కరలేదు, కాన, సిబ్బంది పేర్లను తొలగించవచ్చు. బదిలీలు, పదవీవిరమణలు, ప్రమోషన్లు, మరణాలు, దీర్ఘకాలిక శెలవులు మొ. వాటిమూలాన తాజాకరణ ప్రతి సంవత్సరం చేయడం అసంభవం. లోహిత్ గారు సూచించినట్లు ముఖ్యమైన సిబ్బంది హోదాలను చూపడమూ సరైనదే. అలాగే స్థాపించిన కాలం నాటి నుండి నేటి వరకు ఆసీనులైనటువంటి ప్రింసిపాళ్ళ పేర్లను సూచించవచ్చు. అహ్మద్ నిసార్ (చర్చ) 20:04, 9 నవంబర్ 2013 (UTC)
- కొత్త సభ్యులు ఇలాంటి పొరబాట్లు చేయడం సహజమే, వీటికై ముందు చర్చించనవసరము లేదు. వాటిని తొలగించటమే మంచిది. ప్రస్తుతానికి నేను చేస్తాను --అర్జున (చర్చ) 05:16, 10 నవంబర్ 2013 (UTC)
సంస్థ తెలుగు పేరు తికమక కలిగించగలదు
[మార్చు]సంస్థ పేరు తికమక కలిగించేటట్లుగా వుంది. ఉన్నత విద్య అనేది యూనివర్శిటీ స్థాయి విద్య మొత్తము అని కూడా సూచిస్తుంది. ఇక్కడ సంస్థ పరిధి భాషా ఉన్నత విద్య గురించినది లాగా వుంది. User:Svgvenuvu గారు మరియు ఇతరులు ఈ సంస్థ తెలుగు పేరుపై స్పందించమని కోరిక.--అర్జున (చర్చ) 05:25, 10 నవంబర్ 2013 (UTC)
- ప్రభుత్వ విద్యాపరమైన ఉన్నత అధ్యయన సంస్థ అని మెరుగైన పేరేమో.--అర్జున (చర్చ) 05:28, 10 నవంబర్ 2013 (UTC)
- [[ప్రభుత్వ ఉన్నత విద్యాఅధ్యయన సంస్థ]] పేరు సరిపోతుందనుకుంటాను. ఉన్నత విద్య అంటే వేరే అర్థం వస్తుంది, కాని ఇక్కడ విద్యకు దీర్ఘం పెట్టి అధ్యయన సంస్థలో కలపాలి (విద్యాఅధ్యయన సంస్థ). దీనివల్ల అర్థం కూడా కలిసివస్తుంది. అలాగే ఇలాంటి సంస్థలు చాలా ఉండవచ్చు, కాబట్టి చివర హైదరాబాదు పేరు కూడా జతచేయాలి. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:45, 10 నవంబర్ 2013 (UTC)
ఆంగ్లంలో Government Institute of Advanced Study in Education - Hyderabad. Advanced Study ని ఉన్నత విద్య అని, Institute ని అధ్యయన సంస్థ అని రాయడం జరిగింది.