ప్రభుత్వ ఉన్నత విద్య అధ్యయన సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రభుత్వ ఉన్నత విద్య అధ్యయన సంస్థ, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్
ప్రభుత్వ ఉన్నత విద్య అధ్యయన సంస్థ.jpeg
స్థాపితం1959 (1959)
ప్రధానాధ్యాపకుడుఎం పద్మావతి
స్థానంహైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, భారత దేశం
కాంపస్పట్టణ

ప్రభుత్వ ఉన్నత విద్య అధ్యయన సంస్థ అక్టోబర్2వ తీదీన 1959లో బషీరుబాగులో ప్రభుత్వ శిక్షణాకళాశాల పేరుతో స్థాపించబడింది. ఆ తర్వాత ప్రభుత్వ విద్యా కళాశాల పేరుతో మాసబ్ టాంక్ కి మార్చబడింది. ఈకళాశాలలో వివిధ కోర్సులను ప్రవేశపెట్టడం వల్ల "Government Comprehensive College of Education" అని పేరును మార్చారు. ఉపాధ్యాయ విద్యలో పలు మార్పులు సంస్కరణలు రావడం వల్ల ఈ కళాశాల Government Institute of Advanced Studies In Education హోదా పొందింది. ఈ కళాశాల. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నగరం హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లో ఉంది. ఈ కళాశాలలో పూర్వ- ఉపాధ్యాయ (ఉపాధ్యాయ శిక్షణా నిమిత్తం కళాశాలలో చేరిన వారికి) శిక్షణ ప్రవేశానికి ఆయా కోర్సులలో ప్రతి సంవత్సరము ఎల్ పి.సెట్ (ప్రభుత్వ పరంగాను), పరీక్ష మరియి బి.ఎడ్., ఎం.ఎడ్., లకు ఉస్మానియా విశ్వవిద్యాలయము పరంగాను ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షలలో ఎంపికైన విద్యార్థులకు మాత్రమే ఈ సంస్థలో ప్రవేశం ఉంటుంది. ప్రస్తుతం బడులలో లేదా కళాశాలలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు విషయపరంగా లేదా బోధనా పద్ధతుల పైన లేదా శిక్షణ లేదా కార్యశాలలను నిర్వహించగలరు. విద్యా పరిశోధనలపై తగిన సూచనలు, సలహాలను ఇవ్వగలరు.

కళాశాల అందిస్తున్న ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు[మార్చు]

  1. తెలుగు పండితుల శిక్షణ (T.P.T.)
  2. హిందీ పండిత శిక్షణ (H.P.T.)
  3. ఉర్దూ పండిత శిక్షణ (U.P.T.)
  4. బి.ఎడ్. (B.Ed.)
  5. ఎం.ఎడ్. (M.Ed.)

బయటి లంకెలు[మార్చు]

https://www.facebook.com/govtiasemasabtankts.eportfolio[మార్చు]

https://www.facebook.com/govtiasemasabtank.apindia/?fref=ts[మార్చు]

వనరులు[మార్చు]