Jump to content

చర్చ:బొబ్బర్లంక (ఆత్రేయపురం)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

కాటన్ కట్టింఛిన ఆనకట్ట లొ 2 వది,

  1. ధవళేశ్వరం
  2. బొబ్బర్లంక
  3. మద్దూర్లంక
  4. విజ్జేశ్వరం లొ సహజవాయువు తొ విద్యుత్తు తయారు చేసేకేంద్రం ఉన్నది. అని నాలుగు భాగాలు


ఊరి పేరు

[మార్చు]
ఊరు పేరు తప్పు ఉన్నది, సరైన పేరు బొబ్బర్లంక, తూర్పు గోదావరి జిల్లాలొ గ్రామం
ఇక్కడ ఉన్న సమాచారం ప్రకారం తూగో జిల్లాలో ఉన్న సీతానగరం మండలంలో బొబ్బర్లంక అనే పేరుతో ఏ ఊరూ(గ్రామ పంచాయితీ) లేదు. "బొబిల్లంక" అనే పేరుతో మాత్రం ఒక ఊరు ఉంది. __మాకినేని ప్రదీపు (+/-మా) 09:36, 28 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఆ ఆంగ్లపేరు ఒక ప్రభుత్వ మూలం నుంచి వచ్చినా నమ్మడానికి వీల్లేదు. ఆ ప్రభుత్వ పట్టికలలో అక్కడక్కడ లిప్యాంతరీకరణ తప్పులు దొర్లాయి. తెలుగులో ఎక్కడైనా పేరుందేమో వెతకవచ్చు. (ఉదాహరణకు: తెలుగు వార్తాపత్రికలు). ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఒక్కోసారి గ్రామాలకు అసలు పేరు, వ్యవహారిక నామము వేరుగా ఉండొచ్చు. (ఉదాహరణ నాకు తెలిసిన ఈ గ్రామాలను పూండ్లచెన్నుపల్లె, పొదలకొండపల్లె, సత్యవోలు లను జనాలు కూంచేనుపల్లె, పొదలకుంటపల్లె, సత్వేలు అని వ్యవహరిస్తారు) --వైజాసత్య 17:21, 28 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
చర్చ:రాజమండ్రి (గ్రామీణ) చర్చా పేజి ని చూడండి.--మాటలబాబు 17:14, 7 ఆగష్టు 2007 (UTC)
  • ఈ వ్యాసంలో మరిన్ని తప్పులున్నట్టున్నాయి.
    • తూర్పు గోదావరి జిల్లా పటమని పేరు రాసి ఉంది గానీ, ఇచ్చిన మ్యాపు పశ్చిమ గోదావరిది. ఆంధ్ర ప్రదేశ్ మ్యాపులో ఆత్రేయపురాన్ని చూపెట్టిన చుక్క స్థానంతో మండల మ్యాపును పోల్చి చూడండి.
    • జూనియరు కళాశాల పైన ఉన్న పేరు పశ్చిమ గోదావరి అని పడింది (దీన్ని సరిచేసాను).
  • ఇక, బొబ్బర్లంక అనే ఊరు కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో ఉంది. భారత జనగణన శాఖ ప్రకారం తూ.గో లో బొబ్బిల్లంక అనే ఊరు సీతానగరం మండలంలో ఉంది. ఆ ప్రకారం మనం పేజీ తయారు చేసాం. వారి లెక్కల్లో తూ.గో.లో ఆసలు బొబ్బర్లంక అనే ఊరే లేదు.
  • పోతే వైజాసత్య అన్నట్టు ప్రభుత్వం చెప్పినంత మాత్రాన వాటిని నమ్మేందుకు వీల్లేదు. మన ఊళ్ళ పేర్లు చాలావాటిని తప్పుగా రాసారీ జనగణన జనులు. పల్లి లన్నిటినీ అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా పల్లెలుగా మార్చేసారు. పైగా మనం తెలుగులోకి అనువదించేటపుడు మరి కొన్ని తప్పులు చేర్చాం. అన్నీ కలిసి ఊళ్ళ పేర్లలో చాలా తప్పులు దొర్లాయి. మనం వాటిని సరిచేసుకుంటూ పోవాలి. అందుకు తగినవారు ఆయా ఊర్లవారు, ఆ చుట్టుపక్కలవారే!
  • ఈ సందర్భంగా నాదో అనుమానం.. మనకనేక చర్ల లున్నాయి చర్ల, మాచర్ల, బేతంచర్ల, కంచికచర్ల, పేరేచర్ల ఇలాగ. నేను వాటిని చర్ల అని అనుకుంటూ ఉన్నాను. వికీలో కొన్ని చోట్ల చెర్ల అని రాసారు. ఏది రైటో ఏది కాదో నిర్ధారించాలి. ఇలాంటివి ఇంకా ఎన్నో!? __చదువరి (చర్చరచనలు) 18:02, 7 ఆగష్టు 2007 (UTC)
పాత మూస నుండి కొత్త మూస మార్చటంలో పటము విషయంలో నాచేతే తప్పుదొర్లింది దాన్ని సరిదిద్దాను.
మాటలబాబు చూపించిన ఈ లింకు ప్రకారం తూగోలో కూడా బొబ్బర్లంక ఉందని నిర్ధారించుకొని ఈ పేజీ సృష్టించాను.
పల్లి, పల్లెల్లో మరియు చర్ల, చెర్లలలో ఏది సరైనది అని చాలాసార్లు ఖచ్చితంగా చెప్పలేం. ఒక్కోసారి అధికారికంగా ఒక విధంగా రాస్తే వ్యవహారికంలో ఇంకోలాగా పిలుస్తుంటారు. ఏ వాడుక ప్రామాణికమైనదో ప్రభుత్వ రికార్డులతో (ఎక్కడైనా తెలుగులో రాసి తగలడుంటే..) నిర్ధారించుకోవచ్చు (అవి కూడా ఎంత ప్రమాణికంగా వాడుతున్నారో :-(). కొన్ని సార్లు ప్రభుత్వ బస్సులపై మాచర్ల అని చూశాను, మాచెర్ల అని కూడా చూశాను
--వైజాసత్య 18:47, 7 ఆగష్టు 2007 (UTC)

బొబ్బర్లంక గురించి

[మార్చు]

బొబ్బర్లంక గురించి చర్చ ఇక్కడ సందర్భోచితంగా ఉంటుందని చర్చ:బొబ్బర్లంక నుండి అతికిస్తున్నా. అక్కడా ఉంచెయ్యండి

ఒకసారి బొబ్బర్లంక ను పరిశీలించండి. ఊబలంక లొ అంటించిన బొమ్మ లొ కూడా బొబ్బర్ల్ంక పేరు ఉన్నది. దయచేసి పేజి చేస్తే అక్కడ బొమ్మలు అంటింస్తాను,బొబ్బర్ల్ంక పేజిలొ కూడా డ్యాం బొమ్మలు అంటిస్తాను--మాటలబాబు 09:46, 29 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఏ బొబ్బర్లంక. ఇదా? (బొబ్బర్లంక) --వైజాసత్య 09:50, 29 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఆ బొమ్మలో బొబ్బర్లంక పేరున్నట్టు గమనించాను. కానీ పేరుపై సందేహమొచ్చిన బొబ్బర్లంక (బొబ్బిల్లంక)ఈ బొబ్బర్లంక ఒకటేనా కాదా అన్నది నిర్ధారించుకోవాలి --వైజాసత్య 09:52, 29 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
బొబ్బర్లంక ఆత్రేయపురం మండలంలొ ఉన్నది--మాటలబాబు 10:02, 29 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
బొబ్బర్లంక కోసం లింకు[1]--మాటలబాబు 10:29, 29 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]