Coordinates: 16°45′12″N 81°49′56″E / 16.7532°N 81.8322°E / 16.7532; 81.8322

ఊబలంక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఊబలంక
—  రెవిన్యూ గ్రామం  —
ఊబలంక is located in Andhra Pradesh
ఊబలంక
ఊబలంక
అక్షాంశరేఖాంశాలు: 16°45′12″N 81°49′56″E / 16.7532°N 81.8322°E / 16.7532; 81.8322
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కోనసీమ
మండలం రావులపాలెం
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 7,840
 - పురుషులు 3,966
 - స్త్రీలు 3,874
 - గృహాల సంఖ్య 2,151
పిన్ కోడ్ 533237
ఎస్.టి.డి కోడ్
ఊబలంక పంట కాలువ
ఊబలంక పంట కాలువ

ఊబలంక, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రావులపాలెం మండలానికి చెందిన గ్రామం.[1]

ఇది మండల కేంద్రమైన రావులపాలెం నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రాజమహేంద్రవరం నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,703.[2] ఇందులో పురుషుల సంఖ్య 3,901, మహిళల సంఖ్య 3,802, గ్రామంలో నివాసగృహాలు 1,935 ఉన్నాయి.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2151 ఇళ్లతో, 7840 జనాభాతో 697 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3966, ఆడవారి సంఖ్య 3874. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 780 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 169. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587668.[3] పిన్ కోడ్: 533237.

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి ఒక వైపు 3 కి.మీ. దూరంలో పుణ్యక్షేత్రమైన ర్యాలి, మరియొక వైపు 6 కి.మీ. దూరంలో పుణ్యక్షేత్రమైన వాడపల్లి ఉంది. ఈ గ్రామానికి రాజమండ్రి, రావులపాలెంనుండి అర గంట కొక బస్సు సౌకర్యం ఉంది.ఊబలంక గ్రామదేవత కనకమహాలక్ష్మి అమ్మవారు . ఈ గ్రామం వ్యవసాయము, పొగాకు వ్యాపార ఆధారిత గ్రామం. ఈ గ్రామంలో వరిచేలు ఉన్నాయి. అవి కాకుండాఅరటి, కొబ్బరి తోటలు ఉన్నాయి. గ్రామానికి ప్రధాన రహదారి ప్రక్కన పంట కాలువ ఉంది. ర్యాలి వెళ్ళే రహదారి జంక్షన్ వద్ద సాయి బాబా గుడి, దత్తాత్రాయే స్వామి గుడి, వేంకటేశ్వర స్వామి గుడి ఉన్నాయి.

కనకమహాలక్ష్మి ఆలయము ఊబలంక

ఊబలంక లో వున్న దేవాలయాలు[మార్చు]

ఊబలంకలో ప్రతి వీధికొక దేవాలయం ఉంది. అందువల్లే ప్రతి వీధి గుడి పేరుతొ పిలువబడుతుంది. శివాలయం వీధి, రామాలయం వీధి అంటూ. శివాలయం-వూరి మధ్యలో ఉంటుంది. రామాలయం-శివాలయంకి దగ్గరలో ఉంటుంది. కనక దుర్గ ఆలయం- రామాలయంకి ఎదురుగ కాలవ వడ్డున ఉంటుంది. సుభ్రమన్యస్వామి ఆలయం-శివాలయంతో పాటు ఉంటుంది. కొటసత్తెమ్మ ఆలయమం-చిన్నవంతెన దగ్గరలో ఉంటుంది. మహాలక్ష్మి ఆలయం-గ్రామ దేవత.వూరి మధ్యలో ఉంటుంది. వినాయకుడి గుడి, షిర్దిసాయి బాబా గుడి, సరస్వతి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి, ఇవి నాలుగు వూరి చివర ఉన్నాయి. ఉరికి చేర్చి గోదావరి నది ప్రవహిస్తోంది. సంక్రాంతి పండుగలలో కనుమ రోజు గ్రామ దేవత ఉరేగింపు చూడ చక్కనిది. గ్రామ దేవత తీర్థం, శివరాత్రి, సాయి బాబా జయంతి, మేడపాటి వారి సత్తెమ్మ సంబరాలు చూడ తగినవి.

విద్యా సౌకర్యాలు[మార్చు]

ఆర్.టి.సి. రోడ్డు మ్యాపు

గ్రామంలో సెకండరీ స్కూల్ స్థాయి వరకు విద్యాసౌకర్యం ఉంది. గ్రామంలో రెండు ప్రైమరీ స్కూళ్ళు, ఒక ఉన్నత పాఠశాల ఉన్నాయి. మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ చనిపోయిన తేది అయిన 31.10.1984 న అప్పటి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఆధ్యక్షుడు శ్రీ బొడ్డు భాస్కర రామారావు గారిచే గ్రామంలో ఉన్నత ఎలిమెంటరీ స్కూలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా మార్పు చెందింది. శ్రీ అయ్యల సోమయాజుల లక్ష్మీ నరసింహ శర్మ తొలి ప్రధానోపాధ్యాయులు. ఈ ఉరిలో ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది.

ఇతర విశేషాలు[మార్చు]

ఇక్కడి హోటల్లలో టిఫిను రుచికరంగా ఉంటుంది. ఒకప్పుడు రావులపాలెం సెంటరు ప్రసిద్ధిచెందక ముందు ఆర్.టి. సి బస్సులు ఈ ఊరిలోనే హోటల్లలో టిఫిను కోసం ఆగి వెళ్ళేవి. మెడికల్ షాప్ లు, కిరాణా షాప్ లు పుష్కలంగా ఉన్నాయి. ఏటిగట్టు, పక్కన కాలవ, గట్టుకి అవతల పచ్చని పొలాలు అందంగా ఉంటాయి. గ్రామానికి చేర్చి ఉన్న లంక భూములు సారవంతమైనవి. సీమ చింత చెట్లు అత్యధికంగా ఈ లంక భూముల్లో ఉంటాయి. అరటి, కొబ్బరి, కంద, పసుపు, పొగాకు, కూరగాయలు లంక భూముల్లో పండుతాయి. స్వర్గీయ శ్రీ చిర్ల సోమసుందర రెడ్డి శాసన సభ్యులుగా ఉండగా ఊరినుండి లంక చేరుటకు పెద్ద వంతెన కట్టబడింది.

1986 లో గోదావరి వరదలకు పూర్తిగా గ్రామంలో ఉటలు వేసి రోడ్లు, ఇళ్ళు పాడైపోయినవి. తరువాత క్రమంగా భవనాలు ఇళ్ళ స్థానే నిర్మితమయినాయి. 1996 లో వచ్చిన తుఫాను ప్రభావం ఈ ఊరిపై ఉంది. సుమారు రెండు శతాబ్దాల చరిత్ర ఈ గ్రామానికి ఉంది. స్వాతంత్ర్యోద్యమ కాలంలో గాంధీ ఈ ప్రాంతాన్ని సందర్సించాడు. ఈ ఉరిలో గాంధీ బొమ్మ సెంటర్, వినాయక గుడి దగ్గర రావి చెట్టు, శివాలయం, కోట సత్తెమ్మ గుడి ప్రాంతాలు పెద్దల విశ్రాంతి స్థావరాలు. ఈ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలైన పోస్ట్ ఆఫీసు, షెడ్యూల్ బ్యాంకు అయిన ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకు ఉన్నాయి. పిన్ కోడ్ 533237. సమీపంలోని లోల్ల, వాడపల్లి గ్రామాలు సబ్ పోస్ట్ ఆఫీసులు.

వీటితో పాటు ఈ ఊరిలో ప్రముకంగా కాంట్రలకు పుట్టినిల్లు

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు ఆరు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల రావులపాలెంలోను, ఇంజనీరింగ్ కళాశాల రాజమండ్రిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ రాజమహేంద్రవరం ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం రావులపాలెంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల రాజమహేంద్రవరం లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

ఉబలంకలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

ఉబలంకలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

ఉబలంకలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 420 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 2 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 274 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 83 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 190 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

ఉబలంకలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 190 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

ఉబలంకలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, అరటి

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-09.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-09.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
"https://te.wikipedia.org/w/index.php?title=ఊబలంక&oldid=4033814" నుండి వెలికితీశారు