Jump to content

చర్చ:మానవ మస్తిష్కం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

శీర్షిక మానవ మెదడుగా మార్చాలి

[మార్చు]

నరసింహమూర్తి గారూ ఈ వ్యాసం మానవ మెదడు అనే శీర్షికతో ఉండాలనుకుంటున్నాను.ఆంగ్ల వికీపీడియాలో దీనికి తగిన వ్యాసం en:Human brain అని అనుకుంటున్నాను.ఇంకొక విషయం ఆంగ్లవికీపీడియాలో en:Brain అనే వ్యాసానికి లింకైన వ్యాసం తెలుగు వికీపీడియాలో మెదడు అనే శీర్షికతో ఉంది.దీనిని గమనించగలరు.అయినా ఇవన్నీ ఒకటి గదా అని అనుకుంటున్నాను.ఒక వేళ మెదడు అన్ని ప్రాణులకు చెందిన వ్యాసం అయితే మెదడు ( మస్తిష్క ) నిర్మాణము వ్యాసం పొన తెలిపిన విధముగా మార్చితే సరిపోతుందని అనుకుంటున్నాను. పరిశీలించగలరు. యర్రా రామారావు (చర్చ) 07:17, 2 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]

రామారావు గారూ , ఇపుడు వికీ పిడియాలో ఇదివరకున్న మెదడు వ్యాసమును చూసానండి. ఆ వ్యాసపు శీర్షికను ‘ మానవులలో మెదడు ‘ గా మార్చవచ్చును.ఆ వ్యాసములో భాగముల ఉపశీర్షికలో నా వ్యాసములో పెద్ద మెదడు గురించి వ్రాసిన భాగమును చేరుస్తాను. డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 17:48, 2 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రియమైన రామారావు గారూ, ఈ వ్యాసంలో శైలి మార్పులు చేసాను. మరికొన్ని కొత్త విషయాలు చేర్చాను. మూలాలు చేర్చాను. ‘ మానవ మస్తిష్కం ‘అనే శీర్షిక పెట్టి అందులోనికి వ్యాసము తరలిస్తే బాగుంటుందనుకుంటాను. డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 01:03, 3 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ రెండు వ్యాసాలకు తేడా ఉందంటరా మస్తిష్కం అంటే మెదడు అనే గదా అర్థం.రెండిటికి తేడా ఉంటే మరికొంత వివరంగా వివరించగలరు. యర్రా రామారావు (చర్చ) 03:30, 3 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రియమైన రామారావు గారూ, నమస్సులు. మానవ మస్తిష్కం సమాసములో రెండు పదాలు సంస్కృత పదాలు.అందు వలన సమస్య లేదు. మానవ మెదడు మిశ్రమ సమాసంలో మొదటి పదము సంస్కృతం రెండవ పదం తెలుగు. మిశ్రమ సమాసాలలో తొలి పదము తెలుగు తరువాత పదము సంస్కృతం ఉంటే ( ఉదా: బంగారు పుష్పములు, మంచి బాలుడు ) బాగానే ఉంటాయి. మొదటి పదం సంస్కృతం, రెండవ పదం తెలుగు ఉన్నవి (ఉదా: సువర్ణ పూలు, సుకుఱ్ఱవాడు,)సాధారణంగా ఆమోదకరము కాదు. వికీపిడియాలో వ్యాకరణము ముఖ్యము కాదనుకొండి. డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 04:40, 3 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]
రామారావు గారూ, నరసింహ మూర్తి గారు చెప్పింది సబబుగా ఉంది. మానవ మెదడు అనే పదం తెలుగు, సంస్కృత పదాల కలయిక కాబట్టి దుష్ట సమాసం (రెండు వేర్వేరు భాషల పదాల కలయిక) అవుతుంది కాబట్టి వాడరు. ఈ వ్యాసం మానవ మస్తిష్కం అనే పేరుతో ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం. కావాలంటే మనిషి మెదడు అనే పేరు నుంచి ఈ వ్యాసానికి దారి మార్పు ఇవ్వవచ్చు. - రవిచంద్ర (చర్చ) 05:52, 3 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]
చర్చలలో పాల్గొంటేనే సమస్యలకు పరిష్కారం ఉంటుంది.నేను ఆ ఉద్దేశ్యంతో ముందే తరలించాను.గమనించగలరు. యర్రా రామారావు (చర్చ) 06:02, 3 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]
మానవ మస్తిష్కం నకు మనిషి మెదడు అనే దారి మార్పు ఇచ్చేదానికంటే మనిషి మెదడు అని తరలింపు చేయవచ్చుగదా ?ఇది కూడా ఆలోచించగలరు. యర్రా రామారావు (చర్చ) 06:06, 3 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]