వాడుకరి చర్చ:డా. గన్నవరపు నరసింహమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం

[మార్చు]
డా. గన్నవరపు నరసింహమూర్తి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

డా. గన్నవరపు నరసింహమూర్తి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

వికీపీడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో మీకు వివరించేందుకు, మీ సందేహాలను తీర్చేందుకూ వాడుకరి:KINNERA ARAVIND గారిని ప్రత్యేకంగా మీకోసం గురువుగా కేటాయించారు. ఏ సంకోచమూ లేకుండా వారిని మీ సందేహాలు అడగవచ్చు. మీకు ప్రత్యేకంగా ఒక హోంపేజీ కూడా ఉంది చూడండి. అక్కడ మీకవసరమైన ఏ సహాయమైనా చేసేందుకు KINNERA ARAVIND గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పలకరించండి.
  • తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   ➠ కె.వెంకటరమణచర్చ 06:34, 19 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

మధుమేహం శీర్షికతో మరొక వ్యాసం ఉంది

[మార్చు]

గన్నవరపు నరసింహమూర్తి గారూ మీరు మధుమేహవ్యాధి వ్యాసం సృష్టించినందుకు ధన్యవాదాలు.కానీ మధుమేహం శీర్షికతో 2006లోనే వ్యాసం సృష్టించి ఉంది.మీరు కొత్తగా వ్యాసం సృష్టించేటప్పుడు గతంలో ఏమైనా ఉన్నదేమోనని శీర్షికను పలురకాలపేర్లతో వెతికి లేదని నిర్థారించుకుని సృష్టించండి.లేకపోతే తొలగించటంమో, విలీనమో చేయాల్సి వస్తుందని గమనించగలరు.--యర్రా రామారావు (చర్చ) 02:36, 17 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

శ్రీ రామారావు గారూ నా వ్యాసమును పాత వ్యాసముతో విలీనము చేయగలిగితే చేయండి. కాని పక్షములో తొలగించండి. నిర్ణయము మీకే వదలిపెడుతాను. డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 03:23, 17 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
మీ సత్వరస్పందనకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 05:04, 17 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మూలాలు చేర్చటం

[మార్చు]

@డా. గన్నవరపు నరసింహమూర్తి గారు, మూలాలు విషయం చేర్చిన వద్ద {{Cite web}}లాంటి మూసలు వాడి చేర్చాలి. మీ సవరణ లో కేవలం URL చేర్చారు. దానివలన, ఇతరులకు ఉపయోగం అంతగా లేకపోగా, ఇతర నిర్వాహకులకు అదనపు శ్రమ కలుగుతుంది. పై స్వాగత సందేశంలో వికీపీడియా గురించి తెలుసుకోవటానికి వివరాల లింకులున్నాయి. అవి చదవండి. సందేహాలుంటే అడగండి. అర్జున (చర్చ) 01:53, 5 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

రేబీస్ పదము పుట్టుకకు లింకును మీ సూచనలను అనుసరించి జతపర్చానండి. లింకులో నాల్గవ పుటలో లాటిన్ లో rebere పదము, సంస్కృతములో రభస పదమునకు గల సంబంధము గురించి ఉన్నది. సరిపోతుందా ? డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 03:39, 5 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@డా. గన్నవరపు నరసింహమూర్తి గారు, సరిపోదండి. మూసలను పరామితులతో వాడాలి. మీరు విజువల్ ఎడిటర్ వాడుతుంటే చొప్పించు ఆదేశ వరుసలో మూస ఎంపిక చేసి మూస పేరు ( Cite web )చేర్చి ఆ తరువాత దానికి గల పరామితులకు వివరాలు చేర్చాలి. అర్జున (చర్చ) 05:11, 5 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@డా. గన్నవరపు నరసింహమూర్తి గారు, మీ సవరణలు మరింత నిశితంగా పరిశీలించాను. మీరు చేర్చాలనుకున్నదానికి ఉదాహరణగా ఆ సవరణ చూడండి. -- అర్జున (చర్చ) 09:28, 5 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదములు . డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 12:35, 5 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు సృష్టించిన ఆరోగ్యసంబంధమైన వ్యాసాలు గురించి

[మార్చు]

గన్నవరపు నరసింహమూర్తి గారూ నమస్కారం, మీరు వికీపీడీయాలో చేరి, ఎంతో ఆసక్తిగా,తెలుగు వికీపీడియాలో ఆరోగ్యసంబంధమైన వ్యాసాలు సృష్టించి నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు.క్షమించాలి. మరొక విషయం మీరు సృష్టించిన ఈ ఉబ్బు సిరలు ( వేరికోస్ వీన్స్ ), ఉష్ణ సంబంధ రుగ్మతలు , కాలి సిరలు , దూరధమని వ్యాధి, నారంగ కాలేయవ్యాధి , మస్తిష్క రక్త ప్రసరణ ( సెరిబ్రల్ సర్క్యులేషన్ ) , మస్తిష్క రక్తనాళ విఘాతములు , ముఖ కండరములు , ముఖ నాడులు ( ఫేషియల్ నెర్వ్స్ ) , ముఖ పక్షవాతము ( ఫేషియల్ పెరాలిసిస్ ) , మెదడు ( మస్తిష్క ) నిర్మాణము, రక్షణ వికటత్వము ( Anaphylaxis ), శరీర రక్షణ వ్యవస్థ ( Immune System ) ఇంకా మరికొన్ని ఉండవచ్చు ఇవన్నీ వికీపీడియాలో ఉండాల్సిన, ఉండదగిన వ్యాసాలు.అయితే వికిపీడియా మార్గదర్శకాలు, నియమాలు అనుసరించి మాత్రమే వికీపీడియాలో వ్యాసాలు రాయవలసిఉంటుంది.పై వ్యాసాలు అన్నీ తొలగింపుకు గురికాకుండా ఉండాలంటే ఈ క్రింది మార్గదర్శకాలు , నియామాలు పాటించాలి.

  1. పేజీ సృష్టించిన వాడుకరి అతని స్వంత బ్లాగులు, లేదా వెబ్సైట్ లింకులు మూలాలుగా పనికిరావు.
  2. మీరు మీకు చెందిన స్వంత బ్లాగు [1]https://gvnmurty.blogspot.com/ నుండి ఎలా ఉంటే అలా copypaste చేసారు.ఇవి అన్ని వికీశైలిలో తగిన విధంగా మార్పులతో రాయాలి.
  3. మీ బ్లాగు నుండి రాసినా మూలం చూపకూడదు. ఇతరత్రా నమ్మకమైన మూలాలు ఉన్న వెబ్సైటు లింకులు రెండు లేక మూడు చూపాలి.
  4. సాధ్యమైనంతవరకు వ్యాసంలో ఆంగ్లపదాలు, ఆంగ్ల వాక్యాలు ఉండకూడదు.

దయచేసి మీరు పై వ్యాసాలను సమయం తీసుకుని అన్నీ పై నియమాలకు అనుగుణంగా సవరణలు చేపట్టగలరు.ఇంకొక విన్నపం.దయచేసి నిర్వహకులు పెట్టిన నిర్వహణ మూసలు మీరు తొలగించవద్దు.దానికి తగిన విధంగా వ్యాసం సవరించినప్పుడు ఆ వ్యాస చర్చాపేజీలో మూస తొలగింపు అభ్యర్థన రాస్తే పరిశీలించి నిర్వహకులు ఎవరైనా తొలగించగలరు.అన్యధా భావించవద్దు. ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 08:23, 30 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారూ నమస్కారం. మీ సూచనసకు ధన్యవాదములు. కాపీ రైటుల సమస్య లేదని తెలపడానికే నా బ్లాగును మూలములో నిన్న చేర్చాను. దానిని మీరు తొలగించారు. నా వ్యాసాలను, రచనలను కవితలను స్వేచ్ఛగా పంచుకోవచ్చునని ప్రతిచోటా వ్రాస్తాను. నా బ్లాగును ఇకపై మూలాలలో చేర్చను.
నేను వ్యాసాలను నా బ్లాగు నుంచి గ్రహించినా వాటికి లేఖినిలోనో,వర్డ్లోనో పెట్టి మార్పులు చేస్తున్నాను. వ్యాసాలు వికీపిడియాలో ఉండదగినవని ప్రోత్సాహమిచ్చినందులకు ధన్యవాదములు. వ్యాసాలు వైజ్ఞానిక విషయాలవడం చేత, ప్రతి వ్యాసములోను విషయాలను చాలా సమగ్రంగాను, వీలయినంత క్లుప్తముగాను వ్రాసాను. వ్యాసాలన్నీ నాకు ప్రత్యక్ష అనుభవం ఉన్న విషయాలపైనే వ్రాసాను. శరీరనిర్మాణ విషయాలలో మార్పులు చేయడం కొంచెం కష్టమే. అలాగే వ్యాధుల ఉపశీర్షికలలో ( కారణాలు, లక్షణాలు, నిర్ణయము, చికిత్స, నివారణలు ) కూడా మార్పులు కష్టమే. అయినా మరికొన్ని మార్పులు చేయడానికి నా శక్తి కొలది ప్రయత్నిస్తాను. చాలా వరకు వ్యాసాలను శిష్టవ్యావహారికములోనికి మార్చాను. వికీశైలిని అలవరచుకొని మరికొన్ని మార్పులు తప్పక చేస్తాను.
మూలాలు లంకెలు చేర్చడం ఇంకా చేతకాలేదు. ఆ ప్రక్రియ నేర్చుకొని త్వరలోనే కొన్ని మూలాలు చేర్చుతాను. ఆంగ్లపదాలు కూడా తొలగిస్తాను. చాలా తెలుగు మాటలకు అర్థాలు ఆంగ్లములో చెప్పుకోవలసిన దుస్థితిలో ఉండడం వలన అవి చేరుస్తున్నాను. చాలా వరకు తొలగిస్తాను.
నా సాంకేతిక పరిజ్ఞానము పరిమితము. శీర్షికలు ఉపశీర్షికలు పెట్టడం, దస్త్రాలు చేర్చడం నేర్చుకొన్నాను. మూలాలు చేర్చడం నేర్చుకొంటే సరిపోతుంది.
కొన్ని కొత్త వైద్యగ్రంథాలు కొనుక్కొంటున్నాను. వాటిని అనుసరించి ఎలాగూ వికీపిడియాలో వ్యాసాలకు మార్పులు చేస్తాను. అపుడు వికీపిడియా వ్యాసాలు మరికొంత భిన్నంగా ఉంటాయి. కొద్ది వారాలు అవకాశం ఇయ్యమని నా విన్నపము. డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 18:13, 30 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు సార్, మీరు సహృదయంతో వికీ శైలి, నియమాలు గురించి అర్ధం చేసుకుంటున్నందుకు ధన్యవాదాలు. మీరు అవసరమైనంత సమయం తీసుకుని వికీ శైలి, మాట్లాడే భాషలో ఉండేట్లు వ్యాసాలు సవరించంగలరు. నిర్వహణ మూసలను గురించి మీరు ఏమీ ఆదుర్దా పడవలసిన పనిలేదు. నాకు తెలిసిన పరిజ్ఞానంతో వ్యాాల అసలు స్వరూపానికి భంగం వాటిల్లకుండా తగిన సవరణలు చేసి నేను తొలగించగలను. మీ బ్లాగు మూలం పనికి రాదు. మీరు లోగడ ఉన్న ఆరోగ్యసంబంధమైన వ్యాసాలను అవసరమైతే సవరించగలరు.మీ కృషి తెలుగు వికీపీడియాకు అవసరం.మీ ద్వారా ఈ వ్యాసాలు మానవాళికి ఉపయోగపడతాయని భావిస్తున్నాను.పాత వాటిని పూర్తిగా సవరించినతరువాతనే కొత్తవాటిని మొదలు పెట్టగలరు.మీరు ఎక్కడ నుండి తీసుకున్నా మక్కికి మక్కీగా ఉండరాదు.సవరించి రాయగలరు.పుస్తకాలు మూలాలు అంటే గ్రంథం పేరు, గ్రంథకర్త పేరు, పేజీ సంఖ్య, ప్రచురణ తేది ఇత్యాది వివరాలు మూలంగా చూపండి. అది ఏ వ్యాసానికి అయితే ఆ వ్యాసానికి మాత్రమే చూపాలి.మీ ఆసక్తికి మరొకసారి ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 03:27, 1 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]
నరసింహ మూర్తి గారూ, మీరు రాసిన వ్యాసాలలో నేను వికీశైలి ప్రకారం చిన్న చిన్న మార్పులు చేస్తూ ఉన్నాను. అవి కూడా గమనిస్తూ వస్తే కొంతకాలానికి ఈ నియమాలు అవగాహనకు వస్తాయి. అంతదాకా మీరు కొనసాగించవచ్చు. నియమాల పట్ల సహృదయతతో స్పందించినందుకు ధన్యవాదాలు. - రవిచంద్ర (చర్చ) 10:58, 1 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదములు రవిచంద్ర గారూ, నేను గమనించానండి. 96.47.57.146 14:39, 1 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ముఖ కండరాలు వ్యాసంలో ఆంగ్ల వ్యాసం విషయ సంగ్రహంతో నేను అనువాదం కొన్ని మూలాలుకూర్పు చేసాను.ఇదే సమయంలో వికీశైలి ప్రకారం సవరించాను.నరసింహ మూర్తి గారూ పరిశీలించగలరు.దానిలోని నిర్వహణ మూస తొలగించాను యర్రా రామారావు (చర్చ) 14:48, 1 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]
నేను చూసానండి, రామారావు గారూ, బాగుంది. ధన్యవాదములు. 96.47.57.146 14:58, 1 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]

గళధమని

[మార్చు]

[[గళ ధమనులుగళధమని]] లేదా Carotid artery గురించి చిన్న వ్యాసం వ్రాయండి. దానికి మెదడుకు రక్తప్రసరణ కు సంబంధాన్ని తెలియజేయండి. ముఖ్యమైన వ్యాధుల్ని టూకీగా చెప్పండి. చాలా పెద్ద వ్యాసం కంటే ముఖ్యమైన సమాచారంతో చిన్నవ్యాసం అయితే సామాన్య తెలుగు ప్రజలకు అర్ధం అవుతుంది. ధన్యవాదాలు. Rajasekhar1961 (చర్చ) 11:40, 26 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు రాజశేఖర్ గారూ ! తప్పకుండా. డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 15:00, 26 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు

[మార్చు]

మీ బ్లాగు చూశాను. చాలా బాగుంది. ముఖ్యంగా వైద్యశాస్త్రానికి సంబంధించిన వ్యాసాలను తెవికీలో చేర్చుతున్నందుకు కృతజ్నతలు. తెలుగు వికీపీడియా కాకుండా వికీ కామన్స్ మరియు తెలుగు వికీసోర్స్ అనేవి కూడా ఒకసారి చూడండి. మీరు స్వయంగా రచించిన కాపీశతకము వంటి రచనలను వికీసోర్స్ లో చేర్చవచ్చును. పుస్తకం రూపంలో ఇప్పటికే ముద్రించబడితే, వికీ కామన్స్ లోకి CC-BY-SA క్రింద మీరే స్వయంగా అప్లోడ్ చేసి ప్రపంచవ్యాప్తంగా వాటికి అందజేయవచ్చును. ఒకసారి ఆలోచించండి. Rajasekhar1961 (చర్చ) 06:01, 31 ఆగస్టు 2023 (UTC) ఈ లింకు చూడండి.https://commons.wikimedia.org/wiki/File:JATHA.pdf ఏవైనా సందేహాలుంటే చర్చించండి.[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు డా.రాజశేఖర్ గారూ ! కొద్దిరోజులలో తప్పకుండా ప్రయత్నిస్తాను. డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 14:37, 1 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

[మార్చు]

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:33, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)[ప్రత్యుత్తరం]

Thank you for being a medical contributors!

[మార్చు]
The 2023 Cure Award
In 2023 you were one of the top medical editors in your language. Thank you from Wiki Project Med for helping bring free, complete, accurate, up-to-date health information to the public. We really appreciate you and the vital work you do!

Wiki Project Med Foundation is a thematic organization whose mission is to improve our health content. Consider joining for 2024, there are no associated costs.

Additionally one of our primary efforts revolves around translation of health content. We invite you to try our new workflow if you have not already. Our dashboard automatically collects statistics of your efforts and we are working on tools to automatically improve formating.

Thanks again :-) -- Doc James along with the rest of the team at Wiki Project Med Foundation 22:25, 3 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం @ నరసింహమూర్తి గారు,

స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.

2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.

వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.

ధన్యవాదాలు.

ఇట్లు

Tmamatha (చర్చ) 09:57, 5 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాల పేర్లు

[మార్చు]

నమస్కారం సార్. ఆరోగ్య సంబంధమైన పలు వ్యాసాలు రాస్తున్నందుకు ధన్యవాదాలు. కొన్ని వ్యాసాల పేర్లు అచ్చతెలుగులో పెట్టారు. వ్యాసాల పేర్లు బాగా వ్యాప్తిలో ఉన్న పేర్లనే పెట్టాలి అనే మార్గదర్శకం ఒకటి తెవికీలో ఉంది. అలా వ్యాప్తిలో ఉన్న పేరుతో వ్యాసాన్ని సృష్టించి, ఇతర పేర్లతో దానికి దారిమార్పు పేజీలను సృష్టించవచ్చు. ఉదాహరణకు కుహరాంతర దర్శనం అనే పేరు కంటే "ఎండోస్కోపీ" అనే పేరు ఎక్కువగా వాడుకలో ఉంది (గూగుల్ ఫలితాల్లో చూదవచ్చు) అది ఇంగ్లీషు మాట అయినప్పటిఖి ప్రజా బాహుళ్యంలో ఆ పేరే ఎక్కువగా వాడుకలో ఉంది. ఆ పేరుతోనే వెతుకుతారు.

తెవికీ మార్గదర్శకం ప్రకారం ఈ పేజీని "ఎండోస్కోపీ" అనే పేరుకు తరలిస్తే దారిమార్పు కూడా ఆటోమాటిగ్గా ఏర్పడుతుంది. ఇకపై మీరు సృష్టించబోయే పేజీల విషయంలో ఈ మార్గదర్శకాన్ని దృష్టిలో ఉంచుకోవలసినదిగా అభ్యర్థన. పరిశీలించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 06:38, 2 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్సులు చదువరి గారూ! ధన్యవాదాలు. మీ అభిప్రాయంతో పూర్తిగా అంగీకరిస్తాను.కుహరాంతర దర్శనం పుట 2008 నుండి ఉంది. బహుశా డా. రాజశేఖర్ గారు ‘ఎండోస్కొపీ’ పేరుతో సృష్టించి తరువాత కుహరాంతర దర్శనం పుటకు తరలించి ఉంటారని తలుస్తాను. నేను ఎండోస్కొపీ పుటకోసం వెళ్తే ఈ పుట కనిపించింది. నేను ఈ పుటలో కొత్తవిషయాలు చేరుస్తూ విపులీకరిస్తున్నాను. వ్యాప్తిలో ఉన్న ఆంగ్లపు పేరులతో వ్యాసాలు సృష్టించి ఆపై వ్యాసంలో తెలుగు పేర్లు చొప్పించడం సమంజసం.ఇకపై నేను సృష్టించే వ్యాసాలకు, ఇదివరకు నేను సృష్టించిన ఇతర వ్యాధులపై వ్యాసాల్లో కూడ మీ సూచనను పాటిస్తాను. ప్రజలకు ఉపయోగపడాలనే కదా వ్యాసాలు వ్రాస్తున్నాం. ధన్యవాదాలు. డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 12:32, 2 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు సార్. __ చదువరి (చర్చరచనలు) 00:49, 4 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ఇండిక్ మీడియావికి డెవలపర్స్ యూజర్ గ్రూప్ - టెక్నికల్ సంప్రదింపులు 2024

[మార్చు]

నమస్తే,

ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్ వికీమీడియా ప్రాజెక్ట్‌లకు సహకరిస్తున్నప్పుడు వివిధ సాంకేతిక సమస్యలపై సభ్యుల అవసరాలను అర్థం చేసుకోవడానికి కమ్యూనిటీ టెక్నికల్ కన్సల్టేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వీటి లక్ష్యం కమ్యూనిటీలలోని సవాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సాధారణ సమస్యలను అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్ సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం.

మొదటి దశ మీ సాధారణ సమస్యలు, ఆలోచనలు మొదలైనవాటిని ఎక్కడ నివేదించాలనే సర్వే. దయచేసి సర్వేను (మీకు నచ్చిన భాషలో) ఇక్కడ పూరించండి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link

చివరి తేదీ 20 సెప్టెంబర్ 2024.

మీరు బహుళ సమస్యలు లేదా ఆలోచనలను నివేదించాలనుకుంటే, మీరు సర్వేను ఒకటి కంటే ఎక్కువసార్లు పూరించవచ్చు.

కార్యాచరణ గురించి మరింత చదవడానికి, దయచేసి సందర్శించండి: https://w.wiki/AV78

సర్వే తెలుగులో పైన పేజీలో ఉన్నాయ్.

ధన్యవాదాలు! MediaWiki message delivery (చర్చ) 13:29, 9 సెప్టెంబరు 2024 (UTC), ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ తరపున[ప్రత్యుత్తరం]