Jump to content

చర్చ:యస్. రాయవరం మండలం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

పేరులో తప్పు ఉంది

[మార్చు]

ఎస్ రాయవరం అన్న పేరు శృంగరాయవరం అనే పేరుని సూచిస్తుంది అని చెప్పటానికి మూలాధారాలేమైనా ఉన్నాయా?

సర్వసిద్ధి అన్నది ఈ రాయవరం ప్రక్కనే యున్న యూరు. చారిత్రికంగా సర్వసిద్ధి "రాయవరం" అన్న గ్రామం కన్నా ప్రాతది. ౧౮౫० సం లో కార్మికల్ దొర వ్రాసిన వైజాగపటాం గెజట్లో "రాయవరం" అన్న పేరుకు ముందు ఎస్ అన్న ఆంగ్ల అక్షరం కలిపి వాడలేదు. అప్పటికి సర్వసిద్ధి గ్రామమే తాలుకా కు ముఖ్యగ్రామంగా ఉండేది. ఈ గ్రామం కుబ్జ విష్ణు వర్ధనుని కొడుకు కాలంలో నిర్మించబడి యుండవచ్చని చరిత్ర కారుల అభిప్రాయం. సాధారంగా ఒక యూరికి దాని ప్రక్కనున్న యూరి పేరు కలిపి వాడటం ప్రజలకు అలవాటు. ఉదాహరణకు అక్కడకు దగ్గరలోనే యున్న ధర్మవరం అన్న గ్రామాన్ని పొరుగున్న పెనుగొల్లు అన్న పేరుతో కలిపి, పెనుగొల్లు ధర్మవరం లేక పి.ధర్మవరం అని పిలుస్తారు. కాబట్టి రాయవరం గ్రామానికి ముందున్న ఎస్ అన్న ఆంగ్ల అక్షరం "సర్వసిద్ధి" ని సూచిస్తుంది అనే నేను భావిస్తున్నాను. ఐతే నేను పొరబడి యుండవచ్చు, కాబట్టి ఎస్ రాయవరం అంటే శృంగరాయవరం అని అనడానికి ఆధారాలేమైనా ఉన్నాయా.? ఆంగ్ల వికీలో సర్వసిద్ధి రాయవరం అని నేనే ఉంచినట్టు గుర్తు. అక్కడి భారతీయ స్టేటు బ్యాంకు బ్రాంచి పేరు కూడా సర్వసిద్ధి రాయవరం అనే ఉంటుంది.

--వాచవి (చర్చ) 14:13, 11 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Veeraa83 గారూ మీ సూచన మేరకు 'శృంగ' అనే అక్షరాలు తొలగించి ఎస్.చేర్చాను.సర్వసిద్ది రాయవరం అని ఆధారం లభ్యమైనప్పుడు మరలా పరిశీలిద్దాం. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 15:55, 11 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలండీ. <<< సర్వసిద్ది రాయవరం అని ఆధారం లభ్యమైనప్పుడు మరలా పరిశీలిద్దాం. >>> ఇంతకాలం ఆ పేరును శృంగరాయవరం అని యుంచటానికి పనికివచ్చిన ఆధారాలను తెలుసుకోగోరుతున్నాను. --వాచవి (చర్చ) 04:01, 12 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Veeraa83 గారూ, శృంగ రాయవరం అని రాసింది నేనే అని ఈ పేజీ చరిత్రను బట్టి తెలుస్తోంది. అయితే ఏ ఆధారాన్నిబట్టి అది రాసానో గుర్తు లేదు. వెతికే ప్రయత్నం చేసాను; ఆధారం ఇదమిత్థంగా ఫలానా అని నాకు కనబడలేదు గానీ, ఎస్.రాయవరం అనే పేజీ అప్పటికే ఉనికిలో ఉంది. ఆ పేజీలో పేరు అప్పట్లో శృంగరాయవరం (ఇప్పుడు మారింది) అనే ఉంది. ఆ పేజీకి సంబంధించిన [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AF%E0%B0%B8%E0%B1%8D._%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%B5%E0%B0%B0%E0%B0%82&oldid=2493536 ఈ కూర్పులో] కూడా ఆ పేరే ఉంది. బహుశా దాన్ని చూసి దీనిక్కూడా ఆ పేరే పెట్టి ఉంటాను. నాకు ఆ ప్రాంతంతో పరిచయం లేదు కాబట్టి, అది సరైనదా కాదా అనే సందేహం నాకు వచ్చి ఉండదు. ఆ పేరు తప్పని ఇప్పుడు మీరు చెప్పాక తెలిసింది. ఆ తప్పుకు బాధ్యుణ్ణి నేనే. సర్వసిద్ధి అనే పేరే పత్రికలలో కూడా ఉన్నట్లు గూగుల్ ఫలితాల్లో గమనించాను. ఆ తప్పును నేను సవరిస్తాను. ఈ విషయాన్ని ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు. @యర్రా రామారావు గారూ, ఈ విషయంపై శ్రద్ధ పెట్టినందుకు ధన్యవాదాలు.__ చదువరి (చర్చరచనలు) 07:30, 13 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Veeraa83 గారూ, "శృంగ" కు సంబంధించి కింది పనులు చేసాను
  1. యస్.రాయవరం మండలం పేజీలో ఉన్న లింకులను, పేర్లనూ సవరించాను.
  2. (శృంగరాయవరం) పేరుతో క్వాలిఫై అవుతున్న గ్రామాల పేజీలను కూడా యస్.రాయవరం పేరు తోటే క్వాలిఫై చేసాను.
  3. పాత పేజీలకు ఉన్న లింకులన్నిటినీ తీసేసి, సంబంధిత కొత్త పేజీలకు ఇచ్చి, పాత పేజీలను తొలగించాను.
  4. "యస్.రాయవరం మండలం లోని గ్రామాలు" మూసలో లింకులను మార్చాను.
  5. అయోమయ నివృత్తి పేజీల్లో కూడా ఆ లింకులను, పేరునూ సవరించాను.
ఇంకా ఎక్కడైనా "శృంగ"రాయవరం పేరుతో పేజీలు కనిపిస్తే.., నాకు చెప్పినా సరే, లేదా - దానికంటే నయం - మీరే సవరించినా సరే. ధన్యవాదాలు. __ చదువరి (చర్చరచనలు) 09:19, 13 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మండలం పేరు శృంగరాయవరం అని ఇంకా చూపిస్తూనే యున్నది, ఈ మండలానికి చెందిన ప్రతి గ్రామానికి చెందిన పుట యొక్క శీర్షిక లోనూ కడవలలో (శృంగరాయపురం) అనే ఇంకా కనిపిస్తున్నది.నాకు తెలిసి విశాఖపట్టణం జిల్లాలో శృంగరాయవరం అనే పేర ఒక గ్రామం గానీ,మండలం గానీ లేవు.ఉన్నదల్లా ఎస్.రాయవరం అన్న గ్రామమే.ఈ "ఎస్" అన్న అక్షరానికి అర్థం రాయవరానికి పొరుగున్న "సర్వసిద్ధి" అనే గ్రామం.అలాగే "శృంగరాయవరం" అని యుంచటానికి పనికివచ్చిన ఆధారాలను తెలుసుకోగోరుతున్నాను. --వాచవి (చర్చ) 05:19, 13 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మీ సూచనలకు ధన్యవాదాలు.గ్రామ శీర్షికలలో ఈ ఒక్క గ్రామమే కాదు.చాలా గ్రామాలు శీర్షికలు తగిన ఆధారాలతో పరిశీలించి సవరించాల్సి ఉంది.రెండు తెలుగు రాష్ట్రాలలో గ్రామాల శీర్షికలు తప్పులను సవరించి, ఆయా పేజీలను సరైన పేరుకు తరలించడం, తత్సంబంధిత పేజీల్లో చెయ్యాల్సిన మార్పులు చెయ్యడానికి వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/గ్రామాల పేర్ల సవరణ అనే ఒక ప్రాజెక్టు పేజీని తగిన చర్యలు చేపట్టుటకు తయారుచేయబడింది.దాని ప్రకారం కొన్ని మండలాలలో సవరణలు జరిగినవి.తెలుగు వికీపీడియాలో చురుకైన వాడుకరులు బహు తక్కువుగాఉన్నారు.మీకు కనుక ఆసక్తి ఉంటే, ఏ జిల్లాలోని మండలాలు చేపట్టి, సవరణలు చేయవచ్చు. ఒకసారి ప్రాజెక్టు పేజీ పూర్తిగా చదివి, మీరు ఆ పనినిప్రారంభించవచ్చు.మీకు తెలిసినవి తగిన ఆధారాలతో ఆ గ్రామం చర్చాపేజీలో రాయగలరు.ప్రాజెక్టు ప్రకారం సవరణలు చేసేటప్పుడు మీ సూచనలు పరిగణనలోకి తీసుకుంటారు.లేదా మీరు పూర్తి ఆధార లభ్యంతో సవరించినా పర్వాలేదు.గ్రామాలపై మీ ఆసక్తికి చాలా ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 05:53, 13 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]


ధన్యవాదాలండీ. నేను యీ ప్రాంతానికి చెందిన వాడినే.చిన్నప్పటి నుంచీ ఎస్.రాయవరం అంటే సర్వసిద్ధి రాయవరమనే విన్నాను.ఇతే ప్రభుత్వ రికార్డులలో యేముందో తెలియదు కాబట్టే "శృంగరాయవరం" అన్న పేరుకు ఆధారాలున్నాయా అని అడిగినది. నాకు తెలిసినంత వరకూ ९९ శాతం ఎస్.రాయవరమంటే సర్వసిద్ధి రాయవరమే.కనీసం ఇప్పటిలా దానిని ఎస్.రాయవరం అని యుంచవచ్చు. ఈ మీభూమి జాలగూడులో కూడా([మీభూమి జాలగూడు http://meebhoomi.ap.gov.in/RORGramaPahaani.aspx]) ఎస్. రాయవరం మండలానికి చెందిన గ్రామాలలో యెక్కడా "శృంగరాయవరం" అనే గ్రామం లేదు. ఉన్నదల్లా సర్వసిద్ధి గ్రామమే. అలాగే మరొక విషయం గమనించాను. రాయవరం (ఎలమంచిలి) అనుపేరనొక పుట, https://te.wikipedia.org/wiki/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%B5%E0%B0%B0%E0%B0%82_(%E0%B0%8E%E0%B0%B2%E0%B0%AE%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BF) ఎస్.రాయవరం పేర మరొక పుటా ఉన్నాయి. https://te.wikipedia.org/wiki/%E0%B0%AF%E0%B0%B8%E0%B1%8D._%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%B5%E0%B0%B0%E0%B0%82

నిజానికి,ఈ రెండు గ్రామాలూ ఒకటే. చాలా యేళ్ళ క్రిందట, ఎస్.రాయవరం మండలం కూడా ఎలమంచిలి తాలూకాలోనే ఉండేది. తరువాత దీనిని ఒక ప్రత్యేక మండలం గా విభజించారు. [ శ్రీ నం.తా రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు "తాలూకా" అన్న పేరును తొలగించి,"మండలం" అన్న పేరు తీసుకుని వచ్చారు కదా!]

నేను రాయవరం(ఎలమంచిలి) కి చెందిన పుటలో యీ గ్రామం ఎస్.రాయవరం మండలానికి చెందినది అన్నట్టుగా సవరించినాను.

దానికి సంబంధించిన ఆధారాలను కూడా ఆ పుటకు చెందిన చర్చలో చేర్చాను. ఎస్.రాయవరం అను పేర వేరొక పుట కూడా యున్నట్లు ఇప్పుడు మీరు చెప్పాకనే తెలిసింది. ఈ రెంటినీ కలిపి వేయవచ్చు. మహాకవి గురజాడ అప్పారావు గారు పుట్టినది యీ సర్వసిద్ధి రాయవరం లేక ఎస్.రాయవరం గ్రామంలోనే. --వాచవి (చర్చ) 11:28, 13 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

రాయవరం(ఎలమంచిలి) అనే పేజీని ఎలమంచిలి మండలంలోని గ్రామంకానందున ముందే పక్కన పెట్టబడింది.దానిలోని సమాచారం యస్.రాయవరం గ్రామానికి తరలించి ఆ పేజీని తొలగించాను.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 13:14, 13 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]