చర్చ:యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
స్వరూపం
ద్రౌపది నవల వివాదం
[మార్చు]- యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ (విశాఖపట్నం, మాజీ రాజ్యసభ సభ్యులు) రచించిన ద్రౌపది అనే పుస్తకానికి ఈ సంవత్సరం కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించింది.ఈ పురస్కార నిర్ణాయక న్యాయమూర్తులుగా శ్రీ కాళీపట్నం రామారావు, శ్రీమతి వి.ఎస్.రమాదేవి, ఆచార్య బేతవోలు రామబ్రహ్మంలు వ్యవహరించారు.
- విమర్శలు:
- ఇది ఒక బూతు పుస్తకం. వెయ్యేళ్ల తెలుగు సాహిత్య చరిత్రలో తెలుగు సరస్వతికి ఇటువంటి అవమానం, పరాభవం, కీడు, అపరాధం, అపచారం ఎన్నడూ జరగలేదు.న్యాయనిర్ణేతలే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి సాహిత్య అకాడమీ ఈ విషయాలు గ్రహించి పునరాలోచించి 'ద్రౌపది' గ్రంథ పురస్కారానికి అనర్హమైనదిగా ప్రకటించాలి.
- .ద్రౌపదిని శ్రీకృష్ణుని ఇష్టసఖిగా రచయిత అభివర్ణించాడు. ఇష్టస అంటే ప్రియురాలు, వలపుకత్తే, ప్రేయసి అనే అర్థాలు ఉన్నాయి. కాని చెల్లెలు అనే అర్థం ఉందా?
- . ఐదుగురు కొడుకులను పోగొట్టుకొని (సుషుప్తి పరవశులైన బాలకులను అశ్వత్థామ గొం తులు కోసి చంపాడు) గోలుగోలున ఏడుస్తున్న ద్రౌపది, పూర్వం తనకు జరిగిన అన్యాయాలను తలచుకుంటూ వెంటాడే స్మృతులలో దుర్యోధనుడు కామంతో తన ఎత్తైన వక్షస్థలాన్ని చూస్తున్న సంగతి గుర్తుచేసుకోగలదా?
- . ద్రౌపది ఒకరోజు తరువాత ఒకరోజు పాండవులు ఒక్కొక్కరితో కామకేళీ విలాసాలతో సుఖించినట్లు, పరవశత్వం చెందినట్లు వక్రీకరణలు గొప్ప పరాభవము, మానభంగము కావా?
- .శ్రీకృష్ణ పరమాత్మను అతి నీచంగా ప్రస్తావించటం కృష్ణభక్తులైన ఆనందవర్ధనుడు, ఆచార్య శంకరభగవత్పాదులు, సూరదాసు, మీరాబాయి, చైతన్య మహాప్రభువు, శ్రీరామకృష్ణపరమహంస, లీలాశకుడు, జయ దేవుడు, విద్యావతి, చండీదాసు, నారాయణతీర్థుల వంటి మహానుభావులను అవమానించడం కాదా?
http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=44863&Categoryid=1&subcatid=3
- లక్ష్మీ ప్రసాద్ గారి వివరణ:
- పరమశివుని వరం మేరకే ద్రౌపది జన్మించింది.కుమార్తె గా, సోదరిగా, భార్యగా,తల్లిగా, శ్రీ కృష్ణుని సఖిగా, మహారాజ్ఞిగా, రాజనీతిజ్ఞురాలిగా, విదుషీమణిగా, ఉత్తమ ఇల్లాలుగా, గృహిణిగా, వివిధ దశల్లో పరిఢవిల్లిన ఆమె వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి వివరించడమే ఈ నవల ముఖ్య ఉద్దేశం.ఆంధ్ర మహాభారతం ఆదిపర్వంలో 257వ సంఖ్యతో ఉన్న పద్యంలో ఉన్న వర్ణన కంటే ఇదేమంత పెద్దది కాదు.సఖాసఖి సంప్రదాయం గురించి ఒరియా రచయిత్రి ప్రతిభారాయ్ తన 'యాజ్ఞసేని' పుస్తకంలో రాశారు.ఇది అలౌకికమైన, పవిత్రమైన ప్రేమపూర్వక సంబంధం మాత్రమే.ఎన్టీఆర్ నటించిన 'దాన వీర శూర కర్ణ' సినిమాలో ద్రౌపది పాత్రను ఎలా వర్ణించారో పరిశీలించాలి.గత రెండు జన్మలలో తీరని కామబోగేచ్చను, సంసార సుఖాన్ని తీర్చుకోవడానికే ద్రౌపది జన్మించిందని ఆదిపర్వంలో ఉంది.తెలుగు ప్రబంధాలు, ఇతర భాషల గ్రంథాలలోను అధిక మోతాదులో శృంగారం ఉంది.తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు వెలుగులోకి రాకుండా మరుగునపడి పోతున్నాయి.వాటన్నింటినీ వెలుగులోకి తెస్తాను.(ఈనాడు,ఆంధ్రజ్యోతి14.1.2010),http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=408129&Categoryid=1&subcatid=33
సాహిత్య శృంగారము
[మార్చు]మన సాహిత్యములో శృంగారము మితిమీరిన ఉదాహరణలు కోకొల్లలు. ముద్దుపళని "రాధికాసాంత్వనము" , పెద్దన గారి 'మనుచరిత్ర' వగైరా. లక్ష్మీప్రసాద్ గారిని ఆడిపోసుకొనుట ఉచితము కాదు.Kumarrao 14:14, 25 జనవరి 2010 (UTC)
వ్యాసము
[మార్చు]వ్యాసములో ఆత్మకథ తలపించు విషయాలున్నాయి. ఇవి తొలగించి వ్యాసమును పరిష్కరించ దలచాను.వ్యాఖ్యానించగలరు.Kumarrao 13:04, 14 ఫిబ్రవరి 2010 (UTC)
- తప్పకుండా పరిష్కరించండి --కాసుబాబు 18:24, 14 ఫిబ్రవరి 2010 (UTC)
సభా మర్యాద
[మార్చు]ఈమధ్య తెలుగు వికీపీడియా పేజీల్లో గౌరవనీయులయిన వ్యక్తుల విశేషాలు ప్రస్తావించేటప్పుడు 'చేశాడు', 'చదివాడు', 'పొందాడు'... అని కనిపిస్తోంది. ఇది ఆయా వ్యక్తులకి కనీస మర్యాద తెలుగు వికీపీడియా ఇవ్వటం లేదని సూచిస్తోంది.
Passingon (చర్చ) 00:52, 19 డిసెంబరు 2024 (UTC)
- తెలుగు వికీలో ఎంతటి వారైనా, చివరకు దేవుడినైనా ఏకవచన ప్రయోగం చేయాలని ఒక నియమం ఉంది. ఇది చాలా చర్చల తర్వాత తెలుగు వికీ తీసుకున్న నిర్ణయం. కేవలం ఏకవచనం కారణంగా ఆయా వ్యక్తులను అవమానించినట్లు కాదని గమనించండి. వికీపీడియా:ఏకవచన ప్రయోగం చదవండి దీని వెనుక ఉన్న అంతరార్థం మీకు తెలుస్తుంది. - రవిచంద్ర (చర్చ) 06:45, 19 డిసెంబరు 2024 (UTC)
- @Passingon గారూ మీ గమనికకు ధన్యవాదాలు.దానికి @రవిచంద్ర గారు ఇచ్చిన వివరణతో మీరు సంతృప్తి చెందారు అనుకుంటాను. ఇంకా మీకు అసంతృప్తి అనిపిస్తే ఎందుకు ఏకవచనం వాడకూడదో తగిన సహేతుక కారణాలతో వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) లో చర్చను ప్రవేశపెట్టండి. సముదాయం తిరిగి దానిమీద మరలా చర్చించి తగిన నిర్ణయం తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. యర్రా రామారావు (చర్చ) 06:54, 19 డిసెంబరు 2024 (UTC)