చర్చ:రేచుక్క (1955 సినిమా)
Jump to navigation
Jump to search
విడుదల తేదీ
[మార్చు]- ఈ సినిమా 1954లో వచ్చింది. సరిచేయగలరు. JVRKPRASAD (చర్చ) 04:54, 27 ఫిబ్రవరి 2014 (UTC)
- ఈ సినిమా విడుదల తేదీలో అయోమయం ఉన్నట్టుంది.
- 1955-03-25 — తెవికీ
- 1955-03-25 — సితార వ్యాసం
- 1954-05-23 — ఐఎమ్డీబీ
- 1954-05-23 — పులగం చిన్నారాయణ వ్యాసం
- 1954-05-28 — ఆంగ్ల వికీపీడియా (తమిళ వెర్షన్ 1955లో విడుదలయిందని ప్రస్తావన ఉంది.)
- 1954------ — సితార వ్యాసం (సంవత్సరం మాత్రమే ప్రస్తావించారు.)
- 1954------ — సంచిక పత్రికలో వ్యాసం (సంవత్సరం మాత్రమే ప్రస్తావించారు.)
- 1954------ — ది హిందూ వ్యాసం (సంవత్సరం మాత్రమే ప్రస్తావించారు.)
- 19---05-23 — సినిమా సెన్సార్ సర్టిఫికెటు. తెదీ మాత్రం మే 23 అని తెలుస్తుంది. సంవత్సరమే స్పష్టంగా లేదు.
- అయితే ఖచ్చితమైన తేదీ ఇదమిద్దంగా తేలే వరకూ సంవత్సరం అలా ఉంచి, తేదీని మార్చవచ్చు. — వీవెన్ (చర్చ) 16:03, 28 మే 2020 (UTC)
- గోల్కొండ పత్రిక ప్రతి లింకును చేర్చాను. అందులో స్పష్టంగా తేదీ ఉంది. ఆ రోజే విడుదల అని. పాత సినిమాల విడుదల తేదీల్లో చాలా జాగ్రత్తలు చూసుకోవాలి. సెన్సార్ ప్రమాణపత్రం ఇచ్చిన తేదీ తరువాతే సినిమా విడుదల తేదీ ఉంటుంది. ఇక కొన్ని సినిమాలు ఆ రోజుల్లో బొంబాయిలో ఒక రోజు, చెన్నై లో ఒక రోజు, హైదరాబాద్ లో ఒకరోజు, బెజవాడలో ఒక రోజు ఇలా వేరు వేరు తేదీల్లో విడుదలైన సందర్భాలున్నాయి. ఒక్కో సారి మనం విడుదల తేదీ అనుకున్నది రెండవ సారి రిలీజ్ అయిన తేదీ అయి ఉండవచ్చు కూడా. సెన్సార్ ప్రమాణపత్రం పది సంవత్సరాల చెల్లుబాటుతో ఉంటుందట. రీరిలీజ్ కోసం రెండవ సారి వెళ్ళినపుడు ఈ పది సంవత్సరాల కాలం చెల్లిపోతే మళ్ళీ కొత్తగా సెన్సార్ సర్టిఫికేట్ తీసుకోవాలట. అందుకని 1977 ఉంది. ఈ సమాచారం మనసు వెంకటరాయుడు గారు అందించారు. పత్రిక వాకబును శ్యామనారాయణ గారిచ్చారు. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:44, 29 మే 2020 (UTC)
- కృతజ్ఞతలు! చాలా చోట్ల 54 ఉంది. ఆ అయోమయం కూడా తీరితే సరిపోతుంది. (వీడియోలో 77 అని అనిపించలా. బహుశా నేను దాన్ని 55గా చదవడానికి ప్రయత్నించానేమో!) — వీవెన్ (చర్చ) 14:09, 29 మే 2020 (UTC)
- 1954లో ప్రదర్శనకు అనుమతించిన సినిమాల జాబితా (8వ పేజీ చివరి పంక్తి నుండి తెలుగు సినిమాలు) లో ఈ రేచుక్క సినిమా లేదు. కనుక విడుదల 55 లోనే అయివుండాలి. 55కి ఇలాంటి జాబితా దొరకలేదు. — వీవెన్ (చర్చ) 14:53, 29 మే 2020 (UTC)
- మరో అయోమయం. గోలకొండ పత్రికలో అర్ధాంగి సినిమా కూడా విడుదల అని ఉంది. రెండు సినిమాల దర్శకుడూ పి. పుల్లయ్య. ఆ రోజు ఉగాది కాబట్టి రెండూ విడుదల అయివుండొచ్చు. కానీ అర్ధాంగి సినిమా విడుదల తేదీ జనవరి 26, 1955 అని ఆంగ్ల వికీలో ఉంది. — వీవెన్ (చర్చ) 14:50, 29 మే 2020 (UTC)
- 2:30 షో లో ఆ సినిమాని అప్పటి వరకూ విడుదల చేసి ఉండరు. మ్యాటినీగా మొదటి షో. ఇలా విడుదలలెన్నో.--రహ్మానుద్దీన్ (చర్చ) 05:47, 30 మే 2020 (UTC)
- మరో అయోమయం. గోలకొండ పత్రికలో అర్ధాంగి సినిమా కూడా విడుదల అని ఉంది. రెండు సినిమాల దర్శకుడూ పి. పుల్లయ్య. ఆ రోజు ఉగాది కాబట్టి రెండూ విడుదల అయివుండొచ్చు. కానీ అర్ధాంగి సినిమా విడుదల తేదీ జనవరి 26, 1955 అని ఆంగ్ల వికీలో ఉంది. — వీవెన్ (చర్చ) 14:50, 29 మే 2020 (UTC)
వర్గాలు:
- వికీప్రాజెక్టు భారతదేశ సినిమా
- మొలక దశలో ఉన్న భారతదేశ సినిమా వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ సినిమా వ్యాసాలు
- వికీప్రాజెక్టు తెలుగు
- మొలక దశలో ఉన్న తెలుగు వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు వ్యాసాలు
- మొలక-తరగతి భారతదేశ వ్యాసాలు
- మొలక-తరగతి ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న భారతదేశ వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న తెలుగు వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న భారతదేశ సినిమా వ్యాసాలు