Jump to content

చర్చ:రొయ్య

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

రొయ్య జీర్ణ వ్యవస్థ, రొయ్య శ్వాసవ్యవస్థ మరియు రొయ్య ప్రసరణ వ్యవస్థ వ్యాసాలను రొయ్య వ్యాసంలో విలీనము చేయాలని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలను ఇక్కడ తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 18:50, 8 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

రొయ్య సంబంధిత వ్యాసాల విలీనము

[మార్చు]

ప్రసాద్ గారూ రొయ్య జీర్ణ వ్యవస్థ, రొయ్య శ్వాసవ్యవస్థ మరియు రొయ్య ప్రసరణ వ్యవస్థ వ్యాసాలను రొయ్య వ్యాసంలో విలీనము చేయాలని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలను రొయ్య చర్చా పేజీలో తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 18:52, 8 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సుల్తాన్ ఖాదర్ గారు, తప్పకుండా తెలియజేస్తాను. రొయ్య జీర్ణ వ్యవస్థ : 860 బైట్లు, రొయ్య శ్వాసవ్యవస్థ : 2.3 కెబి, మరియు రొయ్య ప్రసరణ వ్యవస్థ : 482 బైట్లు తోటి వ్యాసములు ప్రస్తుతము ఉన్నాయి. అసలు రొయ్య : 2.9 కె.బి లతో వ్యాసం ప్రస్తుతము ఉంది. ఈ వ్యాసాలను బాగా అనుభవము ఉన్నవారు అభివృద్ధి చేయాలనుకున్నంత వరకు మీరు సూచించినట్లు రొయ్య ప్రధాన వ్యాసంగా మిగతావి విలీనం చేయవచ్చును నా అభిప్రాయము. JVRKPRASAD (చర్చ) 00:13, 9 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
సుల్తాన్ ఖాదర్ గారు మీరన్నట్లు రొయ్య జీర్ణ వ్యవస్థ, రొయ్య శ్వాసవ్యవస్థ మరియు రొయ్య ప్రసరణ వ్యవస్థ వ్యాసాలు మొలక స్థాయిలో ఉన్నాయి. వాటిని రొయ్య లో విలీనం చేస్తే మంచి వ్యాసంగా తయారవుతుంది. అయితే ఈ విలీన విషయాల గురించి సంబంధిత మూడు వ్యాసాలలో కూడా {{విలీనం|రొయ్య}} అనే విలీన ప్రతిపాదన ట్యాగును చేర్చి చర్చ జరగాలి. ఆ చర్చలో విలీనం చేయవచ్చు అనే అభిప్రాయం వస్తే వెంటనే విలీనం చేయవచ్చు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 07:08, 9 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  • ప్రధానమైన వ్యాసాన్ని అభివృద్ధి చేసే క్రమంలో వాటికి ఉన్న విభాగాలు చాలాపెద్దవైతే విడదీసి వేరే వ్యాసాలుగా మలచడం సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ ఇదే పద్ధతిలో వ్యాసాలు అభివృద్ధి కావాలనేమీ నియమం లేదనే అనుకుంటున్నాను. నేను ఆంగ్లవికీలో సీరియస్‌గా పనిచేసినవాణ్ణి కాకున్నా కొన్ని విషయాలకై ఆంగ్లవికీ చర్చలను లోతుగా చదివి అర్థం చేసుకుంటూంటాను. పైగా నా వ్యక్తిగత ఆసక్తులు, వృత్తి, ప్రవృత్తులకు అవసరమయ్యే అధ్యయనాలకు కూడా ఆంగ్లవికీలో ఆధారపడుతూంటాను. ఆ క్రమంలోనే చూసినప్పుడు నాకు ఆసక్తిగా తోచే కవులు, సాహిత్యవేత్తల జీవితాలు, కొందరు యుద్ధనేతలు, చరిత్రలో చేరిపోయిన వ్యక్తుల వ్యాసాలు చూస్తూండగా నాకు పలువురు ముఖ్యులైన వ్యక్తుల పేజీల్లో విభాగాలకు ప్రధాన వ్యాసాలుండడం చూస్తూనేవుంటాను. ఉదాహరణకు షేక్స్పియర్ పేజీని తీసుకుంటే దానిలోని విభాగాలైన షేక్స్పియర్ జీవితం, నాటకాలు, ఇతరులతో ఆయన కొలాబరేషన్, ఆయన నాటకాల ప్రదర్శనలు, ఆయన రాసిన సానెట్లు, రచనా శైలి, ఆయన ప్రభావం, ఆయన ప్రాచుర్యం, షేక్స్పియర్ నాటకాల విమర్శరచనల కాలరేఖ, ఆయన కర్తృత్వంపై సందేహాలు, మతం, సెక్సువాలిటీ, ఆయన వర్ణచిత్రాలు, రచనల జాబితా-వివరాలు, మరియు రచనల కాలరేఖ వంటి వ్యాసాలు ఉన్నాయి. ఈ వ్యాసాల తయారీకి కావాల్సిన ముఖ్యమైన దినుసు నోటబిలిటీ అని నా అంచనా. అంతే తప్ప వ్యాసంలోని విభాగాలుగా ఉన్నవాటికి వేరే వ్యాసాలుండరాదని ఏమీ లేదు. నేను పైన చెప్పిన షేక్స్పియర్ వ్యాసాన్ని ఆదర్శంగా స్వీకరించి విశ్వనాథ సత్యనారాయణ జీవితం, ఆయన నవలలు, విశ్వనాథపై ప్రభావాలు, విశ్వనాథ సత్యనారాయణపై విమర్శలు వంటివి ప్రారంభిద్దామని ఉత్సాహపడ్డాను. మొదట విశ్వనాథ సత్యనారాయణ జీవితం అన్న వ్యాసమే మొదలుపెడదామనుకుని ఎందుకైనా మంచిదని వ్యాస చర్చాపేజీలో వ్రాసి, వైజాసత్య గారిని ప్రత్యేకించి అభిప్రాయం కోరాను. ఆయన అలాంటీ వ్యాసాలు వ్రాయవచ్చనీ, దానిని సింథసైజ్డ్ నాలెడ్జ్ అంటారనీ సూచించారు.(మొత్తం చర్చ ఇక్కడ లభ్యం) ఐతే వారే రచ్చబండలో ముందు వ్యాసంలోనే విభాగాలుగా ఆయా విషయాలు రాస్తూపోతే సమతౌల్యత చెడిపోతుందనీ, అప్పుడు ఆ సమాచారాన్ని వేరే వ్యాసంగా మలచాలనీ సూచించడంతో ఆ పనిలో పడ్డాను. ఇప్పటీకీ నా విష్ లిస్టులో ఇది ఉంది. ఈ విషయంపై ఆయన వ్రాసింది చూస్తే - మొదట శ్రీశ్రీ వ్యాసంతో ప్రారంభించాలి. అక్కడ శ్రీశ్రీ వ్యక్తిత్వం గురించి వ్రాస్తూ పోతే, వ్యాసం సమతుల్యత కోల్పోతుంది. అప్పుడు చూసినవాళ్లు దీన్ని ప్రత్యేక వ్యాసంగా చేయాలని ప్రతిపాదిస్తారు. అలా కొత్త వ్యాసం మొదలౌతుంది. కానీ శ్రీశ్రీ ప్రధాన వ్యాసంలో మాత్రం తప్పకుండా శ్రీశ్రీ వ్యక్తిత్వం యొక్క సంక్షిప్త చిత్రం ఉండాలి. ఎందుకంటే శ్రీశ్రీ గురించి తెలుసుకోవాలని వచ్చిన వాళ్ళకు ఈ ముఫ్ఫై వ్యాసాలు చదివితే తప్ప మీరు శ్రీశ్రీ గురించి తెలుసుకోలేరు అన్న పరిస్థితి రాకూడదు. ఇంకో పద్ధతిలో మీకు ఖచ్చితంగా వ్యాసం వ్రాయగల స్థాయిలో సమాచారం ఉందనిపిస్తే తప్పకుండా శ్రీశ్రీ వ్యక్తిత్వం అనే వ్యాసం వ్రాసి, దాన్ని సంక్షిప్తంగా శ్రీశ్రీ వ్యాసంలోనూ ఒక విభాగంగా కూడా వ్రాయాలి. అన్నారాయన. ఇక్కడ రెండవ పద్ధతిని విజయ గారు పాటిస్తున్నట్టున్నారు. కాకుంటే ఆవిడ ఈ వ్యాసాల్లోని విషయాలను క్లుప్తంగా రొయ్య వ్యాసంలో విభాగాలుగా ప్రస్తావించి, ప్రధాన వ్యాసానికి లంకె ఇవ్వడం చేస్తే సరిపోతుందని నా అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని సమర్థిస్తూ పైన అటు ఆంగ్ల వికీలోని పద్ధతులను(తెవికీలో ఇలాంటి వ్యాసాలు ఇంకా పూర్తిస్థాయిలో రాయడం లేదు కనుక), ఇటు తెవికీలో జరిగిన చర్చలను కూడా ప్రస్తావించిన విషయం గమనించగలరు. నన్ను ప్రత్యేకించి ఈ విషయంపై అభిప్రాయం కోరిన సుల్తాన్ ఖాదర్ గార్కి ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 12:23, 9 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  • స్పందించిన సభ్యులు JVRKPRASAD , కె.వెంకటరమణ, పవన్ సంతోష్ గార్లకు ధన్యవాదములు. మొలక వ్యాసాల విస్తరణకు కొద్ది సమయం వేచిచూచి తదుపరి విలీన నిర్ణయం తీసుకుందాం.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:06, 10 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]