చర్చ:విశ్వనాథ సత్యనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విశ్వనాథ సత్యనారాయణ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2012 సంవత్సరం, 33 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


విశ్వనాథ వారి సాహితీ ప్రస్థానం 1961 తో ప్రారంభమైనదా? దీనిని సరిచెయ్యాలి. ----కంపశాస్త్రి 02:38, 22 ఆగష్టు 2007 (UTC)
1942 లో ఆయన 60 వ యేట గజారోహణం. ఇందులో దోషం ఉంది. సరిచెయ్యాలి. ----కంపశాస్త్రి 02:56, 22 ఆగష్టు 2007 (UTC)
తప్పని పిస్తే నిర్మొహమాటంగా సరి చేయండి.--మాటలబాబు 02:58, 22 ఆగష్టు 2007 (UTC)
సాహితి పీఠం 2003 లొ ప్రారంభం అయ్యిందని ఇక్కడ చెబుతోంది.--మాటలబాబు 03:04, 22 ఆగష్టు 2007 (UTC)
పైన నేను వ్రాసిన రెండు దోషాలు సరి చేశాను.----కంపశాస్త్రి 04:39, 22 ఆగష్టు 2007 (UTC)
వ్యాసం పేరులో విశ్వనాథ అని ఉండాలి.--కంపశాస్త్రి 04:43, 22 ఆగష్టు 2007 (UTC)

రచనలు[మార్చు]

రచనల జాబితా వేయి పడగలు పుస్తకం వెనుక అట్టముండి తీసుకొన్నాను. వర్గీకరణ కూడా అదేవిధంగా చేశాను. అయితే "పురాణవైర గ్రంధమాల", "కాష్మీరరాజ చరితము", "నేపాళరాజ చరితము" అనేవి నవలా సంపుటాలు. ఒకో సంపుటంలో ఏయే వనలలు రావాలో నాకు సరిగా తెలియదు. ఎప్పుడో చదివిన గుర్తుల ప్రకారం కొంత వర్గీకరించాను. తెలిసినవారు సరిచేయగలరు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:20, 1 మే 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]

పురాణవైర గ్రంధమాల: పన్నెండు నవలలు. 1. భగవంతునిమీద పగ 2. నాస్తికధూమము 3. దూమమరేఖ 4. నందోరాజా భవిష్యతి 5. చంద్రగుప్తుని స్వప్నము 6. అశ్వమేధము 7. అమృతవల్లి 8. పులిమ్రుగ్గు 9. నాగసేనుడు 10. హెలీనా 11. వేదవతి 12. నివేదిత

సమగ్రమైన జీవితచరిత్ర[మార్చు]

ఆంగ్లవికీలో రచయితల వ్యాసాల్లో ముచ్చటగా సమగ్రమైన, సవివరమైన జీవిత చరిత్ర ఉండడం ముచ్చటగొలుపుతూంటుంది. దానివల్ల ఎన్నోసార్లు ఎందరెందరో రచయితల గురించి తెలుసుకునేందుకు ఉపయోగించి వ్యక్తిగతంగా లాభపడ్డవాణ్ణి నేను. తెలుగులో కూడా మన కవులు, రచయితల జీవితాల గురించి అటువంటి వివరాలతో వ్రాయాలని నా ఆలోచన. ఈ క్రమంలో ఇప్పటికే నావద్ద ఉన్న మూలాలతో శక్తిమేరకు చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గురించి వీలున్నంత సమగ్రంగా పేజీని తయారుచేశాను. ఐతే అందులో వివరాలు అప్పట్లో తాడేపల్లిగూడెంలో ఉండే నాకు మాత్రమే చేతిలో వుండే కాశీయాత్ర, తెలుగులో కవితావిప్లవాల స్వరూపం, కథలు-గాథలు(చెళ్ళపిళ్ళది) వంటి పుస్తకాలలోంచి పరిశోధించి వ్రాయడంతో సహవికీపీడియన్లను చురుకుగా ఇందులో పాల్గొనేలా చేయలేకపోయాను. కనీసం వారు పాల్గొనేలా కోరేందుకు కూడా వీలు లేకపోయింది ఈ కారణాలతో.
ఐతే ప్రస్తుతం విశ్వనాథ సత్యనారాయణ జీవితాన్ని గురించిన సమగ్రమైన వివరాలతో కూడిన వ్యాసాలు వ్రాసేందుకు వీలున్నంత అత్యుత్తమ ప్రమాణాలకు దీన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని అవకాశాలు మన ముందున్నట్టు నాకు తోస్తోంది. ఈ క్రమంలో మొదట పనికివచ్చేది ఆయన గురించి వారి శిష్యులు, అభిమానులు, విమర్శకులతో తయారుచేసిన మంచి సంకలనం-విశ్వనాథ శారద([1]) ఆన్లైన్లో డీఎల్ఐ ద్వారా దింపుకునే వీలుతో అందుబాటులో ఉంది. ఇది కాక వారి జీవితం, సాహిత్యాన్ని గురించి పుస్తకం.నెట్లో 41 వ్యాసాలు లభ్యమవుతున్నాయి. మరింకెన్నో చోట్ల దొరుకుతూన్నాయి. వీటితో విశ్వనాథ సత్యనారాయణ 120వ జయంతి సందర్భంగా మంచి వ్యాసం తయారుచేస్తే బావుంటుందని మిగిలిన కవుల వ్యాసాలకు పనికివచ్చేలా ఓ మార్గదర్శక పేజీలాంటిదేదైనా తయారుచేసుకునేందుకు కూడా ఈ సమిష్టి కృషి పనికివస్తుందని భావిస్తున్నాను. దీనికి నావంతుగా నేను చేయడమే కాక రాజశేఖర్ గారు, వైజాసత్య గార్లను ముందుగా ప్రతిపాదిస్తున్నాను. వారి సుముఖత ఎలా వుందో చూసి ముందుకువెళ్దాం. స్వస్తి--పవన్ సంతోష్ (చర్చ) 21:24, 8 నవంబర్ 2014 (UTC)

ఆంగ్ల వికీపీడియా స్థాయిలో జీవితచరిత్ర వ్యాసాలను అభివృద్ధి చేయాలనుకోవడం మంచిదే. దానికి మనదగ్గర విస్తృతమైన మూల సమాచారం వుండాలి. విశ్వనాథవారి వ్యాసాన్ని అందుకు ఎన్నుకోవడం బాగుంది. ఐతే నేను చేయాల్సింది ఏమిటో తెలియజేస్తే తప్పకుండా సహాయం చేస్తాను. అదే విధంగా నావద్ద గిడుగు సీతాపతి గురించిన పూర్తి జీవిత చరిత్ర పుస్తకం ఉన్నది. పైన మీరు తెలియజేసిన విధంగా నేను కూడా మంచి వ్యాసాన్ని రాయడానికి ప్రయత్నిస్తాను. పవన్, వైజాసత్య మొదలైన వికీసభ్యులు అందులోని లోటుపాట్లను తెలియజేసి సహకరించాలని కోరుతున్నాను.--Rajasekhar1961 (చర్చ) 17:01, 9 నవంబర్ 2014 (UTC)
Rajasekhar1961గారూ ఈ ప్రకారం నేను మార్పులు చేస్తున్నాను. మీరు నిశితంగా గమనించి సూచనలు, సలహాలు చెప్పగలరు. ముఖ్యంగా రచయిత జీవితానికి ఆయన సాహిత్యానికి సంబంధం ఉంటుంది. కానీ జీవిత విశేషాలు వ్రాసేప్పుడే ఆ దశలో వ్రాసిన సాహిత్యం గురించి ప్రస్తావనలు చేసేస్తే బావుంటుందా? (కనీసం ఆ దశ చూపిన ప్రభావం గురించో) మీరోసారి ఆలోచించి, నేను వ్రాస్తున్న వ్యాసానికి సమన్వయించి చెప్పగలరు. ఈ విషయంలో వైజాసత్య వంటివారి సూచనలు కూడా కోరుతున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 20:20, 13 నవంబర్ 2014 (UTC)
ఫోటోలు కూడా అవసరమవుతాయి. మనవాళ్ళెవరైనా విజయవాడ వెళ్తుంటే వారి ఇల్లు సందర్శించి వివిధ దశల ఫోటోలు(ఇక్కడ లేనివి) తీసుకువస్తే బావుంటుంది. ఇది మనసులో వేసుకుని విజయవాడ వెళ్ళినప్పుడు వీలునుబట్టి ప్రయత్నించగలరు.--పవన్ సంతోష్ (చర్చ) 20:22, 13 నవంబర్ 2014 (UTC)
తప్పకుండా సూచనలను తెలియజేస్తాను.Rajasekhar1961 (చర్చ) 05:54, 14 నవంబర్ 2014 (UTC)
రచనల జాబితాలను ఆకారక్రమంలో గాని లేదా వ్రాసిన క్రమంలో గాని అమర్చండి. ఉదాహరణ పద్యాలను రెండు వరుసలలో ఏర్పాటుచేయండి. ముఖచిత్రం క్లోజ్ అప్ గా ఉన్నదైతే బాగుంటుందని నా అభిప్రాయం.Rajasekhar1961 (చర్చ) 06:00, 14 నవంబర్ 2014 (UTC)
చక్కని ప్రయత్నం. తప్పకుండా నాకు వీలైనస్థాయిలో సహాయసహకారాలు అందించగలను. ఒక రచయితపై వ్యాసం వ్రాయాలంటే ఆయన సాహిత్యంపై చక్కని అవగాహన ఉండాలి. చాలా మూలాలు, వనరలు అవసరం. వ్యాసపు అత్యున్నత స్థితిలో దానిలో చాలా సింథసైడ్జ్ నాలెడ్జ్ ఉంటుంది. డేటా -> ఇన్ఫర్మేషన్ ->నాలెడ్జ్ క్రమంలో మెదట వీలైనంత డేటా/ ఇన్ఫర్మేషన్ సేకరించాలి. రచయిత యొక్క రచనల (పై/లో) జీవితకాల పరిస్థితుల యొక్క ప్రభావాన్ని చర్చించడం సింథసైడ్జ్ నాలెడ్జ్ కి ఉదాహరణ. --వైజాసత్య (చర్చ) 11:15, 14 నవంబర్ 2014 (UTC)