చర్చ:లొట్టపీసు పూలు (కథా సంపుటి)
Appearance
@Chaduvari గారూ, ఈ పుస్తకానికి సంబంధించిన వ్యాసంలో మూలాలు లేవు. బాహ్య లంకెలులోని తెలుగు బుక్స్ లింకులో పుస్తక ముఖచిత్రం సూచిస్తూ తెలియజేసే వ్యాపార ప్రకటనగా ఉంది. ఆంధ్రజ్యోతి లింకు లో పుస్తక పరిచయ సభ వార్త ఉంది. ఈనాడు లింకులో ఉపరాష్ట్రపతి ప్రసంశ సంక్షిప్తంగా ఉంది. ఈ పుస్తకానికి విషయ ప్రాథాన్యత తెలియజేయడానికి ఎటువంటి మూలాలు లేవు. ఇందులోని విషయమంతా రచయిత స్వంతంగా రాసుకున్నది. ఈ సమాచారానికి ఎటువంటి మూలాలు లేవు. దీనిని వ్యాసంగా పరిగణించవచ్చా? పరిశీలించగలరు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:07, 5 నవంబరు 2021 (UTC)
- ఈ పేజీలో చాలా సంస్కరణ చెయ్యాల్సి ఉంది.
- నేను గమనించినవివి:
- ఈ పేజీలో చూపించిన ఇన్‌లైను మూలాలు మూడూ విషయ ప్రాముఖ్యతను నిర్థారించడం లేదు.
- బయటి లింకులను చూస్తే వాటిలో -
- కొన్ని పుస్తకపు ఆవిష్కరణ లింకులు, కొన్ని కేవల ప్రస్తావన ఉన్న లింకులు, కొన్ని పుస్తకావిష్కరణ వార్తా లింకు, కొన్ని ంరుగా కథను ప్రచురించిన లింకు. ఇవి ప్రాముఖ్యతను చూపించవు.
- సారంగ లింకును విషయప్రాముఖ్యత నిరూపించేదిగా పరిగణించవచ్చు.
- పుస్తకానికి సంబంధించిన విషయ ప్రాముఖ్యత ప్రమాణాలు స్పష్టంగానే ఉన్నాయి. ప్రాముఖ్యతను నిరూపించే లింకులు కనీసం రెండు ఉండాలి అని అది చెబుతోంది. కాని ఇక్కడ ఒకటే ఉంది. మరో మూలాన్ని సంపాదించాలి.
- ఐతే..
- ఈ పేజీలో రాసిన సమాచారంలో 94.8% రాసినది రచయిత అనే వాడుకరి. ఆ వాడుకరి పేజీలో ఉన్న సమాచారం ప్రకారం అది స్వయానా రచయితే నని నేను భావిస్తున్నాను. దాన్ని సముదాయం పరిశిలించాలి. స్వీయ రచనలను ప్రోత్సహించరాదు.
- ఉన్న సమాచారం కూడా పూర్తిగా పాక్షిక దృక్కోణంతో ఉంది. మూలాల్లేని ప్రశంస విస్తారంగా ఉంది. దీనికి మూలాలనివ్వాలి లేదా ఆ పాఠ్యాన్ని తీసెయ్యాలి.
- పుస్తకంలో రాసిన ముందుమాటను ఉన్నదున్నట్టుగా ప్రచురించేసారు. దాన్నంతటినీ తీసెయ్యాలి.
- పేజీలో చూపించిన ప్రముఖుల అభిప్రాయాలకు మూలాల నివ్వాలి.
- __ చదువరి (చర్చ • రచనలు) 06:52, 8 నవంబరు 2021 (UTC)
- కొంత సమయమివ్వండి. తగిన ఆధారాలు సమర్పించబడును. తెలంగాణ కథా సాహిత్యంలో "లొట్టపీసు పూలు" కథలు ఒక సంచలనం. రాబోయే రోజుల్లో దీని ప్రాధ్యాన్యత అవార్డుల రూపంలో తెలుసుతుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి అభినందన పత్రం అందుకోవడం జరిగింది. అదే పెద్ద అధికారిక మూలం. అయినా కొంత సమయం ఇవ్వండి. రచయిత ఇతర వ్యాసాలూ రాయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రచయిత సమర్ధత శంకించాల్సిన పని లేదు. స్వయంగా తెలుగు సాహిత్యం చదువుకున్న, బోధిస్తున్న వారు. కాబట్టి వికీలో వ్యాసాలూ రాయడానికి తగిన సమయం, ఆధారాలు సాధించడానికి వికీ పై పట్టు సాధించడానికి మీ సాయం ఇవ్వండి . చాలు. ధన్యవాదాలు రచయిత (చర్చ) 16:31, 10 నవంబరు 2021 (UTC)
- రచయిత గారూ, సమయం ఇస్తాము కానీ వికీలో పాలసీలు ఈ లోపు మీముందు ఉంచాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈ వ్యాసానికి ఎటువంటి మూలాలు అవసరమవుతాయో వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వ్యాసం ఒక కథల సంపుటి గురించి. అంటే ఈ వ్యాసంలో కథల సంపుటి గురించి రాయాలి కానీ కథాంశాలే ప్రధానంగా ఉండకూడదు. సారాంశం సాధ్యమైనంత సంక్షిప్తంగా ఉండాలి. ఇక మూలాల విషయానికొస్తే ఈ కథల సంపుటి గురించి ప్రధాన పత్రికల్లోనో, పుస్తకాల్లోనో వేరెవరైనా సమీక్షించి ఉంటే మూలాలుగా వాడుకోవచ్చు. మీరు వ్యాసంలో వాడినవి కొన్ని మూలాలుగా పనికిరావు. ఉదాహరణకు ఈ లింకు నేరుగా కథకు వెళుతుంది కానీ కథ గురించి ఎవరైనా రాసిన వ్యాసానికి కాదు. ఇది మూలంగా వాడుకోలేము. అలాగే ఇది కూడా కథే. ఈ లింకు పని చేయడం లేదు. రాబోయే రోజుల్లో దీని ప్రాధాన్యత తెలుస్తుందని అంటున్నారు కదా. నిజానికి ఆ గుర్తింపు తర్వాతే వికీలో వ్యాసానికి విషయ ప్రాముఖ్యత ఉంటుందని గమనించగలరు. - రవిచంద్ర (చర్చ) 17:28, 10 నవంబరు 2021 (UTC)
- @రచయిత గారూ, పుస్తక రచయిత సమర్ధతను శంకించడం లేదు. ఇక్కడ రాసినవాటిలో దేన్నీ అబద్ధమనడం లేదు. వికీ నియమాల ప్రకారం విషయ ప్రాముఖ్యతను నిరూపించాలి, పాఠ్యంలో తగు మూలాల నివ్వాలి అంటున్నా నంతేనండి. వికీపీడియా:మూలాలు, వికీపీడియా:మూలాలను పేర్కొనడం, వికీపీడియా:నమ్మదగ్గ మూలాలు అనే పేజీలను చూస్తే మూలాల గురించి కొంత తెలుసుకోవచ్చు. ఆపైన ఏమైనా సందేహాలుంటే చర్చించండి. వ్యాసం మెరుగుపడడమే మనకు కావాల్సింది. అందుకు అవసరమైన కృషి చేద్దాం. మరొక్క సంగతి.. స్వయానా మీరే ఆ పుస్తక రచయిత అయితే, ఈ వ్యాసం మీరు రాయకుండా ఉంటే మంచిది. ఎవరి వ్యాసం వాళ్ళు రాసుకోకూడదనే నియమం వికీలో ఉంది. ఒక విజ్ఞాన సర్వస్వ వ్యాసానికి అది తగదు కదండీ. ధన్యవాదాలు సార్. __ చదువరి (చర్చ • రచనలు) 01:23, 11 నవంబరు 2021 (UTC)
- ఈ వ్యాసం రచయిత తన రచన గురించి స్వంతంగా రాసుకునే వ్యాసం. అతను వాడుకరి:రచయిత పేరుతో ఈ వ్యాసాన్ని రాసాడు. అందులోని సమాచారానికి విషయ ప్రాముఖ్యతని నిర్థారించే మూలాలు లేవు. రెండు సంవత్సరాలుగా ఏ మూలాలు చేర్చలేదు. ప్రముఖుల అభిప్రాయాలకు సంబంధించిన మూలాలు లేవు. ఈ పుస్తకం గురించి మూలాలు లేనందున ఒక వారం రోజులలో సరైన మూలాలు చేర్చనిచో మూలాలు లేని వాక్యాలన్నీ తొలగించబడటాయి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 06:37, 13 సెప్టెంబరు 2023 (UTC)