చర్చ:వల్లూరుపల్లి నాగేశ్వర రావు విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసం మెరుగుకు సూచనలు[మార్చు]

User:Nskjnv.indicwiki, User:Kirandotc వ్యాసకృషిలో పాల్గొంటున్నందులకు ధన్యవాదాలు. వికీలో వ్యాసం ప్రధానమైన విషయాలు మాత్రమే వుంటే ఆ వ్యాసం నాణ్యతగా వుంటుంది. కళాశాల వెబ్సైట్ లో వుండే అన్ని వివరాలు ఈ వ్యాసంలో చేర్చాల్సిన అవసరంలేదు. ఉదాహరణకు ప్రతి విభాగాధిపతిని పేర్కొనవలసిన అవసరంలేదు. ఏ విభాగాధిపతియైనా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు పొందిన వారైతే ఆ వివరాలతో వారిగురించి రాయవచ్చు. అలాగే ఏ కోర్స్ లో ఎన్ని సీట్లున్నవి చేర్చనవసరంలేదు. అవి సంవత్సరానికి మారుతూ వుండవచ్చు. కావున అటువంటి వివరాలు తొలగించండి. ఒకవేళ మీకు సందేహాలుంటే చర్చించండి. --అర్జున (చర్చ) 00:21, 26 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మీ సూచనలకు ధన్యవాదములు. మీరు చెప్పిన విదంగా వికీ శైలి, ఎన్సైక్లోపీడియా నోటబిలిటీకి అనుగుణంగా వ్యాసంలో మార్పులు చేసాను. Nskjnv.indicwiki (చర్చ) 13:35, 27 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
Nskjnv.indicwiki గారు, మీ స్పందనకు,మార్పులకు ధన్యవాదాలు. నేను మరికొంత సవరించాను. ఆంగ్ల వికీలో పేరుపొందిన కళాశాలలు, లేక విశ్వవిద్యాలయాల వ్యాసాలు (ఉదా:Cornell_University పరిశీలించండి. అప్పుడు వ్యాసాన్ని అభివృద్ధి పరచటానికి మరికొన్ని ఆలోచనలు స్ఫురించవచ్చు. అలాగే తెవికీ వారికి ఆసక్తి వున్న అంశాలపై బి గ్రేడ్/ ఏ గ్రేడ్ స్థాయి ఆంగ్ల వికీ వ్యాసాలు అనువాదం చేయండి అప్పుడు మీ అవగాహన మరింత మెరుగవుతుంది. కళాశాల ప్రాధాన్యత పరిశోధన అని తెలిపారు, పరిశోధన విభాగంలో ముఖ్యమైన విషయాలు చేర్చితే బాగుంటుంది. శైలి నియమాలు శిలాశాసనాలు కాదు. విచక్షణతో వాడాలి. పేరులో అండ్ వున్నప్పుడు తెలుగులో మరియు గా అనువదించటం నా దృష్టిలో తప్పేమి కాదు. --అర్జున (చర్చ) 23:07, 27 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

సరియైన పేరుకు తరలింపు[మార్చు]

దీని శీర్షికను " విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కళాశాల (హైదరాబాదు) " సరియైన పేరుకు తరలింపు చేయాలి.--యర్రా రామారావు (చర్చ) 13:54, 12 ఏప్రిల్ 2021 (UTC) (మరచిన సంతకం)[ప్రత్యుత్తరం]

మీ సూచనల మేరకు వ్యాస శీర్షికను తరలించాను. ధన్యవాదములు Nskjnv (చర్చ) 11:48, 12 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]