Jump to content

చర్చ:వినాయక జయంతి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వినాయక జయంతి వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2023 సంవత్సరం, 38 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

వినాయక చవితితో విలీనం చేద్దామా?

[మార్చు]

వినాయక జయంతి అంటే వినాయక చవితే కదా. దానికంటూ ఒక పేజీ ఉన్నప్పుడు మళ్ళీ వినాయక జయంతి అని మరొక పేజీ దేనికి? నిజానికి తెలుగు వారెవరూ ఇలా పిలవరు కదా. మహా అయితే, ఆ వినాయక చవితి పేజీలో వేర్వేరు పేర్లకు ఒక ప్రత్యేకమైన విభాగం పెట్టి గణేశ్ జయంతి అని దీన్ని కొన్ని ప్రాంతాల్లో అంటారని తెలియజేయవచ్చు. ఏమంటారు? పవన్ సంతోష్ (చర్చ) 06:55, 22 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు తెలిసినంతవరకు రెండు ఒకటే అని నేనూ భావిస్తున్నాను.వినాయక జయంతి అని పవన్ సంతోష్ గారు అన్నట్లు చాలా అరుదుగానే వ్యవహరిస్తారు.కాకపోతే ఇక్కడ ఇంకో విషయం ఆంగ్ల వికీపీడియాలో కూడా రెండు వ్యాసాలు ఉన్నవి. దీని విషయంలో దానిని ప్రామాణికంగా పాటించాలని నా అభిప్రాయం కాదు, పై అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 07:10, 22 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ఆ ఇంగ్లిష్ వ్యాసంలో ఒక తేడా చెప్పారండీ. ఇప్పుడు మీరు చెప్పాకా గమనించాను. ఏమిటంటే - వినాయక చవితి భాద్రపద శుక్ల చవితి నాడు చేసుకుంటాం కదా, కొన్ని ప్రాంతాల్లో వినాయక జయంతి అని మాఘ శుక్ల చవితి నాడు చేస్తారట. అంటే ఇదీ అదీ వేర్వేరు. అయితే, ఉంచొచ్చేమో, కాకపోతే ఈ ముక్క చాలా స్పష్టంగా మొదట్లోనే రాయాలి. పవన్ సంతోష్ (చర్చ) 08:28, 22 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ఆ విషయం రెండు వ్యాసాలలో వివరంగా రాస్తే సరిపోతుందనుకుంటాను.రెండు వ్యాసాలలో ఇవికూడా చూడండి అనే దానిలో అనగా వినాయక చవితి అనే వ్యాసంలో వినాయక జయంతి వ్యాసం లింకు, అలాగే వినాయక జయంతి వ్యాసంలో వినాయక చవితి అనే వ్యాసం లింకు ఇవ్వాలి. యర్రా రామారావు (చర్చ) 08:56, 22 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ విషయంలో వినాయక జయంతి వ్యాస సృష్టికర్త ప్రణయ్ రాజ్ గారు రెండు వ్యాసాలలో అవసరమైన సవరణలు చేయగలరు. యర్రా రామారావు (చర్చ) 09:08, 22 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసాల పేర్ల విషయంలో సూచనలు చేసినందుకు పవన్ సంతోష్, యర్రా రామారావు గార్లకు ధన్యవాదాలు. రెండు వ్యాసాలలో పైభాగంలో ఇతర వ్యాసాలు అనే మూసని పెట్టి, ఆయా వ్యాసాల లింకులను చేర్చాను.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:11, 12 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]