చర్చ:వై.యస్. రాజశేఖరరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Cscr-featured.svg వై.యస్. రాజశేఖరరెడ్డి వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2009 సంవత్సరం, 37 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


Y.S లో S అంటే[మార్చు]

Y.S లో S అంటే సామ్యూల్ అని ఎక్కడో చదివాను. మరి ఇక్కడ 'సందింటి' అని వ్రాసారేమిటి? --219.64.130.123 04:12, 24 ఫిబ్రవరి 2007 (UTC)

బలపనూరులో వీరి ఇల్లు ఒక సందులో ఉండడం వల్ల వీరిని సందింటి వారు అని పిలిచేవారు. అదే వారి ఇంటి పేరులో భాగంగా స్థిరపడింది. -త్రివిక్రమ్ 08:42, 14 సెప్టెంబర్ 2009 (UTC)
నేను ఎప్పుడు వాళ్ళింటి పేరు యేడుగురు సందింటి అనుకుంటుండేవాన్ని :-). అయ్యా మధ్యలో సామ్యూల్ ఉందని వాదించేవాళ్ళకు ఇది సరైన సమాధానం అనుకుంటా --వైజాసత్య 04:53, 18 సెప్టెంబర్ 2009 (UTC)

మీకు రాజశేఖరరెడ్డీ అంటే ఎంత అభిమానమన్నా ఉండొచ్చు. తెవికీ లాంటి తటస్థ వేదికపై నిష్ప్పాక్షికమైన దృష్టితో వ్యాసం వ్రాయాల్సి ఉంటుంది కాబట్టి క్రింది వాక్యాలు తొలగించండి: కడప జిల్ల్లా పులిబిడ్డ, సీమకే ముద్దు బిడ్డ--నవీన్ 15:03, 14 మార్చి 2007 (UTC)

రాజశేఖరుడు , ఆంధ్రరాష్ట్రం రాజశేఖరుడు, వీడు లేక పొతే మన నీటి ప్రాజెక్టుల ఎక్కడ ఉండేవి.

ఈ వారం వ్యాసం[మార్చు]

ప్రస్తుత ఘటనల కారణంగా ఈ వ్యాసాన్ని వచ్చే వారం (37వ వారం) "ఈ వారం వ్యాసం"గా ఉంచుతున్నాను. వ్యాసాన్ని మరిం అభివృద్ధి చేయమని కోరుతున్నాను --కాసుబాబు 11:25, 4 సెప్టెంబర్ 2009 (UTC)

ఈ ప్రతిపాదన సబబైనదే. శోభన్ బాబు మరణించినపుడు కూడా ఇలాగే చేసినట్లు గుర్తు. అభివృద్ధి చేస్తున్నాను. —రవిచంద్ర (చర్చ) 11:32, 4 సెప్టెంబర్ 2009 (UTC)


తటస్థత[మార్చు]

"రైతులకు ఉచిత విద్యుత్తు, జలయజ్ఞం తదితర వాగ్దాలను 2004 ఎన్నికలకు ముందు చేసి వాటిని నెరవేర్చినాడు. వర్షాలు పడనప్పుడు రైతుల మేలు కోరి మేఘమథనాలతో చిరుజల్లులు కురిపించినాడు. వానదేవుడు మనవైపే ఉన్నాడని పదేపదే చెప్పి రైతులను మురిపించినాడు. అధికారంలోకి వచ్చిన తొలి రెండు సంవత్సరాలలోనే రూ.16,000 కోట్లు హరితాంధ్రప్రదేశ్ కోసం వెచ్చించి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కృషిచేశాడు."

పైన వ్రాసినదంతా ప్రచార శైలిలో ఉంది. రచయితలు తటస్థతపై దృష్టి పెట్టమని కోరుతున్నాను --కాసుబాబు 03:46, 5 సెప్టెంబర్ 2009 (UTC)

ఆధారాలు లభ్యంకాని వాక్యాలు తొలిగించాను. -- C.Chandra Kanth Rao-చర్చ 18:34, 5 సెప్టెంబర్ 2009 (UTC)
చాలా వ్యాఖ్యలు వార్తపత్రికలలోని శ్రద్ధాంజలలు నుండి నేరుగా ఇక్కడ వ్రాసినట్టున్నవి. వ్యక్తి ఎలాంటి జీవితం గడిపినా మరణించగానే అతిశయోక్తాలంకారాలతో కీర్తిగానాలు చెయ్యటం భారతీయ వార్తాపత్రికలకు మామూలే కదా. చాలా వాక్యాలు తిరిగివ్రాయాలి. అంతదాకా ముందుపేజీలో పెట్టద్దని మనవి --వైజాసత్య 00:28, 7 సెప్టెంబర్ 2009 (UTC)
ఓ చూడలేదు, ఇప్పటికే పెట్టేసినట్టున్నారు. సరే, తొందరగా వ్యాసాన్ని సరిదిద్దాలి --వైజాసత్య 00:30, 7 సెప్టెంబర్ 2009 (UTC)

ఆధారాలు కావాలి[మార్చు]

రాజారెడ్డి తండ్రి బర్మాలో వ్యాపారం చేస్తూ, క్రైస్తవము స్వీకరించగా గ్రామమునుండి వెలివేయబడ్డాడు.

వారి కుటుంబంలో మొదటగా క్రైస్తవం స్వీకరించినది రాజారెడ్డి అని కొన్ని చోట్ల, ఆయన తండ్రి వెంకట రెడ్డి అని కొన్ని చోట్ల ఉన్నది. నిజమేమిటో నిర్ధారించుకోవడానికి సాధికారమైన/నమ్మదగిన ఆధారం కావాలి. -త్రివిక్రమ్ 08:42, 14 సెప్టెంబర్ 2009 (UTC)

ఈ కుటుంబవృక్షాన్ని చూస్తే రాజరెడ్డి అన్నకు ప్రభుదాస్ రెడ్డి అని ఒక చెల్లెలికి మేరీ పునీతం అని, మరో ఇద్దరు సోదరీమణులకు సుగుణమ్మ, రత్నమ్మ అన్న పేర్లు ఉండటం తాత వెంకటరెడ్డే క్రైస్తవాన్ని పుచ్చుకున్నాడనటానికి బలం చేకూరుస్తాయి. క్రైస్తవాన్ని పుచ్చుకున్నందుకు బలపనూరు నుండి వెలివేస్తే 1933లో పులివెందులలో స్థిరపడినట్టున్నారు --వైజాసత్య 05:06, 18 సెప్టెంబర్ 2009 (UTC)

వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యాసంలో ఆధారం లేకుండా విమర్శ వ్యాఖ్యలు రాసేరేమండి.

విమర్శలకు ఆధారాలు[మార్చు]

వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యాసంలో ఆధారాలు లేకుండా విమర్శ వ్యాఖ్యలు సరియైన పద్ధతి కాదు. మీకు శాశ్వత వనరులు కావాలంటే తెలుగు, ఇంగ్లీషు వార్తా పత్రికలోని ఎడిటోరియల్ వ్యాసాలని కూడా వాడవచ్చు కదా.--అర్జున 06:21, 8 ఏప్రిల్ 2011 (UTC)

రాష్ట్ర రాజకీయాలలొ ముఖ్యుడు కాకముందు (1996 కు ముందు) రాజశేఖర రెడ్డి, మరియు రాజారెడ్డి ల రాజకీయ చరిత్ర తెలుసు కోవడం కొరకు ఆంధ్ర ప్రదేశ్ పౌర హక్కుల సంఘం వారు ప్రచురించిన ఈ పుస్తకము చూడండి

http://balagopal.org/wp-content/uploads/2010/05/Kadapa-Palegalla-Rajyam.pdf

మీరు విమర్శ దగ్గర సరిపోయిన మూలం పుస్తకంలో వుంటే దానిని పేర్కొనండి. --అర్జున 11:45, 5 జనవరి 2012 (UTC)

Request[మార్చు]

Dear arjun, "vimarsalu" section of ysr contains highly offensive material . It has no proper references. Some one called chandrakanth rao is protecting it. It seems that section was written with political bias

పేరు లేకుండా ఎవరు వ్రాసారో కాని దీన్ని ఆ వ్యాసం చర్చాపేజీలో వ్రాస్తే బాగుండేది. ఎలాంటి చర్చ లేకుండా వ్యాసంలో విమర్శలు విభాగాన్ని పై చర్చ తీసిన ఐపీ అడ్రస్ సభ్యుడు పదేపదే తొలిగించడాన్ని నిర్వహణ దృష్ట్యా నేను దిద్దుబాటును రద్దు చేశాను. ఆ వ్యాసంలో నేను చాలా సమాచారం చేర్చాను. ప్రశంసలు కూడా చాలా చేర్చాను. దానికి లేని అభ్యంతరం విమర్శలను ఎలాంటి కారణం లేకుండా ఏకపక్షంగా తొలిగించినందుకు దిద్దుబాటు రద్దుచేయడాన్ని తప్పు ఎలా పడతారు? అసలు కారణం లేనిదే ఏకపక్షంగా విభాగాన్ని రద్దుచేయడమే తప్పుగా భావించాల్సి వస్తుంది. వ్యక్తి అన్న తర్వాత విమర్శలు కూడా ఉంటాయి. వ్యక్తిపై ఎంత అభిమానమున్ననూ విమర్శలను అంత తేలిగ్గా కొట్టిపారేయకూడదు. అలా అనుకుంటే విమర్శలు కూడా సమంజసమైన ఆధారలతో దానికి ఎన్నో రెట్ల పొడవు చేయవచ్చనే విషయాన్ని మరవకండి. కాని ఆ మార్పులు వ్యక్తిపై కక్షతో కాకుండా నిర్వహణ దృష్ట్యా చేసినవేనని అర్థం చేసుకుంటే మంచిది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:16, 13 ఏప్రిల్ 2012 (UTC)
పై చర్చ వాడుకరి చర్చ:Arjunaraoc#Request నుండి ఇక్కడకు(సరియైన పేజీ కాబట్టి) నకలు చేయబడినది. విమర్శ అనే విభాగాన్ని దానిలో చేర్చవలసిన సమాచారం వున్న ప్పుడు సమంజసమే. ప్రముఖ వ్యక్తుల వ్యాసాలపై తెవికీలో మార్గదర్శకాలను వికీపీడియా:జీవించి_ఉన్నవారి_చరిత్రలు మరియుదానిని పోలిన ఇంగ్లీషు వికీలోని వ్యాసంలో ఆధారాలు లేని విషయాలను చేర్చినవారు లేక వాటినితిరిగి చేర్చేవారిపై ఆధారాల చూపించవలసిన బాధ్యత వుంది. దీనిపై ఒకటి రెండు రోజులలో స్పందనల తర్వాత ఈ విషయంపై నిర్ణయం తీసుకోని వ్యాసంలో తగిన మార్పులు అలాగే తెలుగు వికీలో మార్గదర్శకాలను తాజాపరచటం చేయవచ్చు--అర్జున (చర్చ) 05:17, 14 ఏప్రిల్ 2012 (UTC)
తెలుగు వికీలోమార్గదర్శకాలలో అనువాదం చేయకుండా వికీపీడియా:జీవించి_ఉన్నవారి_చరిత్రలు#Dealing_with_articles_about_the_deceased మరియు వికీపీడియా:జీవించి_ఉన్నవారి_చరిత్రలు#Restoring_deleted_contentవున్న భాగంలో పైన తెలిపిన వివరాలు వున్నాయి. వీటిని చూచి, చంద్రకాంతరావు గారు స్పందించమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 05:55, 14 ఏప్రిల్ 2012 (UTC)
రెండవ లింకు ప్రస్తుతం ఈ వ్యాసానికి సంబంధం లేదు. మొదటి లింకు విషయానికి వస్తే అభ్యంతరకరమైన సమాచారాన్ని ఎవరైనా చర్చాపేజీలో లేవనెత్తినప్పుడు సభ్యులు చర్చించి పరిష్కరించడానికి వీలవుతుంది. అంతేకాని చర్చ లేకుండా మొత్తం విభాగాన్ని తొలిగించడం దుశ్చర్య కిందికి పరిగణించాల్సి వస్తుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 08:00, 14 ఏప్రిల్ 2012 (UTC)
hello chandrakant, i am not against criticism but i am against derogatory remarks. First point says he used his welfare schemes as "kukka biscuits"- isn't it derogatory remark.Second point describes him as a rowdy-isn't it derogatory to call CM as rowdy. Media was said to be terrorized and never wrote against him but in Newspapers like Eenadu, Andhrajyothy etc, you see articles daily written against him even during his rule. So this point was also false.Third point says he left moral values during his rule and it is claimed by "many" people. I don't know who those "many" people are, other than his political opponents. Fourth point says "It was widely acclaimed that "He used his own men and ruled the state unlawfully" ". -Is this a public opinion? Surely it is not. It is a olitically motivated statement. Fifth point is valid. It can be expanded to include his son jagan name. Sixth point is not a fact. Supreme court was never involved in Jagans assets case. It was HC which ordered a probe.My conclusion is please put Jagan's assets case . There are allegations of quid pro quo investments in his sons company upon which CBI is probing (it still needs to be proved) but rest of the points are derogatory , baseless or politically motivated.
ఇదే విషయము ముందే చర్చ తీస్తే బాగుండేది. చర్చ కాకుండా ఏకంగా విభాగాన్ని మళ్ళీ మళ్ళీ తొలిగించడం వల్లే నిర్వహణ దృష్ట్యా యధాస్థితికి తీసుకువస్తున్నాం. తెవికీ ముఖ్య లక్ష్యం విజ్ఞానాన్ని పెంచడమే కాని ఎవరికీ అనుకూలంగా లేక ప్రతికూలంగా ఉండదు. ఇక్కడ ఏ వ్యాసం కూడా ఎవరికీ అభ్యంతరం కాని స్థితిలో ఉంచడానికే ప్రయత్నిస్తాం. ఎవరికీ ఏవైనా అభ్యంతరాలుంటే నిస్సందేహంగా చర్చాపేజీలలో తెలియజేస్తే దానిపై చర్చ కొనసాగిస్తాం. మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి చర్చ కొనసాగించి సభ్యుల అభిప్రాయంతో ఒక నిర్ణయానికి వస్తాం. మరో విషయమేమంటే ఇక్కడ విమర్శలు రాసినది నేను కాదు. ఎవరు వ్రాసారో చరితం ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి చర్చా పేజీలలో నా పేరు వ్రాయడం బాగుండదు. అనేక వ్యాసాలలో చాలా సభ్యులు చాలా సమాచారాన్ని ఎలాంటి కారణం లేకుండా తొలిగించినప్పుడు వ్యాసాన్ని మళీ యధాస్థితికి తీసుకువస్తున్నాను. అందులో భాగంగానే ఈ వ్యాసాన్ని కూడా వెనక్కు తెచ్చాను కాని విమర్శలతో నాకు సంబంధం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:13, 14 ఏప్రిల్ 2012 (UTC)
చంద్రకాంతరావు గారు, నేనుఅర్థం చేసుకున్నదానిపట్టి వికీ విధానాల ప్రకారం మామాలు తొలగింపులు, ఆధారాలులేని విమర్శలు తొలగించటం వేరుగా చూడాలి. తొలగింపు రద్దులను మానవీయంగా చేస్తున్నాము కాబట్టి దీనిని పరిగణనలోకి తీసుకుంటే మంచిది. నేను వుదహరించిన రెండవలింకు మీరు సంబంధం లేదని ఎందుకు పరిగణించారో నాకు అర్థంకాలేదు. అనామక సభ్యుడు విమర్శ సరిగారాయగలిగే జ్ఞానం లోపించితే మొత్త విభాగం తొలగించివుండవచ్చు. ఈ వ్యాఖ్యలతో చర్చ పూర్తయినట్లు భావిస్తే నా సలహా ఏంటంటే, ఇంగ్లీషు వికీ వ్యాసంలో విమర్శను తెలుగులో అనువాదం చేసి విభాగం కొనసాగించితే బాగుంటుంది. పరిశీలించగలరు.--అర్జున (చర్చ) 13:22, 14 ఏప్రిల్ 2012 (UTC)
అర్జునరావు గారు, మీరు రోజూ చూస్తున్నారనుకుంటాను. తెవికీలో రోజూ జరిగే దిద్దుబాట్లను పరిశీలించి నిర్వాహక కార్యక్రమాలను అంటే అక్షరదొషాలు, వికీకరణ, అభ్యంతరకరమైన సమాచారం, అనవసర సమాచారం, ఉన్న సమాచారం తొలిగింపు తదితరాలు చూసే సభ్యులు చాలా తక్కువ. ప్రస్తుతం నాకు అంతగా సమయం లభ్యం కానప్పటికీ వీలైనంతవరకు నిర్వాహక పనులు కొన్ని చూస్తున్నాను. అందులో భాగంగానే ఎలాంటి చర్చలేకుండా వ్యాసాలలో ఉన్న సమాచారాన్ని తొలిగిస్తే నేను వాటిని రద్దుచేస్తున్నాను. ఇది ఒకటి-రెండు సార్లు కాదు చాలా సార్లు, చాలా వ్యాసాలలో జరుగుతోంది. ఇదే సభ్యుడు ఆంగ్ల వికీలో కూడా ఇదే పని చేస్తుంటే అక్కడ వ్యాసానికి తాళం వేశారు. ఈ సభ్యుడు తెవికీలో అనామక సభ్యుడంటే నాకు నమ్మశక్యంగా లేదు. కొద్దిపాటి మార్పులతో ఉన్న ఐపీ అడ్రస్‌లను పరిశీలిస్తే సుజాత, ప్రసాద్ గార్లచే సభ్యత్వం తీసుకోమంటూ పదేపదే సందేశం అందుకుంటున్నాడు. ఇక మీరు సూచించిన రెండో లింకు విషయానికి వస్తే అది జీవించినవారి వ్యాసాలకు సంబంధం అనుకొని చదవలేను. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:49, 14 ఏప్రిల్ 2012 (UTC)
ఈ వ్యాసంతో సంబంధం లేకుండా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఆధారం లేని విమర్శలు తొలిగించడానికి అనామక సభ్యులకు అవకాశం ఇస్తే తెవికీ నిర్వహణ ఇబ్బందిగా తయారౌతుంది. తెవికీలో సభ్యులు రెఫరెన్స్ పెట్టడమే తక్కువ, అలాంటప్పుడు ఆధారం లేదని సమాచారం తొలిగిస్తూ పోతే మనం చూస్తూ కూర్చోలేముకదా! అలాంటప్పుడు తెవికీ వ్యాసాలన్నీ ఐసుముక్కల్లా కరిగిపోతాయి. దీనిపై చర్చ జరిగిన తర్వాతే ఒక నిర్ణయానికి రావాలి కాని అనామక సభ్యులకు అవకాశం ఉండరాదనుకుంటున్నాను. ఎవరికివారు వ్యాసాలను తమకు అనుగుణంగా మార్చుకుంటూపోతే గొడవలే తప్ప మరేమి మిగలదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:57, 14 ఏప్రిల్ 2012 (UTC)

Hello chandrakant, I am extremely sorry if i had hurt you. We use proxy address in our network i.e for outside world same ip address appears for different users

మరీ ముందుకు వెళ్ళను కాని, ఇటీవల ఈ వ్యాసంలో, ఈ చర్చాపేజీలో, ఈ చర్చకు సంబంధించి చేసిన మార్పులలో ఉపయోగించిన ఐపీ అడ్రస్‌లు, వాటి దిద్దుబాట్లు చూడండి 117.200.3.119, 117.200.5.134, 117.200.12.66, 117.200.10.100, 117.200.0.72, 117.200.12.228, 117.200.10.78, 117.200.9.135, వీటిలో చాలా వాటికి స్వాగతం (ఖాతా) పొందినప్పటికీ ప్రతీసారి ఐపీ లాగిన్ కాకుండా దిద్దుబాట్లు ఉంటున్నాయి. (స్థిరమైన ఐపీ అడ్రస్ లేనప్పుడు ఇంటర్నెట్ లాగిన్ అయిన ప్రతీసారి కొత్త ఐపీ అడ్రస్ వస్తుంది). సి. చంద్ర కాంత రావు- చర్చ 17:37, 14 ఏప్రిల్ 2012 (UTC)
ఆంగ్లవికీలో పైన ఇచ్చిన 2 ఐపీ అడ్రస్ దిద్దుబాట్లను పరిశీలిస్తే ఆధారాలున్ననూ వైఎస్సార్‌పై విమర్శలు తొలిగించబడుతూ, చంద్రబాబు వ్యాసంలో మాత్రం విమర్శలు వ్రాసినట్లు గమనించండి. అలాగే ఈనాడు వ్యాసంలో సమాచారం తొలిగించబడింది. విజ్ఞానాన్ని సమకూరించే వికీలలో ఇలా రాజకీయ దృష్టితో కాకుండా రచనలు చేస్తే బాగుంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:02, 14 ఏప్రిల్ 2012 (UTC)

I made a request recently about GSDP growth rate 9% between 2004-09, 5.8% between 1996-2004 in both English articles but never changed them. i have also quoted appropriate sources in the request. I didn't make any changes in english wiki(they are protected). In "Vimarsalu" section other than 5th point i have raised my objections . There are 256*256 possible ip addresses with 117.200.X.X. I don't know about rest of them.

చర్చ పేరుగల సభ్యులతో మాత్రమే వుపయక్తం. వ్యక్తికి గురించిన పేజీలు అందునా జీవించివున్నవారు లేక ఇటీవల మరణించివున్నవారి పేజీలలో అధారాలు లేని విమర్శలు, తెవికీపై న్యాయ వివాదాలకు దారి తీయగలవు. అందుకని ఇంగ్లీషు వికీ మరియు తెవికీలోని విధానాలు ప్రకారం, నేను ప్రతిపాదించిన పరిష్కారం అమలు చేద్దాం. ఎవరికైనా అభ్యంతరముంటే రెండురోజులలో తెలియచేయండి--అర్జున (చర్చ) 04:41, 16 ఏప్రిల్ 2012 (UTC)
అర్జునరావు గారు మీరు సూచించిన పరిష్కారాలు ఏమిటి? నేను ఈచర్చాపుటలో ఏమీ చూడలేదు. Chavakiran (చర్చ) 09:25, 16 ఏప్రిల్ 2012 (UTC)
ఇంగ్లీషు వికీ వ్యాసంలో విమర్శను (దానికి ఆధారం వుందికాబట్టి) తెలుగులో అనువాదం చేసి విభాగం కొనసాగించటం (పై వ్యాఖ్యలలో వుంది). --అర్జున (చర్చ) 11:53, 16 ఏప్రిల్ 2012 (UTC)

నాకు ok

విమర్శలు విభాగం పై చర్చకి అనుగుణంగా మార్చబడినది --అర్జున (చర్చ) 11:20, 25 ఏప్రిల్ 2012 (UTC)
ఆంగ్ల వికీలో ఉన్నదే ఇక్కడా ఉండాలనేది ఏమీ లేదు. ఆధారాలు తెలియక ఎవరు రాశారో కాని ఆ విమర్శలు కూడా పత్రికలలో వచ్చాయి. కేవలం ఒక్క వాక్యం మాత్రమే అభ్యంతరకరం అది ఎవరో అనామక సభ్యుడు (బహూశా చర్చ తీసిన సభ్యుడే కావచ్చు) తొలిగించాడు. ఇప్పుడు మొత్తం విభాగాన్నే మార్చేయడం సమంజసంగా లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:09, 25 ఏప్రిల్ 2012 (UTC)
ఆంగ్లవికీలో ఆధారమున్నదికాబట్టి వాడడమైనది. మరికొన్ని ఆధారాలతో మీరు ఈ విభాగాన్ని విస్తరించవచ్చు.--అర్జున (చర్చ) 08:54, 26 ఏప్రిల్ 2012 (UTC)
చర్చలో సభ్యులు (లాగిన్ అయినవారు) ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వకున్ననూ వాక్యాలు తొలిగించడం ఏకపక్షంగా భావించవలసి ఉంటుంది. కాబట్టి తొలిగించిన వాక్యాలు మళ్ళి చేరుస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:59, 28 ఏప్రిల్ 2012 (UTC)
చంద్రకాంతరావు గారు. మీ స్పందనకు చాలా సమయం ఇవ్వబడింది. మీరు స్పందించకుండా, చివరికి మళ్లీ తొలగించిన వాక్యాలు చేర్చటం సమస్య పరిష్కారానికి తోడ్పడే స్పందన కాదు. ఇప్పుడైనా మీరు ఎందుకు ఆ ఆధార రహిత వ్యాఖ్యలు ప్రత్యేకించి వ్యక్తి గురించిన వ్యాసాల్లో వుంచాలో తెలియచేస్తే వుపయోగంగా వుంటుంది.--అర్జున (చర్చ) 04:04, 30 ఏప్రిల్ 2012 (UTC)
అర్జునరావు గారు, మీరు అనుకుంటున్నట్లుగా నేను స్పందనకు ఎలాంటి సమయం తీసుకోలేను. నా అభిప్రాయం ఇదివరకే చెప్పాను. మీరే చర్చ తీశారు, మీరే వాక్యాలు తొలిగించారు. సభ్యులు ఎలాంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చనిదే మీరు వాక్యాలు తొలిగించడం సమంజసంకాదని నేను యధాస్థితికి తెచ్చాను. చివరకు తప్పు నాపై వేస్తున్నారు. ఆంగ్లవికీ నియమాలను చూపించి, చివరకు ఒక పేరాకు మాత్రమే ఆంగ్లవికీలో ఉన్నట్లుగా మార్చాలని సూచించారు. అయిననూ సభ్యులు ప్రతిస్పందించలేరు. అలాంటప్పుడు దాన్ని అలాగే వదిలేస్తే బాగుండేది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:41, 30 ఏప్రిల్ 2012 (UTC)
మీ వాదన తెవికీ నియమాలకు విరుద్ధం. (అధారం లేని వివాదాస్పద వ్యాఖ్యలు వ్యక్తికి సంబంధించిన వ్యాసాలలో కొనసాగించటం తెవికీ నియమాలకి విరుద్ధం) మీరు వాటిని తొలగించిన మళ్లీ చేరుస్తున్నారు కాబట్టి, ఆధారాలు చేర్చాల్సిన బాధ్యత మీపై వుంది. అలా మీరు చేయుటలేదు. ఈ విషయమై ఎవరైనా పోలీస్ శాఖకి ఫిర్యాదు చేస్తే వారు దర్యాప్తు చేస్తే మీరే సమాధానం చెప్పవలసి మరియు బాధ్యత వహించవలసి వస్తుందని తెలియచేస్తున్నాను. మీరు ఆలోచించి తదుపరి నిర్ణయం తీసుకోగలరు.--అర్జున (చర్చ) 02:36, 1 మే 2012 (UTC)
మీరు చర్చ తీసి ఎలాంటి నిర్ణయం లేనిదే విభాగాన్ని మార్చడమే నియమాలకు విరుద్ధం. ఆధారం లేదని అనుకుంటే రెండేళ్ళ నుంచి ఎందుకు మార్చలేరు? అసలు చర్చ ఎందుకు తీశారు? సమాధానం నేనే చెప్పుకోవలసి ఉంటుందని చెప్పడం వెనక మీ ఉద్దేశ్యం ఏమిటి? నేనేమి ఆ వాక్యాలను చేర్చలేను కదా? ఆ వాక్యాన్ని వెంటనే తీసేయండి. అలాంటి వాక్యాన్ని ఇక్కడ వ్రాయడం మీరు భయపెట్టించడం కిందికే వస్తుంది. మీరు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఏమీ చేసిననూ సభ్యుల నిర్ణయం ప్రకారమే చేయాలి. నా వాదన నియమాలకు విరుద్ధంగా ఉందని వ్రాసారు. అసలు నా వాదన ఏమిటి? నేను ఆ విభాగాన్ని ఉంచడం, తొలిగించడంపై ఏమీ చెప్పలేదే? నియమాలకు విరుద్ధంగా మార్పులు చేస్తుంటే కేవలం యధాస్థితికి చేరుస్తునాను అంతే. ఆధారం ఉంది కాని ఇక్కడ ఎవరో తెలియక వ్రాయలేరు. ఆధారం లేదని సందేహం ఉంటే సభ్యుల నిర్ణయం ప్రకారం నడుచుకోండి కాని మీ ఇష్టప్రకారం కాదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 06:39, 1 మే 2012 (UTC)
మీరు నియమాల ప్రకారం కాకుండా పోలీసు శాఖకు తెలియజేసి నాపై ఫిర్యాదు చేసే దశలో ఉన్నట్లున్నారు. అనవసరంగా నాపై తప్పు దొర్లించి తెవికీ నుంచి బయటకు వెళ్ళగొట్టాలని మీ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. కాబట్టి మీ ఏకపక్ష అభిప్రాయం ప్రకారమే వ్యాస విభాగాన్ని మీ వరకు తెచ్చాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 07:40, 1 మే 2012 (UTC)
చంద్రకాంతరావు గారికి. వ్యాసం సరిదిద్దినందులకు ధన్యవాదాలు. మీరు తెవికీ కి చేస్తున్న కృషిపట్ల అపారగౌరవముంది. అనవసరంగా అపోహలు పడవద్దు. మీ చర్య ఫలితాలు ఏ విధంగా వుండవచ్చో తెలియచేయటమే (అలా జరిగిన సంగతులు నా దృష్టికి వచ్చాయి కాబట్టి) నా వుద్దేశ్యం.--అర్జున (చర్చ) 11:20, 6 మే 2012 (UTC)
అది కాదండి అర్జునరావు గారు, మీరు చర్చ తీసి ఎలాంటి నిర్ణయం వెలువడనిదే వాక్యాలు తీశేశారు కదండి. వర్తమాన విషయాలపై ఏ మాత్రం అవగాహన ఉన్నవారు సైతం ఈ వ్యాసంలోని ఆ విభాగం ఖాళీగా ఉండడాన్ని హర్షించరు. వ్రాయాలంటే ఆ విభాగమే వ్యాసానికి మించిపోతుంది (ఆధారాలతో సహా). కేవలం మూలాలు లేవని తొలిగిస్తే చాలా వ్యాసాలలో చాలా వాక్యాలు తొలిగించాల్సి ఉంటుంది. అవేవీ లేకుండా ఒక అజ్ఞాతసభ్యుడికి ప్రాధాన్యత ఇస్తూ కేవలం ఈ ఒక్క వ్యాసానికే దానికి పరిమితం చేయడం బాగుండదు. మీరు తొలిగించిన వాక్యాలు అన్నీ అభ్యంతరకరమైన కావు కూడా. ఆ వాక్యాలకు కూడా మూలం ఉంది (ఊహాగానాలు కావు) కాని వ్రాసేటప్పుడు ఎవరో ఆ విషయం తెలియక మూలం పెట్టలేరు. ఆధారం కోరబడినది అని వ్రాసి వారం రోజులు వేచిచూస్తే బాగుండేది. అప్పుడు నియమం ప్రకారం తొలిగించడానికి వీలయ్యేది. దీనిపై చర్చ ఎందుకు తీశారు? చర్చ తీసిన తర్వాత చర్చా నిర్ణయానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. చర్చలో ఎలాంటి నిర్ణయం రానిదే విభాగాన్ని మార్చారు కదా. దాన్ని మళ్ళీ చేర్చే అవకాశం నాకు ఉంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:49, 6 మే 2012 (UTC)
ఇటువంటి విషయాలలో ఆధారాలు లేని విమర్శలు చర్చలేకుండా తొలగించాలన్న నియమం నేను ఇంగ్లీషు వికీలో స్పష్టంగా చూశాను. న్యాయవివాదాలకు తావిచ్చే మార్పులు వికీపీడియా ప్రాజెక్టులన్నిటికి ఒకటే విధంగా వర్తిస్తాయని నా అనుభవం. అయినా సరే ఇది నా దృష్టికి వచ్చినందున తరువాతి చర్యలు చర్చించే ప్రయత్నం చేసి తీసుకొనడం జరిగింది. మీరు చర్చమధ్యలో దుశ్చర్య ప్రయత్నాల్లో భాగంగా జరిగిందన్నట్లుగా వివరించారు దానికి అనామక సభ్యుని స్పందన భిన్నంగా వుంది. మీ నుండి స్పందన రాకపోయేసరికి, చర్చపై మీరు ఆసక్తి కోల్పోయారనిపించి, నియమాల ప్రకారం చేయవలసిన పని చేయటం జరిగింది అంతే కాని మీరనుకున్నట్లు ఏకపక్ష నిర్ణయం కాదు. ఇకముందు ఇటువంటి విషయాలలో త్వరితంగా వికీపీడియన్లు మరియు నిర్వాహకులందరూ చర్యతీసుకుంటే మంచిది. నిర్వాహకుల దృష్టికి వేరొకరు తీసుకురానవసరంలేదు. 2012-05-06T22:08:46 (UTC) Arjunaraoc

సంరక్షణ[మార్చు]

ఈ వ్యాసంలో అజ్ఞాత సభ్యులు దిద్దుబాట్లు చేసే అవకాశం లేకుండా సంరక్షించాను. --వైజాసత్య (చర్చ) 17:47, 4 మే 2013 (UTC)