చర్చ:శ్రీకాళహస్తి
శివ శివయనరాధ శివనామము చేదా
శివ పాదం మీద నీశిరసు ఉంచరాదా
భవసాగరము ఈదే ఇ దొర్భరవేదనఏల
కరుణామయుడుకాదా ప్రభుచరణ ధూళి పడరాదా
హరహరహర అంటే మన కరువు తిరిగి పొదా
కరి పురుగు పాముబోయ మెరలిడగా వినలేదా
కైలాసం దిగి వచ్చి కైవల్యం ఇవలేదా
మదరాంతకుడి పై నిమనసు ఎన్నడుపొదేలా
మమకారుపుతెర స్వామిని కనులార కనరదా
ఇది అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారి కీర్తన
ఇది ఇక్కడ పెట్టచ్చా!
19:28, 16 May 2007 శాస్త్రి talk contribs block
- సుబ్బరంగా పెట్టవచ్చు --నవీన్ 09:32, 11 జూన్ 2007 (UTC)
శ్రీకాళహస్తి అంధ్ర ప్రదేశ్ లో తిరుపతికి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న మున్సిపాలిటీ. ఇది స్వర్ణముఖి నదీ తీరంలో ఉన్న పుణ్య క్షేత్రం. వాడుకలో అందరూ ఈ ఊరిని కాళహస్తి అంటారు.
కాళహస్తి దక్షిణ భారత దేశంలోని శైవ క్షేత్రాలలో ఒకటి. ఆలయ ప్రాంగణం స్వర్ణముఖి నదీ తీరం నుండి సమీపంలో కొండల వరకూ విస్తరించి ఉంది. ఈ క్షేత్రాన్ని దక్షిణ కైలాసం అని కూడా అంటారు. ఈ ఆలయ నిర్మాణంలో మూడు పెద్ద గాలి గోపురాలు ఆనాటి భారీ నిర్మాణ శైలికి అద్దం పడతాయి. ఈ ఆలయం కృష్ణ దేవరాయలి కాలంలో నిర్మించబడింది. ఈ ఆలయం లో వేయి స్తంభాల మండపం ఎంతో ప్రశస్తమైనది.
క్షేత్ర పురాణం:
కాళహస్తికి ఆ పేరు మూడు జీవులనుండి వచ్చింది. శ్రీ (సాలీడు), కాళ (సర్పం), హస్తి (ఏనుగు); ఈ మూడు జీవులు శివార్చన చేసి ఇక్కడే మోక్షాన్ని పొందాయి. ఆలయ గర్భ గుడిలో ఈ మూడు జంతువుల శిల్పాలను చూడవచ్చు. స్కంద పురాణంలోను, శివ పురాణంలోను, లింగ పురాణంలోను కాళహస్తి క్షేత్ర విశేషాలు చూడవచ్చు. స్కంద పురాణంలో అర్జునుడు ఈ క్షేత్రాన్ని సందర్శించి స్వామినర్చించాడని, సమీపంలో పర్వతంపై భరద్వాజ మహర్షిని సందర్శించాడని ఐతిహ్యం. కన్నప్ప (భక్త కన్నప్పగా ప్రశస్తుడు) అనే కోయ జాతి యువకుడు కూడా ఈ స్వామినర్చించి మోక్షం పొందాడు. తమిళ మునులలో అప్పర్, సుందరర్, సంబంధర్ లు ఈ స్వామినర్చిస్తూ అనేక భక్తి గీతాలు వ్రాశారు. శిశుహత్యా దోష నివారణకై సృష్టికర్త బ్రహ్మ కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించి స్వర్ణముఖి నదిలో స్నానమాచరించాడని మరొక ఐతిహ్యం. శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారి శుకబ్రహ్మాశ్రమం కూడా కాళహస్తిలోనే కలదు.
- ఈ వారం వ్యాసాల చర్చలు - Y2008
- ఈ వారం వ్యాసాల చర్చలు - W52
- వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు
- విశేషవ్యాసం అవ్వదగిన ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల వ్యాసాలు
- అతిముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల వ్యాసాలు
- విశేషంఅయ్యే-తరగతి ఆంధ్రప్రదేశ్ వ్యాసాలు
- విశేషంఅయ్యే-తరగతి అతిముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ వ్యాసాలు
- అతిముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ వ్యాసాలు