Jump to content

చర్చ:శ్రీ శ్రీ శ్రీ సంతోషిమాత

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

దయచేసి నాకు సహాయం చేయండి

[మార్చు]

నేను రాసిన వ్యాసం గురించి సహాయం చేయండి Bahulyapentakoti (చర్చ) 02:44, 12 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ఏ సాయం కావాలో చెప్పండి. పేజీ పేరు సంతోషిమాత, మ్యాపులో కోడూరు గ్రామాన్నీ చూపిస్తున్నారు, రాసిందేమో విజయవాడ కనకదుర్గ గుడి గురించి -తికమకగా ఉంది. అన్నట్టు, మీరు నా చర్చాపేజీలో రాసిన దానికి సమాధానం ఇచ్చాను చూడండి. __చదువరి (చర్చరచనలు) 03:12, 12 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసంలో విషయానికి, మూలాలకు ఎటువంటి సంబంధం లేదు. సరైన మూలాలు చేర్చాలి.----కె.వెంకటరమణచర్చ 14:05, 12 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

నోటబిలిటీ

[మార్చు]

సాక్షి పత్రికలోని లింకు ఈ వ్యాసపు నోటబిలిటీని నిర్ధారించేందుకు పనికిరాదు. వ్యాస విషయం గురించిన సమాచారాన్ని ఇది ఇవ్వడం లేదు. తొలగింపు మూసను తొలగించడం అనుచితం.__చదువరి (చర్చరచనలు) 04:48, 13 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

అవును. ఇలా వ్యాసాలు సృష్టించుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రతి గ్రామంలో ఓ మోస్తరు గుడికీ మనం వ్యాసం సృష్టించాల్సి వస్తుంది. నా అభిప్రాయం తొలగించాలనే. --రవిచంద్ర (చర్చ) 05:14, 13 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

కాని వార్తా పత్రికలో ని విషయం రాయలి అనుకుంటే ఓక్కో గ్రామం లోని ఓక్కో సంవత్సరం ఓక్కోలా రాస్తారు. గుడి గురించి రాయలి అంటే గుడి కట్టినప్పుడు వార్తా పత్రికలో ప్రచురణ అయి ఉండాలి.అప్పటికి ప్రచురణ ఇవ్వలేని. Bahulyapentakoti (చర్చ) 08:19, 13 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ దేవాలయం ప్రసిద్ధమైనదైతే ఆ దేవాలయ చరిత్ర, గొప్పతనం గూర్చి వివిధ పత్రికలలో ఆర్టికల్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ అంతర్జాలంలో ఎటువంటి మూలాలు లభ్యమగుటలేదు. కనుక ఈ వ్యాసానికి నోటబిలిటీ లేదు. కనుక తొలగించాలి. సరైన మూలాలు లేని ఈ వ్యాసాన్ని ఉంచినట్లయితే రవిచంద్ర గారు అన్నట్లు ప్రతీ గ్రామంలొ ఉన్న నోటబిలిటీ లేని అనేక దేవాలయ వ్యాసాలు చేరే అవకాశం ఉంది. ----కె.వెంకటరమణచర్చ 12:52, 13 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం తొలగింపు గూర్చి చర్చ జరుగుతున్నప్పుడు తొలగింపు మూసను తొలగించడం అనుచితం.----కె.వెంకటరమణచర్చ 13:35, 13 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

కాని నేను సాక్షి లో వచ్చిన ఆర్టికల్ అంతర్జాలం లో ఉన్న లింకును జతచేశాను. అయిన మీరు తప్పు ఉన్నట్లు చెప్పినారు. నా ద్రుష్టి లో మీరు ఉద్దేశపూర్వకంగా తోలగిస్తున్నారు అని అనుకుంటున్నాను. మీలా అనుభవం ఉన్నవాళ్లే గాని నావంటి కొత్త వారు రాయకూడదు అన్నట్టు ఉంది. Bahulyapentakoti (చర్చ) 13:38, 13 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు ఇచ్చిన అంతర్జాల లింకు అక్కడ జరిగే ఉత్సవాలకు, దేవాలయ ఉనికిని తెలియజేస్తుంది. దేవాలయ చరిత్ర గూర్చి ఎటువంటి ఆధారాలు లేవు. ఆధారాలు లేని వాక్యాలు తొలగించబడతాయి. మీ వంటి కొత్తవారు వ్రాస్తే అనుభవం గల వాడుకరులు తగిన ప్రోత్సాహం యిస్తారు. వికీలోని వ్యాసానికి కొన్ని నియమాలు ఉంటాయి కదా. మన స్వంత బ్లాగులలో ఎలాగైనా వ్రాసుకోవచ్చు. కానీ వికీపీడియాలో వ్రాసేటప్పుడు మూలాలు గల వాక్యాలనే చేర్చాలి. కొన్ని వెబ్‌సైట్ల నుండి యధాతథంగా విషయం చేర్చినా కాపీహక్కుల నియమాలను ఉల్లంఘించినట్లు అవుతుంది. కనుక సరియైన మూలాలు లభించిన తరువాత మరలా వ్యాసం వ్రాయవచ్చు. లేదా విషయం సంగ్రహం కనుగ కోడూరు (మాకవరపాలెం) వ్యాసంలో ఒక విభాగంగా ఈ దేవాలయం గూర్చి సంగ్రహంగా చేర్చవచ్చు. ----కె.వెంకటరమణచర్చ 13:45, 13 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
Bahulyapentakoti మూరు ఈ వ్యాసంలో తొలగింపు మూసను ఎందుకు తోలగిస్తున్నారు? వ్యాసంపై చర్చ జరుగుతున్నప్పుడు తొలగింపు మూసను మీరు తొలగించరాదు. ఆ వ్యాసం తొలగింపు చేయరాదని సముదాయం నిర్ణయిస్తే ఆ మూసను నిర్వాహకులే తొలగిస్తారు.----కె.వెంకటరమణచర్చ 14:41, 13 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
బాహుళ్య గారూ, ఒకసారి చర్చించి, తొలగించిన వ్యాసంలో ఉన్న పాఠ్యాన్ని దాదాపుగా ఉన్నదున్నట్టుగా తెచ్చి ఈ పేజీని సృష్టించారు. దీన్ని వేరే చర్చ ఏమీ లేకుండా తక్షణమే తొలగించి ఉండవచ్చు. కానీ వెంకటరమణ గారు అలా చెయ్యకుండా చర్చకు వీలు కల్పించారు. మీరు కొత్తవారు కాబట్టి బహుశా ఆయన అలా చేసి ఉంటారు. కొత్తవారు రాయకూడదు.. అని మీరు ఆరోపించినదే నిజమైతే ఆయన అలా చేసి ఉండేవారు కాదు. రెండోది.. తొలగించిన పేజీని మీరు పదేపదే సృష్టిస్తూ పోతున్నారు. సాధారణంగా అలా చేసిన వాడుకరిపై నిరోధం విధిస్తారు. మీపై అలా చెయ్యలేదు.. మీరు కొత్తవారు కాబట్టి. దయచేసి ఒకటి గ్రహించండి.. ఇక్కడ కొత్తగా వచ్చేవారికి సదా ఆహ్వానం ఉంటుంది. మీరు పదేపదే తొలగించిన వ్యాసాన్ని సృష్టిస్తూ పోతున్నా కొత్తవారు గదా అని సహనంగా ఉండడం అందుకు నిదర్శనం. మీరు ఇలాంటి పనులు చేస్తూ ఇక్కడ ముగ్గురికి పని కల్పించారని గమనించండి. ఇలా తప్పులు మీరు చేస్తూ, ఆ తప్పులను సరిచేస్తున్నవారిపై ఆరోపణలు చెయ్యడం అనుచితం, అసంబద్ధం. __చదువరి (చర్చరచనలు) 15:45, 13 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]