చర్చ:హిందూమతము
వ్యాసంతో సంబంధం లేని విషయాలు
[మార్చు]Nrahamthulla గారు మొదటగా మీరు ఆంగ్ల భాషలో రాశారు. రెండోది, మీరు రాసినది మరొకరి అభిప్రాయం తప్ప హిందు మతం చెప్పేది కాదు. అందుకే అది తుడిచి వేశాను. హిందూ మతానికి సంభందించినది రాయండి. దాని మీద ఇతరుల అభిప్రాయాలు కాదు. ఎవరో స్వామీజీ చెప్పిన విషయాన్ని రాస్తే ఎలా? మతం మార్చుకున్న వారి గురించి హిందూ మతం ఏమీ చెప్పలేదు. --శశికాంత్ 18:12, 12 ఆగష్టు 2010 (UTC)
అనువాదం
[మార్చు]హిందూమతం ప్రాజెక్టుకు కేంద్రవ్యాసమైన ఈ వ్యాసం ఇలా ఆంగ్లములో ఉండటం బాగోలేదు. యుద్ధ ప్రాతిపదికన దీన్ని అనువదించాలి --వైజాసత్య 00:21, 7 అక్టోబర్ 2007 (UTC)
- అనువదిద్దాం--బ్లాగేశ్వరుడు 00:31, 7 అక్టోబర్ 2007 (UTC)
- ఇంతకు ముందు రవిచంద్ర గారు చాలా భాగం అనువదించి, ఆంగ్ల భాగాలను కూడా అలానే ఉంచేసినట్లున్నారు. వాటిని తొలగించాను. తెలుగువారికి అవుసరం లేని రిఫరెన్సులు కొన్ని తీసివేశాను. మిగిలిన కొద్ది భాగాన్ని అనువదించాను. ఏమైనా ఈ వ్యాసం నాకు అస్సలు నచ్చలేదు. అంతా కలగాపులగంగా ఉంది. బొమ్మలు కూడా సరైనవి ఎన్నిక చేసుకోలేదు. వ్యాసాన్ని మెరుగుపరచవలసిన అవుససరం చాలా కనిపిస్తున్నది.--కాసుబాబు 08:36, 6 నవంబర్ 2007 (UTC)
రవిచంద్రగారు ముందుగానే చెప్పారు. నాకు వికీ గురిమ్చి సరిగా తెలియదు నాకు తోచినంత చేస్తాను. తరువాత ఎవరైనా సరిదిద్దమని. కేవలం ఆంగ్ల అనువాదాన్ని ఆదారం చేసుకోకుండా మళ్ళీ వీలయినంత కొత్తగా రాస్తే బావుండొచ్చు. విశ్వనాధ్. 08:43, 6 నవంబర్ 2007 (UTC)
హిందూ మతము
[మార్చు]హిందూ మతము ఒక జీవన ధార. ఒక తత్వము. ఆద్యంతము లేనిది. ఆన్ని విధముల ఆలోచనా సరళులను తనలో ఇముడ్చుకుంటుంది. ఒక విధముగా నిజమైన ప్రజాస్వామిక, లౌకిక, స్వేచ్ఛాయుతమైన శాస్త్రీయ మతము. ప్రకృతిలోని ప్రతి వస్తువునూ, జీవజాలమునూ ప్రేమించి, ఆదరించి, ఆరాధించు తత్వము గలది. ఆస్తికునకు, నాస్తికునకు స్వేచ్ఛ గా తన భావ ప్రకటన చేయగల అవకాశము ఇస్తుంది. ఈ కారణముగానే భారతములో వేల సంవత్సరములు గా హైందవులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు, యూదులు, పార్శీలు, క్రైస్తవులు, మహమ్మదీయులు, బహాయీలు మున్నగు వారు స్వేచ్ఛగా మనగలుగుతున్నారు. స్వాభావికముగా లౌకిక తత్వము గల ఈ ఉత్కృష్ఠ మతమును కాపాడుకొనుట అందరి ధర్మము.Kumarrao 06:45, 6 జనవరి 2009 (UTC)
- హిందూమతం అనేది ఒక అమృతధార గంగానది ప్రవహించినంత కాలం ఇది అలా ప్రవహిస్తూ ఉంటుంది.--t.sujatha 08:19, 6 జనవరి 2009 (UTC)
- ఆ ప్రవాహాన్ని అడ్డుకోవడానికి శాయశక్తులా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రాణాలు త్యాగము చెసిన రాజులు, మహరాజులు, సైనికులు ఇపుడు లేరు. సామాన్య హిందువులే చైతన్యవంతులై చుట్టూ పొంచివున్న ప్రమాదాలను గుర్తెరిగి భవిష్యత్ ను కాపాడుకొనుటకు దీక్ష వహించాలి.Kumarrao 13:21, 6 జనవరి 2010 (UTC)
- "భారతీయులంతా హిందువులే. హిందువులు కానివారు భారతీయులేకాదు.హిందువు అన్న పదానికి అర్థం మతం కాదు, అది జీవన
విధానం.--ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ (సాక్షి 1.3.2010) ఈ విస్తృత నిర్వచనం ప్రకారం మనదేశంలో జన్మించిన క్రైస్తవ,ముస్లిం భారతీయ సోదరులంతా జన్మతా హిందువులే కదా?భారతీయ ముస్లిములు,క్రైస్తవులు- హిందువులు కాకుండా ఎలా ఉంటారు?--Nrahamthulla 06:36, 1 మార్చి 2010 (UTC)
- ధన్యవాదాలు రహమ్తుల్లా గారూ. హిందూ అన్నది ఒక జాతి సంస్కృతి అన్న మాటతో నేను ఏకీభవిస్తాను. సింధూ నదీ తీరాన విలసిల్లిన సంస్కృతికి హిందూ అన్న పేరు వచ్చింది. మనమంతా ఒక్కటే అన్న మీ భావనకు జోహార్లు. జాతి, మతము, దేశము దాటి విశ్వమానవ సౌభాత్రం వైపు అడులు వేయటమే మనిషి కర్తవ్యం.--t.sujatha 15:27, 1 మార్చి 2010 (UTC)
సనాతన ధర్మము
[మార్చు]సనాతన ధర్మము హిందూమతానికి అసలు పేరేమోనని అనుమానం. తెలిసిన సభ్యులెవరైన దయచేసి సరిచేయండి. δευ దేవా 16:07, 10 ఫిబ్రవరి 2011 (UTC)
హిందూ మతము దారిమార్పు
[మార్చు]యర్రా రామారావు గారు, మీరు హిందూ మతము ఉన్నచోట హిందూమతం లేదా హిందూ మతం అని మార్చాలని, దారిమార్పులు చేస్తున్నారు. ఇది అనవసరము అనిపిస్తుంది. హిందూ మతము పేరుతో గూగుల్ నందు 1,26,000, హిందూ మతం పేరుతో 54,300 అని చూపిస్తున్నది. మీరు హిందూ మతం అని మొత్తం వర్గాలలోని అన్నింటినీ మార్చే ప్రయత్నం కేవలం వృథా ప్రయాస మాత్రమేనని నా అభిప్రాయం. మీరు ఇతరులతో చర్చ చేయాలనుకుంటే చర్చ పెట్టి చర్చలు చేసుకోండి. నేను చర్చకు రాను, దానిలోకి నన్ను లాగకండి. ఇక మీ మరియు సమూహం ఇష్టం. JVRKPRASAD (చర్చ) 04:17, 26 ఫిబ్రవరి 2019 (UTC)
- JVRKPRASAD గారూ హిందూ మతం పేరుతో గూగుల్ నందు 18,70,000 ఫలితాలు, హిందూమతం పేరుతో మీరు తెలిపినట్లు 54,300, హిందూమతము పేరుతో 3510, హిందూ మతము మీరన్నట్లు 1,26,000, అని చూపిస్తుంది.ఈ వ్యాసం సృష్టింపు 'హిందూమతము' అని సృష్టించబడినది.మీరు చూచించిన దానికన్నా గూగుల్ నందు ఎక్కువ ఫలితాలు చూపిస్తున్న 'హిందూ మతం' కు దారిమార్పు తప్పు, వృధా ప్రయాస కాదనుకుంటాను.ఇంకొక విషయం గమనించగలరు.వికీపీడియా:శైలి భాష అనే విభాగంలో ము, అనుస్వారాల (సున్నా) వాడుకలో వికీపీడియా విధానం ప్రకారం 'ము' తో అంతమయ్యే పదాల విషయంలో 'ము' స్థానంలో అనుస్వారం వాడుకలోకి వచ్చింది. ప్రపంచము, అంధకారము, అనికాక ప్రపంచం, అంధకారం అని రాస్తూంటాం. వికీపీడియాలో కూడా అదే విధానాన్ని అవలంబించాలి. అలాగే అనుస్వారంతో అంతమయ్యే పదాలకు బహువచనాలు రాయడంలో అనుస్వారం లుప్తమైపోయి, దాని ముందరి అక్షరం దీర్ఘమై చివర్లో లు చేరుతుంది. విధానం అనే పదం యొక్క బహువచనరూపం విధానాలు అవుతుంది అని వివరించబడిన మార్గ దర్శకాలుకు అనుగుణంగా మార్పులు జరిగాయి.--యర్రా రామారావు (చర్చ) 05:24, 26 ఫిబ్రవరి 2019 (UTC)
- నన్ను హిందూ మతము అన్న పదము ఉన్నచోట హిందూ మతం అని మార్చేయమంటారా ? మీరు తెలియజేస్తే వెంటనే ఆపని చేస్తాను. ఇది చాలా పెద్ద పని. ఏ సంగతి చెప్పండి. JVRKPRASAD (చర్చ) 06:35, 26 ఫిబ్రవరి 2019 (UTC)
- JVRKPRASAD గారూ ఇలాంటి చేయవలసిన మార్పులు వ్యాసాలలో చాలా ఉన్నవి.ఇవి మనుషులు చేస్తే అయ్యే పనికాదు.ఇది ఆటో వికీ బ్రౌజరు యంత్రంతో చేయవలసిన పని.మీరు ఏమి చేయవలసిన పనిలేదు.ఈ పనిని చదువరి గారు పరిశీలించి తగిన మార్పులు చేయవలసిందిగా వారిని కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 13:56, 26 ఫిబ్రవరి 2019 (UTC)
- యర్రా రామారావు గారు, హిందూ మతము అనే వర్గంలో అధిక శాతం డేటా నేను ఒక మనిషిగా వ్రాసినదే, అది మీకు తెలియక పోవచ్చు. నేను మనిషినే కాబట్టి నేను చేయగలను. అయినా హిందూ మతం అని రెండు పదాలు అనేది సరి అయినదా లేక హిందూమతం అనే ఒకే పదం సరిఅయినదా అనేది కూడా ఆలోచించ వలసినది కూడా ఉంది. నేను ఒక మనిషిగా చేసిన డేటా ఎంతో ఒకసారి నా లెక్కలు చూడండి. నేను చేయలనుకున్నది చేస్తాను, అసలు హిందూ మతం గా మార్చాలా లేక హిందూమతం గా మార్చాలా అనేది ముందు తేల్చి చెప్పండి. పని చేయడంలో దయచేసి నన్ను తక్కువగా చేయకండి.JVRKPRASAD (చర్చ) 14:30, 26 ఫిబ్రవరి 2019 (UTC)
- JVRKPRASAD గారూ హిందూ మతం పేరుతో గూగుల్ నందు 18,70,000 ఫలితాలు, హిందూమతం పేరుతో మీరు తెలిపినట్లు 54,300, హిందూమతము పేరుతో 3510, హిందూ మతము మీరన్నట్లు 1,26,000, అని చూపిస్తుంది.ఈ వ్యాసం సృష్టింపు 'హిందూమతము' అని సృష్టించబడినది.మీరు చూచించిన దానికన్నా గూగుల్ నందు ఎక్కువ ఫలితాలు చూపిస్తున్న 'హిందూ మతం' కు దారిమార్పు తప్పు, వృధా ప్రయాస కాదనుకుంటాను.ఇంకొక విషయం గమనించగలరు.వికీపీడియా:శైలి భాష అనే విభాగంలో ము, అనుస్వారాల (సున్నా) వాడుకలో వికీపీడియా విధానం ప్రకారం 'ము' తో అంతమయ్యే పదాల విషయంలో 'ము' స్థానంలో అనుస్వారం వాడుకలోకి వచ్చింది. ప్రపంచము, అంధకారము, అనికాక ప్రపంచం, అంధకారం అని రాస్తూంటాం. వికీపీడియాలో కూడా అదే విధానాన్ని అవలంబించాలి. అలాగే అనుస్వారంతో అంతమయ్యే పదాలకు బహువచనాలు రాయడంలో అనుస్వారం లుప్తమైపోయి, దాని ముందరి అక్షరం దీర్ఘమై చివర్లో లు చేరుతుంది. విధానం అనే పదం యొక్క బహువచనరూపం విధానాలు అవుతుంది అని వివరించబడిన మార్గ దర్శకాలుకు అనుగుణంగా మార్పులు జరిగాయి.--యర్రా రామారావు (చర్చ) 05:24, 26 ఫిబ్రవరి 2019 (UTC)
- JVRKPRASAD గారూ ఇలాంటి పదాలు చాలా ఉన్నాయి.ఇది నేను ఒక్కడిని చెప్పేదిగాదు.రచ్చబండలో చర్చించి, సముదాయం నిర్ణయం మేరకు తగిన మార్పులు చేయవలసి ఉందని నా అబిప్రాయం.దీని మీద ఇంతకంటే నేను చెప్పేది ఏమీ లేదని గ్రహించగలరు.--యర్రా రామారావు (చర్చ) 14:46, 26 ఫిబ్రవరి 2019 (UTC)
- మీరు హిందూ మతం అని మార్పులు మొదలు పెట్టారు కనుక నేను అడిగాను. మీరు దారిమార్పులు చేయకపోతే ఈ చర్చ లేదు. తదుపరి చదువరి గారు ఆటో వికీ బ్రౌజర్ వేసి మారులు చేస్తారు అని కూడా అన్నారు. వారికి పని పెట్టడం ఎందుకు అని నేను చెస్తాను అన్నాను. నేను బ్రౌజర్ లేదా మనిషిగా నైనా చేయగలను అని చెప్పాను. మీకు చర్చలో పెట్టమని కూడా అడిగాను. మీరు దారిమార్పులు చేయకపోతే నేనూ మార్పులు చేయను. మీరు గ్రహించగలరు. JVRKPRASAD (చర్చ) 15:03, 26 ఫిబ్రవరి 2019 (UTC)
భారత దేశము, ఆంధ్ర ప్రదేశ్
[మార్చు]యర్రా రామారావు గారు, ఈ సందర్భంలోనే మన దేశం పేరు భారత దేశము, భారత దేశం, భారతదేశం అని మూడు రకాలుగా వ్రాస్తున్నారు, ఒక సరి అయిన పేరు సూచించండి. అలాగే ఆంధ్రప్రదేశ్ లేదా ఆంధ్ర ప్రదేశ్ అని రెండు రకాలుగా వాడుతున్నారు. ఏది సరి అయిన పదమో తెలియజేయండి. దానికి తగ్గట్లు మార్చుతాను.JVRKPRASAD (చర్చ) 07:01, 26 ఫిబ్రవరి 2019 (UTC)