Jump to content

చామల కిరణ్ కుమార్ రెడ్డి

వికీపీడియా నుండి
చామల కిరణ్ కుమార్ రెడ్డి
చామల కిరణ్ కుమార్ రెడ్డి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
జూన్ 2024 నుండి ప్రస్తుతము
నియోజకవర్గం భువనగిరి
ముందు కోమటి రెడ్డి వెంకటరెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం 1974 అక్టోబర్ 24
బాలిశెట్టిగూడెం, శాలిగౌరారం మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు చామల వాసుదేవ రెడ్డి, అరుణ
జీవిత భాగస్వామి డింపుల్
సంతానం సాహితి కిరణ్, కీర్తి కిరణ్
నివాసం విల్లా నెం. 36, అపర్ణ షాంగ్రిల్లా, గచ్చిబౌలి, హైదరాబాద్
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు [1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

చామల కిరణ్ కుమార్ రెడ్డి యువజన కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2005 నుండి 2006 వరకు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, 2007 నుండి 2008 వరకు  రాహుల్ గాంధీ టీం అయిన డిస్కవరీ ఇండియా టాస్క్ ఫోర్స్ మెంబర్, ఆమ్ ఆద్మీకా సీపాహి నేషనల్ కోఆర్డినేటర్‌గా, 2008 నుండి 2009 వరకు జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా, మహారాష్ట్ర, గోవా, డెహ్రాడూన్, హవేలీ యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా, 2009 నుండి 2011 వరకు జాతీయ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్, పాండిచ్చేరి రాష్ట్రాల యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా, 2017 నుండి 2021 వరకు టీపీసీసీ అధికార ప్రతినిధిగా పని చేసి 2021లో  టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.

చామల కిరణ్ కుమార్ రెడ్డి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి  డాక్టర్‌ బూర నర్సయ్య గౌడ్‌పై 2,22,170 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా 18వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[4][5][6]

మూలాలు

[మార్చు]
  1. EENADU (28 March 2024). "భువనగిరి బరిలో చామల". Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
  2. Sakshi (28 March 2024). "భువనగిరి చామలకే." Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
  3. Andhrajyothy (28 March 2024). "భువనగిరి కాంగ్రెస్‌ అభ్యర్థిగా కిరణ్‌కుమార్‌రెడ్డి". Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
  4. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Bhongir". Archived from the original on 6 June 2024. Retrieved 6 June 2024.
  5. TV9 Telugu (6 June 2024). "ఆ నియోజకవర్గంలో తొలిసారి బరిలో నిలిస్తే చాలు.. గెలుపు పక్కా." Archived from the original on 6 June 2024. Retrieved 6 June 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Sakshi (25 October 2024). "కేంద్ర సంప్రదింపుల కమిటీల్లో ఎంపీలకు చోటు". Retrieved 25 October 2024.