చింతకుంట (ముద్దనూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చింతకుంట, వైఎస్‌ఆర్ జిల్లా, ముద్దనూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 516 380., ఎస్.టి.డి.కోడ్ = 08560.[1]

చింతకుంట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం ముద్దనూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,115
 - పురుషుల సంఖ్య 565
 - స్త్రీల సంఖ్య 550
 - గృహాల సంఖ్య 274
పిన్ కోడ్ 516380
ఎస్.టి.డి కోడ్ 08560

గ్రామ పంచాయతీ[మార్చు]

2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి మనబోటి లక్ష్మీదేవి, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,115 - పురుషుల సంఖ్య 565 - స్త్రీల సంఖ్య 550 - గృహాల సంఖ్య 274

గ్రామములోని విశేషాలు[మార్చు]

చింతకుంట గుహలు :- మండలకేంద్రానికి 8కి.మీ.దూరంలో కడప-తాడిపత్రి ప్రధాన రహదారిపై ఈ "చింతకుంట గుహలు" ఉన్నాయి. ఈ ప్రాంతం ఇన్నాళ్ళూ ఎవరికీ తెలియని ప్రాంతం. ఇక్కడ 25,000 ఏళ్ళనాటి ఆదిమానవుల ఆవాసాలు, వారు గీసిన రేఖాచిత్రాలూ ఉన్నాయి. ఈ గుహలు 2019లో వెలుగుచూసినవి. వీటి విశేషాలను 6వ తరగతి సాంఘికశాస్త్రం పుస్తకంలో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టడంతో వీటిగురించి జిల్లా ప్రజలకు తెలిసి, వీటికి విశేష ప్రాచుర్యం లభించి, పర్యాటకుల రాక మొదలైనది. సువిశాలమైన కొండప్రాంతంలో ఉండి, చరిత్రకు దర్పణంగా ఉన్న ఈ గుహలను చూసేందుకు, పాఠశాలల, కళాశాలల విద్యార్థులు, విజ్ఞాన యాత్రాస్థలంగా ఎంచుకుని, ఇక్కడకు వస్తున్నారు. కానీ ఈ గుహలను చేరుకోవడానికి సరైన రహదారులు లేవు, సరైన సూచికలు లేవు. మంచి రహదారులు నిర్మించి వసతులు కల్పించి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధిచేసినచో, ఇది ఒక పెద్ద పర్యాటక కేంద్రంగా మారి, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. [1]

మూలాలు[మార్చు]

[1] ఈనాడు కడప, డిసెంబరు-18,2013.11వ పేజీ. [2] ఈనాడు కడప/జమ్మలమడుగు; 2014, ఆగస్టు=1; 1వపేజీ.