చీకటి పరశురామనాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చీకటి పరశురామనాయుడు (1910 - ఆగష్టు 28, 1988) ప్రముఖ రాజకీయ నాయకుడు.

జననం[మార్చు]

ఇతడు విజయనగరం జిల్లాలోని వెంగాపురం గ్రామంలో 1910లో నారం నాయుడు, చిన్నమ నాయురాలకు జన్మించారు. బి.ఏ. పట్టా పొందిన తరువాత కొంతకాలం పార్వతీపురంలో న్యాయవాదిగా పనిచేశారు.

తన ప్రవృత్తికి సరిపడని కారణంగా న్యాయవాదిగా విరమణ చేసుకొని, ప్రజాసేవలో పాల్గొన్నారు. పార్వతీపురం సమితి ప్రెసిడెంటుగా 18 సంవత్సరాలు పనిచేసి రికార్డు సృష్టించారు. గంగాపురం సర్పంచ్ గా కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. కొంతకాలం స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. 1972లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పార్వతీపురం శాసనసభా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగానూ, 1978 ఎన్నికలలో జనతా పార్టీ అభ్యర్థిగానూ ఎన్నికైనారు. 1980-81 మధ్య కాంగ్రెసు ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పనిచేశారు.

తన సుదీర్ఘమైన ప్రజాసేవలో రైతు బాంధవుడుగా పేరుపొందారు. ప్రజాసేవతో పాటు స్వయంగా వ్యవసాయం అంటే చాలా ఇష్టం. మంచి ఉపన్యాసకుడు, క్రమశిక్షణకు, వృత్తియందు అంకితభావం కలవాడు, రాజనీతి గల ప్రముఖుడు.

మరణం[మార్చు]

పరశురామనాయుడు ఆగష్టు 28, 1988 పరమపదించారు.

మూలాలు[మార్చు]

  • 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.