చుక్కపల్లి భారతీరాణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గుంటూరువాసి. భర్త విజయవాడలో ప్రముఖ పాదరక్షల తయారీ వ్యాపారస్తుడు. రోడ్డు ప్రమాదంలో భర్త మరణించాక నిరాశలో కూరుకు పోకుండా తనను తాను ఓదార్చుకోవడానికి శరత్‌ సాహిత్యం చదివింది. మయూరి' చిత్రం పదేపదే చూసింది. అమెరికా వెళ్ళి కంప్యూటర్‌ కోర్సు చేసి లయోలా యూనివర్సిటీ ఆఫ్‌ షికాగోలో ఫస్టు ర్యాంకు సాధించారు. ప్రఖ్యాత కూపర్స్‌ అండ్‌ లిబ్రాన్‌ సంస్థ ఆమె సేవలు కోరుతూ ఎదురుచూసే స్థాయికి ఎదిగారు. అమెరికాలో ప్రసిద్ధ కెలాగ్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి గ్లోబల్‌ మార్కెటింగ్‌లో పట్టా పుచ్చుకున్నారు. కంప్యూటర్‌ పరిజ్ఞానం, ఆర్థిక వ్యవహారాల్లో ఆమె నైపుణ్యం వినియోగించుకోవాలని ప్రఖ్యాత కూపర్స్‌ అండ్‌ లిబ్రాన్‌ సంస్థ భావించింది. ఆమె కోసం కొన్ని నెలలు వేచి చూసి మరీ ప్రోగ్రామర్‌గా అవకాశం ఇచ్చింది. ఆర్థిక వ్యవహారాలకు ఉపకరించే టెస్టింగ్‌ టూల్స్‌ రూపొందించి పేరు గడించిన భారతి అంచెలంచెలుగా వివిధ ఉన్నతస్థాయిల్లో సేవలందించారు. తెల్లవారు మాత్రమే ఆధిక్యం కనబరిచే అమెరికన్‌ ఆర్థిక రంగంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రైజ్‌వాటర్‌ హౌజ్‌ కూపర్స్‌లో భాగస్వామిగా, డైరెక్టర్‌గా ఉన్నత పదవుల్లో పనిచేశారు. హైదరాబాద్‌ లో కన్సల్టెన్సీని ఆరంభించే యోచనలో ఉన్నారు. తండ్రి నుంచి వామపక్ష భావాలను ఒంటబట్టించుకుని... పట్టుదలతో కష్టాలను అధిగమించిన భారతి తన కూతురు శిల్పను న్యాయశాస్త్రం చదివిస్తున్నారు.


భావాలు

[మార్చు]
  • నిన్ను నువ్వు తీర్చిదిద్దుకునే దారిలో వెళితే ఒంటరితనం వేధించదు
  • చదువొక తపస్సు... యాగంలా చేస్తేనే పరిజ్ఞాన యోగం సిద్ధిస్తుంది.
  • భర్త మరణాన్ని తట్టుకోవడమే అన్నిటికన్నా పెద్ద పరీక్ష అటువంటిది ఆంగ్లం నేర్చుకుని, చదువులో రాణించలేనా
  • కష్టాల్లేని జీవితం పదును తేలదు

మూలాలు

[మార్చు]