చుక్కభట్ల సత్యనారాయణమూర్తి
Jump to navigation
Jump to search
చుక్కభట్ల సత్యనారాయణమూర్తి | |
---|---|
జననం | 1909 |
మరణం | ఆగష్టు 21, 1953 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రంగస్థల నటుడు, ప్రయోక్త, నాటక రచయిత, స్వాతంత్ర్యోద్యమ కార్యకర్త |
చుక్కభట్ల సత్యనారాయణమూర్తి (1909 - ఆగష్టు 21, 1953) ప్రముఖ రంగస్థల నటుడు, ప్రయోక్త, నాటక రచయిత, స్వాతంత్ర్యోద్యమ కార్యకర్త.[1]
జననం
[మార్చు]సత్యనారాయణమూర్తి 1909లో సుబ్బారావు, సీతమ్మ దంపతులకు జన్మించాడు.
రంగస్థల ప్రస్థానం
[మార్చు]1928-29 ప్రాంతంలో చర్లలో కొంతమంది మిత్రులతో కలిసి చెన్నకేశ్వర నాట్యమండలిని స్థాపించాడు. ఏలూరి హనుమంతరావు, గాలి లక్ష్మణస్వామి, బుయ్యవరపు తిరువెంగళయ్య, విశ్వన్మయాచారి, చింతలపూడి వెంకన్న, ముదపాక వెంకటరత్నం, చీమకుర్తి సుబ్బారావు, కామాడ జగ్గారావు, తోటపల్లి ఆదినారాయణ వంటి నటులకు శిక్షణ ఇచ్చాడు.
నటించినవి
[మార్చు]- చింతామణి
- వరవిక్రయం
- సత్యహరిశ్చంద్ర
- భక్తరామదాసు
- గయోపాఖ్యానం
- మధు సేవ
రచించినవి
[మార్చు]- ఝాన్సీలక్ష్మీబాయి (08.06.1931 లో ఈ నాటకాన్ని బ్రిటీష్ ప్రభుత్వం నిషేదించింది)
- వీరతానాజీ
- గొల్లభామ
మరణం
[మార్చు]ఈయన 1953, ఆగష్టు 21న మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.623.