Jump to content

చుట్టకాముడు

వికీపీడియా నుండి
చుట్టకాముడు తెలంగాణా ప్రజాపోరాట కాలంలో పోరాట జీవిత గాథలను ప్రతిబింబించే జానపద నృత్యం.

నాట్యరీతి

[మార్చు]
పెద్దలు బతుకమ్మ నాట్యరీతిలో నాట్యం చేయుట

పిల్లలు బొడ్డెమ్మ ఆడుతారు. పెద్దలు బతుకమ్మ ఆట ఆడుతారు. ఇందులో నృత్యం, పాట కలసి కట్టుగా ఉంటాయి. బొడ్డెమ్మ, బతుకమ్మ, చుట్ట కాముడు ఈ మూటి నృత్యగానాలు దాదాపు ఒకే లాగా వుంటాయని జయధీర్ తిరుమల రావు గారు ప్రజా సాహితి సంచికలో ఉదహరించారు. ఈ మూడు రూపాలూ, నాట్లు వేసే సమయం లోనూ కలుపు తీసే సమయం లోనూ, కోతల సమయంలోనూ, నూర్పిడి సమయం లోనూ ఏర్పడిన స్వరూపాలే. కలుపు తీసే సమయంలో పాడుకునే పాటనే స్త్రీలు విరామ సమయంలో బతుకమ్మ పాటగా పాడు కుంటారు. రాను రాను బతుకమ్మ పాటలో శారీరకమైన పని పోయి నృత్యం చోటు చేసుకుంది. కలుపు తీయడమనే చేతుల శ్రమ చప్పట్లు కొట్టడంగా మారింది. పని పాటల్లో శ్రామికి స్త్రీలు జీవితాన్ని పాడుకున్నా, పండుగల సందర్భంలో గౌరమ్మ మీదో, బొడ్డెమ్మ మీదో పాడు కోక తప్పదు. కానీ తెలంగాణా ప్రజాపోరాట కాలంలో పోరాట జీవిత కథలనే, బతకమ్మ పాటల్లోనూ, చుట్ట కాముడు నృత్యాల్లోనూ ప్రతిబింబించారు. 1️⃣ చుట్టకాముడు (Chuttakaamudu)

అర్ధం:

సాధారణంగా నృత్య / నాటక సందర్భంలో, పరిసరాన్ని, సమూహాన్ని, కృషితో చుట్టూ తిరిగి, క్రమంలో నిలిచే వ్యక్తి / పాత్ర అని అర్థం.

కొన్నిసార్లు “సర్కిల్ / రౌండ్ లో కదిలే వ్యక్తి” అని కూడా అర్థం.

ఉపయోగం:

కృష్ణనాట్యంలో, భక్తి నృత్యంలో సమూహం చుట్టకాముడు ద్వారా క్రీడాత్మక కదలికలు చూపిస్తారు.

ఫలితంగా నృత్యం లేదా కథానాయకుల చుట్టూ క్ర‌మ‌బ‌ద్ధ కదలికలు ఏర్పడతాయి.

ఉదాహరణ వాక్యం:

నాటకరంగంలో చుట్టకాముడు కథానాయకుడిని చుట్టూ తిరిగి నాట్యక్రమాన్ని అందించాడు.

2️⃣ నాట్యరీతీ (Natyareethi)

అర్ధం:

నాటక / నృత్య కళలో ప్రవేశించే శైలీ, సూత్రాలు, ఆచారాలు, నిబంధనలు

Essentially, ఇది కళాకారుని ప్రదర్శనలో పాటించే విధానం / పద్ధతి.

ఉపయోగం:

నాట్యకళా ప్రదర్శనలో కథ, భావం, అభినయం, సంగీతం, మాధుర్యం మేళవించే పద్ధతి.

శాస్త్రీయ నృత్యంలో (కూచిపూడి, భరతనాట్యం) “నాట్యరీతీ”ని క్రమంగా పాటిస్తూ అభినయ క్రమాన్ని చూపుతారు.

ఉదాహరణ వాక్యం:

ఈ నాటకంలో నటి నాట్యరీతీ ప్రకారం ప్రతి అంగీకారాన్ని అందంగా చూపించింది.

శక్తి వంతమైన కళారూపం

[మార్చు]
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన 'బతుకమ్మ' వేడుకలలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

తెలంగాణా పోరాట కాలంలో నల్లగొండ జిల్లాలో చుట్ట కాముడు చాల ప్రసిద్ధి పొందింది. నైజాం ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పిస్తూ కందూరి ఈశ్వర దత్తు లాంటి వారు కూడా చుట్ట కాముడు చాల శక్తి వంతమైన కళా రూపంగా పేర్కొన్నారు. స్త్రీలు పాల్కొనే చుట్ట కాముడు ఆటకి దగ్గరగా వున్న ధులా కళా రూపాన్ని పురుషులు రాత్రి పూట ప్రదర్శిస్తారు.

ఉయ్యాల పదం

[మార్చు]

పోరాట కాలంలో మల్లు స్వరాజ్యం వ్రాసిన వీరమట్టా రెడ్డి ఉయ్యాలో అనీ, ధీర ఆనంతా రెడ్డి ఉయ్యాలో అని చుట్టూ తిరుగుతూ చేసే నృత్యం ఎంతో ఉత్తేజాన్ని కలిగించేది. ఆ పోరాట కాలంలో పాదిన అనేక పాటల్లో, ఉయ్యాలోఅని, ఎన్నియాలో అనీ, చంద మామా అని వంతలు ఉపయోగించే వారు. ఉయ్యాలో అనడం వల్ల అది ఉయ్యాల పాట కాదు. వంత మాత్రమే. పోరాట కాలంలో ఎక్కువగా, అమర వీరుల మీదే ఈ పాత బాణీలతో పాడు కున్నారు. ఉదాహరణకు:

వీరామట్టా రెడ్డి ఉయ్యాలో..........
ధీర అనంతా రెడ్డి ఉయ్యాలో............

అంటూ సాగుతుంది.

మూలాలు

[మార్చు]

యితర లింకులు

[మార్చు]