చెన్నై - న్యూ జల్పైగురి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • చెన్నై — న్యూ జల్పైగురి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  • Chennai — New Jalpaiguri SF Express
సారాంశం
రైలు వర్గంసూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
స్థితిఆపరేటింగ్
స్థానికతపశ్చిమ బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్ & తమిళనాడు
తొలి సేవ29 జనవరి 2011
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ రైల్వే జోన్
మార్గం
మొదలుచెన్నై సెంట్రల్ (MAS)
ఆగే స్టేషనులు18
గమ్యంన్యూ జల్పైగురి (NJP)
ప్రయాణ దూరం2273 కి.మీ.
సగటు ప్రయాణ సమయం40 గం. 45 ని.లు
రైలు నడిచే విధంవీక్లీ
రైలు సంఖ్య(లు)22611/22612
సదుపాయాలు
శ్రేణులుఎసి 2 వ తరగతి (1), ఎసి 3 వ తరగతి (2), స్లీపర్ (10), జనరల్ (6)
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలుఉంది
ఆహార సదుపాయాలుఉంది
బ్యాగేజీ సదుపాయాలుఉంది
సాంకేతికత
పట్టాల గేజ్బ్రాడ్ గేజ్
వేగంసరాసరి వేగం - 55 కి.మీ./గం.
మార్గపటం

చెన్నై - న్యూ జల్పైగురి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది చెన్నై రైల్వే స్టేషను, న్యూ జల్పైగురి రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1]

జోను, డివిజను[మార్చు]

ఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని దక్షిణ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. రైలు నంబరు: 22611. ఈ రైలు వారానికి ఒక రోజు బుధవారం నడుస్తుంది.

భోగీలు అమరిక[మార్చు]

రైలు నంబరు: 22611 : చెన్నై - న్యూ జల్పైగురి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఎసి 2 వ తరగతి (1), ఎసి 3 వ తరగతి (2), స్లీపర్ (10), జనరల్ (6), లగేజి కం రాక్ కోచ్‌లు (2) గార్డు క్యాబిన్ కూర్చొనే విధంగా బోగీలు అమరిక కలిగి ఉంది. ఈ రైలునకు మొత్తం 21 బోగీలు ఉంటాయి.

రైలు డిమాండ్[మార్చు]

ఈ రైలు వారంలో ఒకరోజు ఉన్నప్పటికీ ఈ మార్గంలోని ఒక ప్రముఖ రైలు. టికెట్ల కోసం డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఈ రైలులో ప్రయాణం చేయు టకు ఒక నిర్ధారిత బెర్త్ పొందేందుకు ఒక టికెట్ అనేక రోజుల ముందుగా బుక్ చేసుకోవాలి.[2]

చెన్నై - న్యూ జల్పైగురి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారత దేశంలోని నగరాలు అయిన చెన్నై, సిలిగురి కలిపే ఒక సూపర్‌ఫాస్ట్ రైలుగా ఉంది. ఈ రైలు ప్రయాణం చెన్నై సెంట్రల్ నుండి ప్రారంభమై న్యూ జల్పైగురి వద్ద ముగుస్తుంది. ఇది చెన్నై నుండి న్యూ జల్పైగురి వరకు ప్రత్యక్ష రైలు సేవలు సరాసరిగా నడిచే మొదటి రైలు. అంతేకాక తూర్పు, దక్షిణ భారతదేశమును కలుపుతూ, భారతదేశం యొక్క భూభాగాలయిన పశ్చిమ బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్ & తమిళనాడు రాష్ట్రాలకు సేవలందిస్తున్నది. ఇది జార్ఖండ్ రాష్ట్రం ద్వారా ప్రయాణించిననూ దీనికి విరామము కలిగిన రైల్వే స్టేషను మాత్రము లేదు.

టైం టేబుల్[మార్చు]

  • 22611 చెన్నై - న్యూ జల్పైగురి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (బుధవారం).[3][4]
క్రమ సంఖ్య స్టేషను & స్టేషను కోడ్ రోజు రాక (చేరుకొను సమయం) పోక (బయలుదేరు సమయం) దూరం (కి.మీ.)
1 చెన్నై సెంట్రల్ (ఎంఎఎస్) 1 11:00 0
2 నెల్లూరు (NLR) 1 13:40 13:41 175
3 ఒంగోలు (OGL) 1 15:04 15:05 291
4 విజయవాడ జంక్షన్ (BZA) 1 17:40 17:55 430
5 ఏలూరు (EE) 1 18:41 18:42 489
6 అనకపల్లె (AKP) 1 22:39 22:40 746
7 దువ్వాడ (DVD) 1 23:40 23:42 762
8 విశాఖపట్నం (VSKP) 2 0:10 0:30 780
9 విజయనగరంJN (VZM) 2 1:28 1:30 841
10 బ్రహ్మపూర్ (BAM) 2 4:35 4:37 1057
11 ఖుర్దా రోడ్ జంక్షన్ (KUR) 2 6:55 7:10 1203
12 భువనేశ్వర్ (BBS) 2 7:30 7:35 1222
13 హిజిల్లి (HIJ) 2 12:07 12:12 1540
14 బంకుర (BQA) 2 14:06 14:08 1665
15 అద్రా జంక్షన్ (ADRA) 2 15:00 15:10 1723
16 అసన్సోల్ జంక్షన్ (ASN) 2 16:15 16:25 1765
17 దుర్గాపూర్ (DGR) 2 17:25 17:45 1812
18 రాంపూర్హట్ (RPH) 2 20:26 20:31 1935
19 మాల్డా టౌన్ (MLDT) 2 23:20 23:35 2057
20 బర్సోయి జంక్షన్ (BOE) 3 1:00 1:02 2145
21 కిషన్గంజ్ (KNE) 3 1:51 1:53 2202
22 న్యూ జల్పైగురి (NJP) 3 5:05 2316

కోచ్ కూర్పు[మార్చు]

రైలు నంబరు 22611: చెన్నై - న్యూ జల్పైగురి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కోచ్ కూర్పు క్రింద విధముగా ఉంటుంది:

లోకో 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 0
ఎల్ ఎస్‌ఎల్‌ఆర్ జిఎస్ జిఎస్ జిఎస్ ఎస్10 ఎస్9 ఎస్8 ఎస్7 ఎస్‌6 ఎస్‌5 ఎస్‌4 ఎస్‌3 ఎస్‌2 ఎస్‌1 బి2 బి1 ఎ1 జిఎస్ జిఎస్ జిఎస్ ఎస్‌ఎల్‌ఆర్ డిజిఆర్

మూలాలు[మార్చు]

  1. "Welcome to Indian Railway Passenger Reservation Enquiry".
  2. "New Jalpaiguri-Chennai train from today". The Hindu. Archived from the original on 2011-02-03. Retrieved 2011-01-29.
  3. "Chennai-NewJalpaiguri SF Express". India Rail Info. Retrieved 2014-02-04.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-14. Retrieved 2016-04-24.

బయటి లింకులు[మార్చు]