చేకూరి కాశయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చేకూరి కాశయ్య
చేకూరి కాశయ్య


మాజీ ఎమ్మెల్యే
నియోజకవర్గం కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం

ఖమ్మం జిల్లా పరిషత్‌ చైర్మన్‌
పదవీ కాలం
1987 – 1992

వ్యక్తిగత వివరాలు

జననం 1936
తక్కెల్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ, భారతదేశం
మరణం 25 మే, 2021
హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ
నివాసం హైదరాబాద్
పూర్వ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ

చేకూరి కాశయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. అతను కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

చేకూరి కాశయ్య తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం మండలం, తక్కెల్లపాడు గ్రామంలో 1936లో చేకూరి నర్సయ్య, భాగ్యమ్మ దంపతులకు జన్మించాడు. అతను ప్రాథమిక విద్యాభ్యాసాన్ని స్వగ్రామంలో పూర్తిచేసి, 1951-1952లో మధిర హైస్కూల్ లో హెచ్‌ఎస్‌సీ పూర్తి చేశాడు. అతను 1956లో హైదరాబాదులోని నిజాం కళాశాలలో బీఏ పూర్తి చేశాడు.[1]

వృత్తి జీవితం[మార్చు]

కాశయ్య 1958 నుండి 60 వరకు కొత్తగూడెంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1960లో కొత్తగూడెం పంచాయతీ సమితిలో విస్తరణాధికారిగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ 1964 మార్చిలో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చాడు.

రాజకీయ జీవితం[మార్చు]

చేకూరి కాశయ్య 1964లో, 1970లో కొత్తగూడెం సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అతను 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఖమ్మం జిల్లాలో నాయకత్వం వహించాడు. కాశయ్య 1971 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థిగా ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి పోటీచేసి ఓడిపోయాడు. అతను 1972లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. 1978లో జనతా పార్టీ తరపున పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగినప్పుడు ఎన్టీ రామారావు పిలుపు మేరకు టీడీపీలో చేరాడు. కాశయ్య 1987లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్‌కు నిర్వహించిన ప్రత్యక్ష ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి జలగం ప్రసాదరావు పై గెలుపొందాడు.[2] అతనును 1993లో తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. పీవీ నరసింహారావు సమక్షంలో 1994లో కాంగ్రెస్‌లో చేరి సుజాత్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా పోటీచేసి ఓటమి పాలయ్యాడు. సుజాత్‌నగర్‌ నుండి ఓడిపోయాక అతను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నాడు, తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[3]

మరణం[మార్చు]

చేకూరి కాశయ్య అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2021, మే 25న మృతి చెందాడు.[4][5][6]

మూలాలు[మార్చు]

  1. Eenadu (26 May 2021). "మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య కన్నుమూత". EENADU. Archived from the original on 26 మే 2021. Retrieved 26 May 2021.
  2. Andhrajyothy (26 May 2021). "మాజి ఎమ్మెల్యే చేకూరి కాశయ్య కన్నుమూత". www.andhrajyothy.com. Archived from the original on 26 మే 2021. Retrieved 26 May 2021.
  3. Andhrajyothy, హోం > ఎడిటోరియల్ > వ్యాసాలు (27 May 2021). "అజాత శత్రువు". www.andhrajyothy.com. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
  4. Sakshi (26 May 2021). "మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య ఇకలేరు." Sakshi. Archived from the original on 26 మే 2021. Retrieved 26 May 2021.
  5. Namasthe Telangana (25 May 2021). "చేకూరి కాశయ్య ఇకలేరు". Namasthe Telangana. Archived from the original on 26 మే 2021. Retrieved 26 May 2021.
  6. The New Indian Express (26 May 2021). "Former Kothagudem MLA Chekuri Kasaiah passes away". The New Indian Express. Archived from the original on 26 మే 2021. Retrieved 26 May 2021.