Jump to content

చేనేత మిత్ర పథకం

వికీపీడియా నుండి
చేనేత మిత్ర పథకం
ప్రాంతంహైదరాబాదు, తెలంగాణ
ప్రధాన వ్యక్తులుతెలంగాణలోని నేత కార్మికులు
స్థాపన2017, నవంబరు 18
నిర్వాహకులుముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు,
తెలంగాణ ప్రభుత్వం

చేనేత మిత్ర పథకం (ఇన్‌పుట్ సబ్సిడీ లింక్డ్ వేతన పరిహారం పథకం) అనేది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. ఈ పథకం ద్వారా తెలంగాణలోని సహకార, సహకారేతర ప్రాథమిక చేనేత సహకార సంఘాలలోని చేనేత కార్మికులకు, చేనేత పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాలను ఏర్పరుచుకునే చేనేత కార్మికులందరికీ 40 శాతం నూలు సబ్సిడీ అందించబడుతోంది.[1] అయితే పథకంలో మార్పులు తీసుకొచ్చిన మగ్గం మీద పనిచేసే ప్రతి కార్మికునికి నెలనెలా రూ.3వేలు వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు 2023, ఆగస్టు 7న ప్రభుత్వం ప్రకటించింది.[2]

రూపకల్పన

[మార్చు]

చేనేత కార్మికులు చీరల, ఇతర చేనేత ఉత్పత్తులను తయారుచేయడంకోసం కాటన్‌హాంక్ నూలు, దేశీయ పట్టు, ఉన్ని, రంగులు, రసాయనాలను కొనుగోలు చేయవలసి ఉంటుంది. అలాంటి సందర్భంలో చేనేత కార్మికులకు ఆర్థికంగా సహకారం అందించడంకోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.[3]

ప్రారంభం

[మార్చు]

ఈ పథకాన్ని 2017, నవంబరు 18న రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వరంగల్లులో ప్రారంభించాడు.

పథకం అమలు

[మార్చు]

జియో ట్యాగ్ చేయబడిన చేనేత కార్మికులు, అనుబంధ కార్మికులు ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న తరువాత చేనేత-జౌళి శాఖ ఆయా రిజిస్ట్రేషన్‌లను ధృవీకరించి, అర్హులైన చేనేత సంఘాలు/చేనేత కార్మికుల రిజిస్ట్రేషన్‌లకు ఆమోదం ఇస్తారు. ఆమోదం పొందిన తరువాత నేషనల్ హ్యాండ్ లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంప్యానెల్డ్ సంస్థ నుండి నూలును కొనుగోలు చేసి, ఉత్పత్తి ప్రణాళికల వివరాలను సమర్పించడంతోపాటు ఆన్‌లైన్ పోర్టల్‌లో నూలు బిల్లులను అప్‌లోడ్ చేయాలి. వాటిని పరిశీలించి 45 రోజుల తరువాత, 40% సబ్సిడికి సిఫార్సు చేయబడుతుంది. ఆ సబ్సిడీ మొత్తం నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు అంటే మాస్టర్ వీవర్లు, జియో-ట్యాగ్ చేయబడిన మెయిన్ వీవర్లు, అనుబంధ కార్మికుల బ్యాంకు ఖాతాలకు నేరుగా అందించబడుతుంది.[4]

పథకంలో మార్పు

[మార్చు]

చేనేత మిత్ర పథకం కింద కార్మికులకు నూలు, రంగులు, రసాయనాలకు 50 శాతం మేర ఇస్తున్న సబ్సిడీ సకాలంలో వారి ఖాతాల్లో జమకావడం లేదన్న విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా గతంలో కార్మికుడికి ప్రభుత్వానికి మధ్య దళారుల ప్రమేయం ఉండేది, ఇచ్చే పైసలు సక్రమంగా కార్మికుడికి చేరడం లేదన్నది ప్రభుత్వ దృష్టికి చేరింది. నేపథ్యంలో మధ్య దళారీ వ్యవస్థకు చెక్‌పెడుతూ ఇకపై మగ్గం మీద పనిచేసే ప్రతి కార్మికునికి నెలనెలా రూ.3వేలు వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు 2023, ఆగస్టు 7న మన్నెగూడలోని బీఎంఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకల సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ప్రకటించాడు.[5][6]

2023 సెప్టెంబరు 1వ తేదీన చేనేత మిత్రకు సంబంధించిన డబ్బులు రాష్ట్రవ్యాప్తంగా జియో ట్యాగింగ్‌ చేసిన 32 వేలకుపైగా కార్మికుల ఖాతాల్లో జమ చేయబడ్డాయి.[7]

నిధులు

[మార్చు]

2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం రాష్ట్రం బడ్జెట్‌లో రూ.100 కోట్ల చొప్పున కేటాయించబడింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Telugu, TV9 (2021-08-07). "Chenetha Bandhu: తెలంగాణ చేనేత కార్మికులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైతుబంధు తరహా చేనేతబంధు.. కసరత్తు మొదలు పెట్టిన సర్కార్!". TV9 Telugu. Archived from the original on 2021-08-07. Retrieved 2023-06-07.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Today, Telangana (2023-09-01). "Chenetha scheme: Rs 3,000 per loom to be deposited into accounts of eligible weavers in Telangana". Telangana Today. Archived from the original on 2023-09-03. Retrieved 2023-09-03.
  3. "Telangana to roll out Nethanna Bima insurance scheme for weavers". The Siasat Daily. 2022-08-01. Archived from the original on 2022-08-01. Retrieved 2023-06-07.
  4. Desk 8, Disha Web (2023-03-13). "చేనేత మిత్ర యాప్ ద్వారా నేరుగా చేనేత కార్మికుడికి బహుళలబ్ది". www.dishadaily.com. Archived from the original on 2023-06-07. Retrieved 2023-06-07.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  5. telugu, NT News (2023-08-08). "Minister KTR | చేనేత వద్దు.. అన్నీ రద్దు అనేలా వ్యవహరిస్తున్న కేంద్రం: మంత్రి కేటీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-08-08. Retrieved 2023-08-08.
  6. "National Handloom Day 2023 : నేతన్నలపై వరాల జల్లు.. ఆరోగ్యకార్డుతో పాటు ప్రతి కుటుంబానికి ఏటా రూ.25 వేలు". ETV Bharat News. 2023-08-07. Archived from the original on 2023-08-07. Retrieved 2023-08-07.
  7. telugu, NT News (2023-09-03). "నేతన్నకు మిత్ర". www.ntnews.com. Archived from the original on 2023-09-03. Retrieved 2023-09-03.