ఛత్రపతి (2023 హిందీ సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఛత్రపతి
దర్శకత్వంవి. వి. వినాయక్
స్క్రీన్ ప్లేఏ. మహాదేవ్
మాటలు
  • మయూరి పూరి
కథకె. వి. విజయేంద్ర ప్రసాద్
దీనిపై ఆధారితంఛత్రపతి 
by ఎస్. ఎస్. రాజమౌళి
నిర్మాత
  • జయంతిలాల్ గదా
  • ధవల్ గదా
  • అక్షయ్ గదా
తారాగణం
ఛాయాగ్రహణంనిజార్ షఫీ
కూర్పునిరంజన్ దేవరమనే
సంగీతంబ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ :
రవి బస్రూర్
పాటలు:
తనిష్క్ బాగ్చి
నిర్మాణ
సంస్థ
పెన్ పెన్ స్టూడియోస్‌
విడుదల తేదీ
2023 మే 12 (2023-05-12)
సినిమా నిడివి
123 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్60 కోట్ల[2]

ఛత్రపతి 2023లో విడుదలైన హిందీ సినిమా. 2005లో తెలుగులో విడుదలైన ఛత్రపతి సినిమాను పెన్ పెన్ స్టూడియోస్‌ బ్యానర్‌పై జయంతిలాల్ గదా, ధవల్ గదా, అక్షయ్ గదా నిర్మించిన ఈ సినిమాకు వి. వి. వినాయక్ దర్శకత్వం వహించాడు. బెల్లంకొండ శ్రీనివాస్, నుస్రత్ భరూచా, కరణ్ సింగ్ ఛబ్రా, శరద్ కేల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 2న విడుదల చేసి[3], సినిమాను మే 12న విడుదల చేశారు.

నటీనటులు[మార్చు]

కథ[మార్చు]

శివ (బెల్లంకొండ శ్రీనివాస్) తన తల్లి (భాగ్యశ్రీ), తమ్ముడితో (కరణ్ సింగ్ ఛబ్రా) కలిసి పాకిస్తాన్‌లో ఉంటాడు. కానీ అక్కడ జరిగిన గొడవల కారణంగా చిన్నతనంలో పాకిస్తాన్ నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితిలో అప్పుడు ఏర్పడ్డ గందరగోళంలో తల్లి, తమ్ముడు తప్పిపోగా శివ తప్పించుకొని పడవలో గుజరాత్ తీరప్రాంతానికి చేరుకుంటాడు. శివతో పాటు ఉన్న శరణార్థులు అందరినీ గుజరాత్‌లోని లోకల్ రౌడీ భైరవ్ (ఫ్రెడ్డీ దారూవాలా) బానిసల్లా చూస్తూ ఉంటాడు. ఒకానొక సమయంలో జరిగిన గొడవలో భైరవ్‌ని శివ చంపేసి ఛత్రపతిగా మారతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? భైరవ్ అన్న భవాని (శరద్ ఖేల్కర్) ఏం చేశాడు? శివ తన తల్లిని, తమ్ముడిని ఎలా కలుసుకున్నాడు అనేదే మిగతా సినిమా కథ.[4]

పాటలు[మార్చు]

సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."బరేలీ కే బజార్"మయూర్ పూరితనిష్క్ బాగ్చిసునిధి చౌహాన్ , దేవ్ నేగి3:24
2."విండో టేలీ"షబ్బీర్ అహ్మద్తనిష్క్ బాగ్చిదేవ్ నేగి , జ్యోతికా టాంగ్రీ2:54
3."గేమీ గేమీ"మయూర్ పూరితనిష్క్ బాగ్చిఅర్మాన్ మాలిక్, జహ్రా ఎస్ ఖాన్2:58
4."శుక్రియా"మయూర్ పూరితనిష్క్ బాగ్చియాష్ కింగ్ , పాలక్ ముచ్చల్3:13
మొత్తం నిడివి:12:29

మూలాలు[మార్చు]

  1. Namaste Telangana (11 May 2023). "బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి రన్‌ టైం ఎంతో తెలుసా..?". Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
  2. Andhrajyothy (9 May 2023). "60 కోట్ల సినిమా నా కొడుకుతో తీయటం తండ్రిగా గర్వపడుతున్నా: బెల్లంకొండ". Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
  3. 10TV Telugu (2 May 2023). "హిందీ ఛత్రపతి ట్రైలర్.. మాస్ ప్రేక్షకులకు బెల్లంకొండ శ్రీనివాస్ సాలిడ్ ఫీస్ట్..!" (in Telugu). Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. V6 Velugu (12 May 2023). "ఛత్రపతిగా బెల్లం బాబు ఈమేరకు మెప్పించాడు?". Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు[మార్చు]