ఛాయ (సినిమా)
ఛాయ (1979 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | హనుమాన్ ప్రసాద్ |
---|---|
తారాగణం | నూతన్ ప్రసాద్, రూప |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | వెంకటకృష్ణ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఛాయ 1979, జూన్ 9వ తేదీన విడుదలైన తెలుగు సినిమా.వెంకట కృష్ణా ఫిలింస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి హనుమాన్ ప్రసాద్ దర్శకుడు. ఈ చిత్రంలో సత్యేంద్రకుమార్, రూప, శైలజ,మంజు భార్గవి, నూతన్ ప్రసాద్ ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి సంగీతం చేళ్ళపిళ్ళ సత్యం సమకూర్చారు.
కథ
[మార్చు]చంద్రం పట్టభద్రుడైనా ఎక్కడా ఉద్యోగం దొరకక రిక్షా తొక్కుతూ జీవిస్తుంటాడు. ఒక రోజున రవి అనే విద్యార్థి తారసపడి చంద్రం సంగతి తెలుసుకుని జాలిపడి, ఒక ఫ్యాన్సీ షాపులో ఉద్యోగం ఇప్పిస్తాడు. అప్పటి నుండి రవి చంద్రానికి గురువు, యిష్టదైవం. ఇద్దరూ ఒకే గదిలో వుంటారు. ఒక మూగపిల్ల వారికి సహాయపడుతూ వుంటుంది. ఆ మూగపిల్లకి చంద్రం అంటే ప్రాణం. రవి తనతో పాటు కాలేజీలో ఒథెల్లో నాటకంలో నటించిన ఛాయను ప్రేమిస్తాడు. ఛాయ కూడా అతడిని ప్రేమిస్తుంది. ఛాయను లొంగదీసుకోవాలని ప్రయత్నించి విఫలుడైన ప్రసాద్ ఛాయ గురించి లేనిపోని అభాండాలు వేస్తాడు. ఇది విన ఛాయ తండ్రి మండిపడతాడు. రవిని తీసుకుని రమ్మంటాడు. రవి ఇంట్లో లేకపోయే సరికి తానే రవిగా వచ్చి అప్పటికి గండం గడిచేటట్లు చేస్తానని చంద్రం వస్తాడు. అయితే ఛాయ ఇంట్లో చేరిన వారందరి బలవంతం మీద చంద్రం ఛాయ మెడలో పసుపుతాడు కట్టవలసి వస్తుంది. మంగళసూత్రం లేదా పసుపుతాడుకు హైందవ సమాజంలో ఎంతటి విలువ ఉన్నదో, దాని మూలంగా కొందరి జీవితాలు ఎలా పరిణమిస్తాయో ఈ సినిమాలో తెలియజేస్తుంది[1].
నటీనటులు
[మార్చు]- సత్యేంద్రకుమార్ - రవి
- నూతన్ ప్రసాద్ - చంద్రం
- శివాజీ
- రూప - ఛాయ
- శైలజ - మూగపిల్ల
- అన్నపూర్ణ
- పి.ఎల్.నారాయణ - ఛాయ తండ్రి
సాంకేతికవర్గం
[మార్చు]- రచన: సత్యనారాయణరాజు, పరుచూరి వెంకటేశ్వరరావు
- ఛాయాగ్రహణం: లక్ష్మణ్ గోరే
- కళ: చంద్ర
- సంగీతం: సత్యం
- గీతాలు: సి.నా.రె., వీటూరి
- దర్శకుడు: హనుమాన్ ప్రసాద్
- నిర్మాతలు: పి.వి.అప్పారావు, పి.వెంకటేశ్వరరావు, పాటిబండ్ల స్వరాజ్యలక్ష్మి
పాటల జాబితా
[మార్చు]1.ఎంత వలపో సాగరంపై గోదారికి , రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కోరస్, పి సుశీల
2.ఎంత వలపో సాగరంపై గొదారికి, రచన: సి నారాయణ రెడ్డి, గానం.పి . సుశీల కోరస్
3.ప్రేమంటేనే భ్రమ పెళ్లంటేనే కథ , రచన: వీటూరి, గానం.ఎస్ జానకి
4.బుజ బుజ రేకుల బుల్లెమ్మా నీకు పెళ్లండి, రచన: వీటూరి , గానం.విజయలక్ష్మి శర్మ, రమణ
5.శకుంతల...నఖమైతిని చిగురాకు , రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
[మార్చు]- ↑ వి.ఆర్. (6 June 1979). "చిత్రసమీక్ష - ఛాయ". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66, సంచిక 65. Retrieved 20 December 2017.[permanent dead link]
. 2. ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.