చంద్ర (కళాకారుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మైదం చంద్రశేఖర్
జననంఎం.చంద్రశేఖర్
1946, ఆగస్టు 25
పెద్దముప్పారం, నర్సింహులపేట మండలం, వరంగల్ జిల్లా
మరణం2021, ఏప్రిల్ 28[1]
ఇతర పేర్లుచంద్ర, బాల
వృత్తిచిత్రకారుడు, రచయిత, కళాదర్శకుడు, కార్టూనిస్ట్
ప్రసిద్ధిచిత్రకారుడు
మతంహిందూ
భార్య / భర్తవిజయ భార్గవి

మైదం చంద్రశేఖర్ (1946, ఆగస్టు 25 - 2021, ఏప్రిల్ 28) తెలంగాణకు చెందిన చిత్రకారుడు, శిల్పి, కార్టూనిస్టు. చంద్ర కుంచె పేరుతో ప్రఖ్యాతి గాంచాడు.[2]

జీవితవిశేషాలు

[మార్చు]

చంద్ర 1946, ఆగష్టు 25మహబూబాబాద్ జిల్లా జిల్లా, దంతాలపల్లి మండలం, పెద్దముప్పారం గ్రామంలో సోమలక్ష్మి, రంగయ్య దంపతులకు జన్మించాడు[3]. ఇతను 1955లో హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ స్కూలులో మెట్రిక్ వరకు చదివాడు. సైఫాబాద్ సైన్స్ కళాశాలలో పి.యు.సి చదివాడు. ఇతడు ఫైన్ ఆర్ట్స్‌లో పట్టభద్రుడు. డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఆర్టిస్ట్ కమ్‌ డిజైనర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశాడు. ఇతను కొన్ని వేల కథలకి చిత్రాలు వేశాడు. ఎన్నో పుస్తకాలకు ముఖచిత్రాలు గీశాడు. వేలకొద్దీ కార్టూనులు గీశాడు. చిత్రకళ మీద వ్యాసాలు, సమీక్షలు, కవితలు, 125కు పైగా కథలు వివిధ పత్రికలలో ప్రచురించాడు.

ఇతని మొదటి కార్టూను 1959లో ఆంధ్రపత్రికలో, మొదటి కథ 1961లో ఆంధ్రప్రభలో అచ్చయ్యాయి. ఇతడు జ్యోతి, యువ మాసపత్రికలలో ఆర్టిస్టుగా పనిచేశాడు[4]. స్వాతి మాసపత్రిక, మయూరి వారపత్రిక, పుస్తక ప్రపంచం మాసపత్రికలలో సంపాదక వర్గంలో పనిచేశాడు. 1970 నుండి 1976 వరకు విప్లవ రచయితల సంఘంలో సభ్యుడుగా ఉన్నాడు. విరసం కళాకారుడిగా ఎమర్జెన్సీ సమయంలో జైలుశిక్షను అనుభవించాడు.20 సినిమాలకు, 6 డాక్యుమెంటరీ చిత్రాలకు కళాదర్శకుడి గా పనిచేశాడు. 2 డాక్యుమెంటరీ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇంద్రధనుస్సు, వెన్నెలవేట మొదలైన టి.వి.సీరియల్స్‌కు దర్శకత్వం వహించాడు.[5]

పురస్కారాలు, సన్మానాలు

[మార్చు]

మరణం

[మార్చు]

చంద్రశేఖర్ తన 74 ఏళ్ళ వయసులో 2021, ఏప్రిల్ 28కోవిడ్ 19 వ్యాధి కారణంగా మరణించాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "చిత్రకారుడు చంద్ర మృతి... సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్". BBC News తెలుగు. Retrieved 2021-04-29.
  2. 2.0 2.1 Service, Express News (2021-04-30). "Noted illustrator Chandra dies at 74". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-02-23.
  3. ఆంధ్రకళాదర్శిని - కళాసాగర్ - పేజీ31
  4. కథాచిత్రకారుడు చంద్ర - హరినారాయణ్ - స్రవంతి మాసపత్రిక - డిసెంబరు 1968 - పేజీలు 43-53
  5. "చంద్ర గీసిన ఆడపిల్ల ఒయ్యారం, ఆయన అక్షరం నయగారం: అభిప్రాయం". BBC News తెలుగు. Retrieved 2021-04-29.
  6. చిత్రకారుడు చంద్రకు టాంటెక్స్ సత్కారం

బయటి లింకులు

[మార్చు]