జగదాంబ దేవి జాతర - పరిమండల్ తాండ
జగదాంబ దేవి జాతర పరిమండల్ తాండ | |
---|---|
భౌగోళికాంశాలు : | 19°06′N 78°21′E / 19.10°N 78.35°E |
పేరు | |
ఇతర పేర్లు: | శ్రీ జగదాంబ దేవి ఆలయం |
ప్రధాన పేరు : | మాతా జగదాంబ దేవి పరిమండల్ నిర్మల్ జిల్లా |
దేవనాగరి : | माता जगदांबा देवी देवस्थान परिमंडल ,मामडा तहसील निर्मल जिला, तेलंगाना। |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | నిర్మల్ జిల్లా |
ప్రదేశం: | మామడ ,మండలం , పరిమండల్ తాండ |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | సంత్ సేవాలాల్ మహరాజ్ |
ప్రధాన దేవత: | జగదాంబ దేవి |
ముఖ్య_ఉత్సవాలు: | దసరా, శ్రీరామనవమి |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | దక్షీణ భారత దేశ హిందూ దేవాలయం |
దేవాలయాలు మొత్తం సంఖ్య: | 01 |
జగదాంబ దేవి జాతర తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా,మామడ మండలంలోని పరిమండల్ తాండలో కొలువైన లంబాడీ గిరిజన ఆరాధ్య దేవత జగదాంబ దేవి పేరిట మాఘమాసంలో మూడు రోజుల పాటు జాతర ఘనంగా నిర్వహిస్తుంటారు[1].
స్థల పురాణం
[మార్చు]నిర్మల్ జిల్లా మామడ మండలానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాతా జగదాంబ దేవి ఆలయం పురాతన హిందూ దేవాలయం. పూర్వం ఈ పరిమండల్ తాండకు చెందిన పెద్ద మనిషి రూప్లానాయక్ హటాత్తుగా మరణించాడట. మృతుని సోదరి కేస్లీ బాయి సోదరుడు మరణం పట్ల ఆందోళనలు చెంది భోరున విలపించి ఒకే సారి స్పృహ తప్పి పడిపోయిందిట.అదే సమయంలో ఆమె కళ్ళ ముందు మెరుపులా ఊహించని అద్భుత దృశ్యం చోటుచేసుకుందట. ఒకే సారి జగదాంబ దేవి ప్రత్యేక్షమై నేను మీ సోదరుని జీవం పోస్తాను. కానీ నేను చెప్పిన చోట వెళ్లి ఒక గుడి కట్టించి అందులో నన్ను ప్రతిష్టించి పూజలు చేయడం ప్రారంభించండి అని చెప్పి మాయమై పోయిందట.కళ్ళు తెరిచి చూసే సరికి సోదరుడు రుప్లా తన కళ్లు ముందు నిలబడి ఉండటంను చూసి తనకు జరిగిన విషయాన్ని తాండా వాసులకు చెప్పిందట. అప్పటి నుండి రూప్లా నాయక్ జగదాంబ భక్తుడుగా మారి అమ్మా వారి సేవలో నిమగ్నమయి దేవత యొక్క చిన్న గుడిని కట్టించాడనీ చెబుతారు.
బోగ్ భండార్ పూజ
[మార్చు]ఓ వైపు ఆధ్యాత్మికతా , మరోవైపు ప్రకృతి రమణీయతా కనిపించే ఈ ఆలయంలో జగదాంబ దేవిని దర్శించుకుంటే దేవతలు కరుణించి వరాలను కురిపిస్తుందనీ అంటారు. ఆలయానికి వచ్చే భక్తులు ముందుగా సమీపంలో ఉన్న నీళ్ళ ట్యాంక్ వద్ద కాళ్ళు చేతులు కడుక్కుని ఆ తర్వాత ఆలయానికి చేరుకుంటారు.శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ తో పాటు కొలువైన అమ్మవారు ఇక్కడ ప్రత్యేక పూజలు, అమ్మవారికి అభిషేకం, విశేష అలంకరణ , పూజ, హారతి మాఘశుద్ధ పంచమిన అమ్మెరు అందుకోవడం విశేషం.శ్రీ రామనవమి, మాఘశుద్ధ పంచమిన, దసరా సమయంలో నిర్వహించే మహాభోగ్ భండార్ కార్యక్రమాలలో పాల్గొనేందుకు భక్తులు సదురు ప్రాంతం నుంచి ఆలయానికి చేరుకుంటారు.
విశేషం
[మార్చు]అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వ్యాపార, ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది. ఐశ్వర్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
జాతర
[మార్చు]పరిమండల్ తాండలో కొలువుదీరిన మాతా జగదాంబా ఆలయంలో వసంత పంచమి జాతరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.ఈ జాతరా ప్రతి సంవత్సరం మాఘమాసంలో మూడు రోజుల పాటు జరుగుతుంది.ఈ జాతర జగదాంబ దేవి ఆలయం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.ఈ జాతరకు నిర్మల్ జిల్లా నుంచే కాకుండా ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ ,నిజామాబాద్ జిల్లా నుంచి వేలకొలది భక్తులు తరలి వస్తారు. జాతరలో భక్తులు,వారి కుటుంబీకులతో కోరిన కోర్కెలు నెరవేర్చిన తల్లి జగదాంబ దేవికి జంతువులు బలి ఇచ్చి మొక్కలు చెల్లించుకుంటారు. జాతరలో తినుబండారాలు, చిన్న పిల్లల ఆటవస్తువులు, బంజారా ప్రజల వస్త్రాలు, ఆభరణాలు, వారి దేవి దేవతల చిత్ర పటాలు, సరసమైన ధరలకు లభిస్తుంది.లంబాడీ గిరిజనులే కాకుండా గిరిజనేతరులు కూడా ఈ జాతరకు అధిక సంఖ్యలో హాజరవుతారు.
ఎలా చేరుకోవచ్చు
[మార్చు]ఆ ఆలయం నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పరిమండల్ తాండలో ఉంది. నిర్మల్ వరకు బస్సులో వచ్చి అచటి నుండి 25 దూరంలో ఆలయాన్ని చేరుకునేందుకు మళ్ళీ పల్లె వెలుగు బస్సులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. మామడ నుండి 12 కి.మీ దూరంలో ఉంటుంది.
మూలాలు
[మార్చు]- ↑ "ఘనంగా జగదాంబదేవి జాతర | grand Jagadamba devi fair | Sakshi". www.sakshi.com. Retrieved 2024-12-15.