Jump to content

మధ్య ప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
12121 మధ్య ప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్

మధ్య ప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్, 2005 సం.లో భారతీయ రైల్వే బడ్జెట్లో ప్రవేశ పెట్టబడిన సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైళ్లు శ్రేణి రైళ్లు వాటిలో ఇది ఒకటి. ఈ రైలు మధ్య ప్రదేశ్ లోని, జబల్పూర్, న్యూఢిల్లీ మధ్య ప్రకటించారు. ఈ రైలు ప్రస్తుతం ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషను వద్ద ఆగిపోతుంది. ఈ స్టేషను న్యూ ఢిల్లీ రైల్వే స్టేషను దక్షిణం నుండి 8 కి.మీ. దూరంలో ఉంది.

మధ్యప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్, భారతీయ రైల్వేలు (भारतीय रेल) యొక్క ఒక భాగమైన పశ్చిమ మధ్య రైల్వే జోన్ (पश्चिम मध्य रेल) (IR కోడ్: - प.म.रे / WCR), జబల్పూర్ రైల్వే డివిజను ఆధీనంలో ఉంది.

సంపర్క్ క్రాంతి

[మార్చు]

సంపర్క్, క్రాంతి పదాలు సంస్కృతం నుండి తీసుకున్నవి. సంపర్క్ (దేవనాగరి: - सम्पर्क) అంటే పరిచయం, క్రాంతి అనగా (దేవనాగరి: - क्रान्ति) విప్లవం అని అర్థం.

అధిక వేగం రైలు కనెక్షన్లు అందించడానికి భారతీయ రైల్వే ద్వారా తీసుకున్న దశలను కలిపి ఈ పేరును సూచిస్తుంది. కేవలం పరిమిత సంఖ్యలో ఆగుతూ, ఎయిర్ కండిషన్డ్ కాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు నియామకం, అధిక వేగంతో ఆపరేటింగ్ ద్వారా భారత దేశము రాజధాని న్యూఢిల్లీ, భారతదేశం చుట్టూ ఉండే నగరాలతో ఇవి అనుసంధానం చేస్తున్నాయి. ఇలాంటి సామర్థ్యం గల సూపర్ ఫాస్ట్ ఒక రాజధాని సిరీస్ గతంలో ముందుగానే పరిచయం జరిగింది. కానీ ఈ రైళ్లు పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ కలిగి ఉన్నాయి, అందువలన ప్రయాణం చాలా ఖరీదైనది అయ్యింది.

రాజధాని, శతాబ్ది సిరీస్ రైళ్ళ సగటు ప్రయాణ వేగం పరంగా గమనిస్తే భారతదేశంలో వేగంగా ప్రయాణించే రైళ్ల విభాగంగా ఉన్నాయి. సంపర్క్ క్రాంతి రైళ్లు రాజధాని, శతాబ్ది సిరీస్ కంటే నెమ్మదిగా సరాసరి వేగంతో పనిచేస్తాయి. అయిననూ ఇంకా ఇప్పటికీ సాధారణ ధరలు వద్ద కొన్ని చోట్ల మాత్రమే ఆగుతూ అధిక వేగం సౌకర్యాలను అందించుతూ, రాజధాని, కాని శతాబ్ది కాని మొదలైనవి ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్లుతో పోలిస్తే సాపేక్షంగా అధిక వేగంతో నడుస్తూ ఉన్నాయి

రైలు వివరాలు

[మార్చు]
మధ్య ప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ (NZM - JBP) మార్గ పటం

సమయములు

[మార్చు]
రైలు నం. గమ్యస్థానము బయలుదేరు సమయం చేరుకొను సమయం తరచుదనం
12121 జబల్పూర్– హజ్రత్ నిజాముద్దీన్ 19:10 09:05
ఆది బుధ శుక్ర
12122 హజ్రత్ నిజాముద్దీన్ – జబల్పూర్ 17:25 07:45
సోమ గు శని

విరామాలు

[మార్చు]
స్టేషను కోడ్ స్టేషను పేరు దూరము (కి.మీ.)
JBP జబల్పూర్ 0
KTE కాట్నీ 91
DMO దామోవ్ 202
SGO సౌగోర్ 280
JHS ఝాన్సీ 507
GWL గ్వాలియర్ 604
NZM హజ్రత్ నిజాముద్దీన్ 909

లోకో లింకు

[మార్చు]

రైలు దాని ప్రయాణంలో డీజిల్, ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్ రెండింటినీ ఉపయోగిస్తుంది.

  1. జబల్పూర్ నుండి కాట్నీ వరకు, కాట్నీ నుండి జబల్పూర్ వరకు - కాట్నీ డీజిల్ లోకోమోటివ్ యొక్క డబ్ల్యుడిఎం3ఎ.
  1. కాట్నీ నుండి హజారత్ నిజాముద్దీన్ వరకు, హజారత్ నిజాముద్దీన్ నుండి కాట్నీ వరకు - తుగ్లకాబాద్ విద్యుత్ లోకోమోటివ్ యొక్క డబ్ల్యుఎపి7. కొన్నిసార్లు డబ్ల్యుఎపి7 అందుబాటులో లేదా లభ్యత లేని సమయాలలో కారణంగా ఇటార్సీ డబ్ల్యుఎపి4 ఛార్జ్ పడుతుంది.

కోచ్ వివరాలు

[మార్చు]

రైలు మొత్తం 24 కోచ్‌లు కలిగి ఉంటుంది:

  • 1 ఎసి- 1వ టైర్ కార్
  • 2 ఎసి టూ టైర్ కార్లు
  • 2 ఎసి త్రీ టైర్ కార్లు
  • 1 పార్సెల్ వాన్
  • 1 చైర్ కార్
  • 1 సైనిక కోచ్
  • 4 జనరల్ బోగీలు
  • 12 స్లీపర్ కార్లు

సరాసరి వేగం

[మార్చు]

ఈ రైలు 65 కి.మీ./గం. సగటున వేగంతో నడుస్తుంది

జబల్పూర్, న్యూఢిల్లీకి ప్రత్యామ్నాయ రైళ్లు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]