Jump to content

జయంతీ పట్నాయక్

వికీపీడియా నుండి
జయంతీ పట్నాయక్
జయంతీ పట్నాయక్


పార్లమెంట్ సభ్యులు
పదవీ కాలం
1980-1989, 1998-1999
ముందు జానకి వల్లభ పట్నాయక్
తరువాత శ్రీకాంత్ జెనా
నియోజకవర్గం కటక్, బెర్హంపూర్

పార్లమెంట్ సభ్యులు
ముందు పి.వి.నరసింహారావు
తరువాత ఆనంది శరణు సాహు

వ్యక్తిగత వివరాలు

జననం (1932-04-07) 1932 ఏప్రిల్ 7 (వయసు 92)
ఆస్కా, గంజాంజిల్లా, ఒడిషా, భారత దేశము
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి జానకి వల్లభ పట్నాయక్
సంతానం 1 కుమారుడు; 2 కుమార్తెలు
మూలం http://parliamentofindia.nic.in/ls/lok12/biodata/12or11.htm

జయంతీ పట్నాయక్ M.A. (జననం. 1932) భారత పార్లమెంట్ సభ్యులు. ఈమె సమాజ సేవకురాలు.[1]

ప్రాథమిక జివితం, విద్య

[మార్చు]

ఆమె 1932 లో ఒడిషా రాష్ట్రంలోని గంజాం జిల్లా లోని అస్కాలో జన్మించారు. ఆమె తండ్రి నిరంజన్ పట్నాయక్. ఆమె అస్కా లోని హరిహర్ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. ఆమె కటక్ లోని ఉత్కల్ విశ్వవిద్యాలయ పరిథిలోని సైలబల కాలేజీలో సోషల్ వర్క్ పై ఎం.ఎ పూర్తి చేశారు. ఆమె ముంబయి లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ వర్క్స్ లో తదుపరి విధనుకొనసాగించారు..[1]

ఆమె ప్రముఖ రాజకీయ వేత్త అయిన జానకి వల్లభ పట్నాయక్ (జె.బి.పట్నాయక్) ను 1953 లో వివాహం చేసుకున్నారు. ఆయన 1980 నుండి 89 మధ్య కాలంలో ఒడిషా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు.

కెరీర్

[మార్చు]
  • ఆమె మొదటిసారి 7 వ లోకసభకు ఒడిషా రాష్ట్రంలోని కటక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 1980 లో జరిగిన బై ఎన్నికలలో ఎన్నుకోబడ్డారు.
  • ఆమె 8 వ లోకసభకు రెండవసారి 1984 లో ఎన్నుకోబడ్డారు.
  • ఆమె 1988 నుండి 1990 క మధ్య ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ కు అధ్యక్షులుగా యున్నారు.
  • 1992 నుండి 1995 ల మధ్య జాతీయ మహిళా కమిషన్ కు తొలి చైర్ పర్సన్ గా ఎంపిక కాబడినారు.
  • ఆమె 1996 లో రాజ్యసభకు ఎంపిక కాబడినారు. ఆమె కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీకి ట్రెజరర్ గా కూడా పనిచేశారు.[1]
  • ఆమె మూడవసారి 12 వ లోకసభకు బెర్హంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 1998 లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైనారు.

మూలాలు

[మార్చు]