జాన‌కి బ‌ల్ల‌భ ప‌ట్నాయ‌క్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాన‌కి బ‌ల్ల‌భ ప‌ట్నాయ‌క్‌
జాన‌కి బ‌ల్ల‌భ ప‌ట్నాయ‌క్‌


అస్సాం గవర్నర్
పదవీ కాలము
11 డిసెంబరు 2009 – 10 డిసెంబరు 2014
ముందు సయ్యద్ సిబ్టీ రాజి
తరువాత పద్మనాభ ఆచార్య

ఒడిశా ముఖ్యమంత్రి
పదవీ కాలము
9 జూన్ 1980 – 7 డిసెంబరు 1989
ముందు నీలమణి రౌట్రై
తరువాత హేమానంద బిస్వాల్
పదవీ కాలము
15 మార్చి 1995 – 17 ఫిబ్రవరి 1999
ముందు బిజూ పట్నాయక్
తరువాత గిరిధర్ గొమాంగ్

వ్యక్తిగత వివరాలు

జననం (1927-01-03)3 జనవరి 1927
రామేశ్వర్, పూరి జిల్లా
మరణం 21 ఏప్రిల్ 2015(2015-04-21) (వయస్సు 88)
తిరుపతి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి జయంతి పట్నాయక్
పూర్వ విద్యార్థి ఉత్కల్ విశ్వవిద్యాలయం ,
బనారస్ హిందూ విశ్వవిద్యాలయం
మతం హిందూ
వెబ్‌సైటు Official Website

జానకి బల్లభ పట్నాయక్ (ఒరియా: ଜାନକୀ ବଲ୍ଲଭ ପଟ୍ଟନାୟକ; 3 జనవరి 1927 – 21 ఏప్రిల్ 2015) భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన 2009 నుండి అసోం గవర్నర్ గా వ్యవహసిస్తున్నారు.[1] ఆయన భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు మర్యు ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1980 నుండి 1989, 1995 నుండి 1999 వరకు వ్యవహరించారు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన కుర్దా పాఠశాలలో ప్రారంభ విద్యను పూర్తిచేసి 1947లో ఉత్కల్ విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలో బి.ఎ చేసారు. తరువాత రాజనీతి శాస్త్రంలో ఎం.ఎను బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో 1949 లో పూర్తి చేసారు. 1950లో ఆయన భారత జాతీయ కాంగ్రెస్ ఒరిసా రాష్ట్ర శాఖ యువజన విభాగానికి అధ్యక్షునిగా వ్యవహరించారు. 1980లో యువ‌జ‌న కాంగ్రెస్ నాయ‌కుడిగా, ఆ త‌ర్వాత రాష్ట్ర ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా కూడా ఆయ‌న ప‌ద‌వులు నిర్వ‌ర్తించారు. 2009 నుంచి ఆయ‌న అస్సాం గ‌వ‌ర్న‌ర్‌గా కూడా ప‌ని చేశారు. ఆయన భార్య జయంతీ పట్నాయక్ మూడు పర్యాయాలు లోకసభకు, ఒక సారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆమె జాతీయ మహిళా కమిషన్ మొట్టమొదటి ఛైర్ పర్సన్‌గా పనిచేశారు.

మరణం[మార్చు]

ఏప్రిల్ 21 2015 న 18వ స్నాత‌కోత్స‌వంలో పాల్గొనేందుకు తిరుప‌తి వ‌చ్చిన ఆయ‌నకు గుండెపోటు వ‌చ్చింది. వెంట‌నే తిరుప‌తిలోని స్విమ్స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డే ఆయ‌న తుది శ్వాస విడిచారు.[2]

మూలాలు[మార్చు]

  1. "PM Modi condoles the Death of former Orissa CM Janaki Ballabh Patnaik". news.biharprabha.com. 21 April 2015. Retrieved 21 April 2015. CS1 maint: discouraged parameter (link)
  2. తిరుపతిలో మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత..!! Tue 21st Apr 2015 11:39 AM

బయటి లింకులు[మార్చు]