జలగం కొండలరావు
Jump to navigation
Jump to search
జలగం కొండలరావు | |
---|---|
![]() | |
జననం | డిసెంబర్ 10, 1928 బయన్నగూడెం, పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా |
మరణం | డిసెంబర్ 18 , 2018 హైదరాబాదు, తెలంగాణ |
ఇతర పేర్లు | జలగం కొండలరావు |
ప్రసిద్ధి | భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయనాయకుడు, మాజీ ఎంపి. |
మతం | హిందూ |
జలగం కొండలరావు (డిసెంబరు 10, 1928 - డిసెంబరు 18, 2018) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయనాయకుడు, మాజీ ఎంపి. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సోదరుడు. భారత జాతీయ కాంగ్రెస్ తరపున 1977, 1980లలో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించాడు.[1]
జననం[మార్చు]
కొండలరావు 1928, డిసెంబర్ 10న ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలం, బయన్నగూడెంలో జన్మించాడు.
రాజకీయ ప్రస్థానం[మార్చు]
సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో కొనసాగిన కొండలరావు ఖమ్మం జిల్లా అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషించడేకాకుండా 1957లో వేంసూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా[2]మరియు 1977, 1980లో ఖమ్మం పార్లమెంటు సభ్యునిగా[3] గెలుపొందాడు.
మరణం[మార్చు]
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొండలరావు 2018, డిసెంబర్ 18న హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచాడు.
మూలాలు[మార్చు]
- ↑ TelanganaToday. "Former MP Jalagam Kondal Rao passes away". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 2018-12-30.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1957". www.elections.in. Retrieved 2018-12-30.
- ↑ "Khammam(Telangana) Lok Sabha Election Results 2014 with Sitting MP and Party Name". www.elections.in. Retrieved 2018-12-30.