జాజుల సురేందర్
| జాజుల సురేందర్ | |||
| |||
| పదవీ కాలం 2018 - 2023 డిసెంబర్ 03 | |||
| ముందు | ఏనుగు రవీందర్ రెడ్డి | ||
|---|---|---|---|
| తరువాత | కె. మదన్ మోహన్ రావు | ||
| నియోజకవర్గం | ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1973, మార్చి 25 నల్లమడుగు, లింగంపేట్ మండలం, కామారెడ్డి జిల్లా, తెలంగాణ | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
| తల్లిదండ్రులు | నర్సయ్య - హనుమవ్వ | ||
| జీవిత భాగస్వామి | భార్గవి | ||
| సంతానం | ఇద్దరు కుమారులు | ||
జాజుల సురేందర్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2][3]
జననం, విద్య
[మార్చు]సురేందర్ 1973, మార్చి 25న నర్సయ్య - హనుమవ్వ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, లింగంపేట్ మండలంలోని నల్లమడుగు గ్రామంలో జన్మించాడు. హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని సర్దార్ పటేల్ కాలేజ్ నుండి 1995లో గ్రాడ్యుయేషన్ (బికాం) పూర్తి చేశాడు.[4][5]
వ్యక్తిగత జీవితం
[మార్చు]సురేందర్ కు భార్గవితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
రాజకీయ విశేషాలు
[మార్చు]కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సురేందర్, 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ పై ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి చేతిలో 24,000 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[6] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిపై 31,000 వేలకు పైగా ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు.[7][8] 2018లో శాసన సభ్యునిగా గెలుపొందిన తరువాత కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[9][10] ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నాడు.[11]
ఇతర వివరాలు
[మార్చు]నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు సందర్శించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Home AMP". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-09-21.
- ↑ "Yellareddy Election Result 2018: Yellareddy Assembly Election 2018 Results | Yellareddy Vidhan Sabha MLA Result". wap.business-standard.com. the original నుండి 2022-02-06 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-09-21.
- ↑ News18 (2018). "Yellareddy Rural Assembly constituency (Telangana): Full details, live and past results". News18. ఒరిజినల్ నుండి 29 మే 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 May 2021.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ Telangana Legislature (2018). "Member's Profile – Telangana-Legislature". the original నుండి 13 జూలై 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 July 2021.
- ↑ Eenadu (14 November 2023). "మన అభ్యర్థులవి పెద్ద చదువులే". the original నుండి 14 November 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 November 2023.
- ↑ "Jajala Surender(Indian National Congress(INC)):Constituency- YELLAREDDY(NIZAMABAD) – Affidavit Information of Candidate". myneta.info. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-09-21.
- ↑ "Yellareddy Election Result 2018 Live Updates: Candidate List, Winner, Runner-up MLA List". Elections in India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-09-21.
- ↑ "Yellareddy Assembly Election result 2018: Indian National Congress' Jajala Surender wins". www.timesnownews.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-09-21.
- ↑ "Congress MLA Jajula Surendar moves to TRS". www.deccanchronicle.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-09-21.
- ↑ "Congress Telangana Yallareddy Constituency Jajula Surendar Resigned TRS Party Join". www.telugujournalist.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-09-21.
{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link] - ↑ Sakshi (22 September 2019). "తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ". ఒరిజినల్ నుండి 15 జూలై 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 July 2021.