జాటోత్ దర్గ్యా నాయక్
కామ్రేడ్ జాటోత్ దర్గ్యా నాయక్ (మే 10, 1917 - డిసెంబర్ 16 ,2024) తెలంగాణ సాయుధ పోరాట। రైతాంగ పోరాట యోధుడు. గెరిల్లా దళ నాయకుడు. కామ్రేడ్ జాటోత్ ఠాను నాయక్ స్వయాన తమ్ముడు.వీరి కుటుంబమంతా సాయుధ పోరులో అమరులైనారు.ప్రస్తుతం ఇతని వయస్సు 107 సంవత్సరాలు [1][2][3].
జాటోత్ ఠాను నాయక్ | |
---|---|
![]() | |
జననం | 10 మే 1917 ధరమాపూర్ పడమటి తండా దేవరుప్పుల , మండలం జనగామ జిల్లా |
మరణం | డిసెంబర్ ,16 , 2024 తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, దేవరుప్పుల మండలంలోని ధరమాపూర్ పడమటి తాండలో |
మరణ కారణం | వృధ్యాపంతో |
వృత్తి | కమ్యూనిష్టు నాయకుడు |
ప్రసిద్ధి | తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ ఉద్యమ నాయకుడు |
రాజకీయ పార్టీ | కమ్యూనిష్టు పార్టీ |
తండ్రి | హము నాయక్ |
తల్లి | మంగిబాయి |
జననం
[మార్చు]జాటోత్ దర్గ్యా నాయక్ 1917 మే10 తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, దేవరుప్పుల మండలంలోని ధరమాపూర్ పడమటి తాండలో జాటోత్ హము నాయక్, మంగిబాయి అను లంబాడీ గిరిజన దంపతులకు జన్మించాడు.ఇతను తుపాకీ కాల్చడం లో దిట్ట.గెరిల్లా దళ నాయకుడు. ఇతని అన్న కామ్రేడ్ జాటోత్ ఠాను నాయక్ ప్రముఖ కమ్యూనిస్టు పార్టీ దళ నాయకుడు.
కుటుంబం
[మార్చు]తెలంగాణ రాష్ట్రం జనగాం జిల్లా దేవరుప్పుల మండలంలోని ధర్మాపూర్ తాండలో జాటోత్ హమునాయక్,మంగిబాయి దంపతులకు గిరిజన బంజారాలంబాడీ ఐదుగురు సంతానంలో దర్గ్యా నాయక్ అయిదో సంతానం. జోద్యానాయిక్, సోమ్లా నాయక్,సక్రు నాయక్, జాటోత్ ఠాను నాయక్, [4]నలుగురు. కీషన్ నాయక్ దర్గ్యా నాయక్ కంటే చిన్నవారు. దర్గ్యా నాయక్ వదినమ్మ పేరు జాటోత్ ఫూలిబాయి విసునూరు దొరలపై కడవెండి కి చెందిన దొరసాని జానకమ్మ పై వీరత్వాన్ని ప్రదర్శించిన వీరనారి జోద్యా నాయక్ సతీమణి.వీరి బంధుమిత్రులు జాటోత్ రెడ్యా,అజ్మేర బలరామ్,అజ్మేర చంద్రునాయిక్,రాము నాయక్,బోడా గోల్యా నాయక్,థావ్రు నాయక్,ధారావత్ కీషన్ నాయక్, మొదలగు వారు ఆపత్కాల పరిస్థితిలో వీరి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటు సహచరులుగా ఉండి సహాకరించే వారు[5].
దొరల పై విజయం
[మార్చు]నిజాం పాలన కాలంలో దొరలు ,విస్నూర్ దేశ్ ముఖ్ లు, జాగీరుదారులు, జమిందారులు,పెట్టేళ్ళు పేదల భూములను అన్యాయంగా దురాక్రమణ [6]చేసేవాళ్ళు,రైతులను తమ భూముల నుండి తరిమిమేసే వాళ్ళు,పేదలతో వెట్టి చాకిరి చేయించేవాళ్ళు,ఆడవాళ్ళ మానాలను దోచే వాళ్ళు రకరకాల పన్నులతో ప్రజలను జలగల్లా పీడించే వాళ్ళు, ఎవరైనా ప్రశ్నించినా, పన్నులు కట్ట లేకపోయినా అత్యంత కౄరమైన నిర్భందాలను ప్రయోగించే వాళ్ళు, జాటోత్ దర్గ్యా నాయక్ తండ్రి హము నాయకత్వంలో 80 ఎకరాల అటవి భూమి సాగులోకి తీసుకొచ్చారు.ఆ భూముల్లో పంటలు బాగా పండటంలో ధరమాపూర్ వెలమ దొర పూసుకూరి రాఘవరావు,ఆ భూమి తన పంట భూమి అని వేధించడం మొదలు పెట్టాడు. భూమిని తన స్వాధీనం చేసుకోవచ్చని దాడి ప్రారంభించాడు.తన తండ్రి హము నాయకత్వంలో లంబాడీ లు ఏకమై,గుండాలను తరిమికొట్టారు. 1944లో రాఘవరావు విస్నూర్ దేశ్ ముఖ్ రాపాక రామచంద్రారెడ్డి సహాయంతో లంబాడీలు పెద్ద సంఖ్యలో గుండాలను తరిమికొట్టి విజయం సాధించారు.
త్యాగాల కుటుంబం
[మార్చు]జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరమాపూర్ పడమటి తండా లోని జాటోత్ హము కుటుంబం త్యాగాలకు, ధైర్య సాహసాలకు నిదర్శనం కడవెండి గ్రామంలో నిజాం మిలటరీ కాల్పులు జరిపి దొడ్డి కొమరయ్య ను బలిగొన్నప్పుడు గ్రామ ప్రజలకు ఈ కుటుంబం మనోధైర్యం చెప్పి ,వాళ్ళందరిని కూడదీసి కదిలించింది ఈ జాటోత్ ఠాను నాయక్, జాటోత్ దర్గ్యా నారక్ కుటుంబమే.! విసునూరు దేశ్ ముఖ్ గుండాలు ఆ గ్రామం పై దాడి చేసినప్పుడు ఈ కుటుంబం ఇచ్చిన సాహసం, ధైర్యం,ప్రోత్సాహం అంతులేనిది. ఈ ఉత్సాహం వల్లనే ఆ గ్రామ ప్రజలు ఆ గుండాలకు తగిన శాస్తి చేశారు.ఈ కుటుంబ సభ్యులు ఆడ మగ అను భేదం లేకుండా ఐక్యంగా అందరు పోరాటంలో తమ వంతు పాత్ర పోషించారు.
దర్గ్యా నాయక్ పుస్తకం
[మార్చు]తెలంగాణ పోరాట యోధుడు,గెరిల్లా దళ నాయకుడు కామ్రేడ్ జాటోత్ దర్గ్యా నాయక్ పోరాట పటిమను, జీవిత చరిత్రకు సంబంధించిన పుష్తకాన్ని రచయిత జీలుకరా వెంకన్న రచించారు. బంజారా భీం దర్గ్యా నాయక్ పేరుతో తీసుకొచ్చారు. 88 పేజీలతో గల ఈ పుస్తకం ధర యాభై రూపాయిలు ఉంది. ఈ పుస్తకం నవతెలంగాణ బుక్స్ డిపో వారికి ఆర్డరు ఇచ్చి తెపించుకోవచ్చు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మరణం
[మార్చు]తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు జాటోత్ దర్గ్యా నాయక్ వృద్ధాప్యంతో 16 డిసెంబర్ 2024 న తన సొంత గ్రామంలో తుది శ్వాస విడిచారు[7][8].
మూలాలు
[మార్చు]- ↑ "Errabelli Dayakar Rao: తెలంగాణ సాయుధ పోరాట యోధుడిని సన్మానించిన ఎర్రబెల్లి". Samayam Telugu. Retrieved 2024-10-17.
- ↑ "బాంచెన్ బతుకులు వద్దు". EENADU. Retrieved 2024-10-17.
- ↑ Bharat, E. T. V. (2022-09-17). "Telangana Liberation Day 2022 : బందూకులెత్తారు.. బరిగీశారు." ETV Bharat News. Retrieved 2024-10-17.
- ↑ Ravi (2022-03-20). "సంస్మరణ:తెలంగాణ పోరు బిడ్డ 'ఠాణు'". www.dishadaily.com. Retrieved 2024-10-17.
- ↑ krishna (2023-03-21). "తెలంగాణ తెగువ ఠానునాయక్". Mana Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-10-17.
- ↑ telugu, NT News (2024-12-17). "అస్తమించిన తెలంగాణ సాయుధ రైతాంగ యోధుడు". www.ntnews.com. Retrieved 2024-12-17.
- ↑ Subeditor2 (2024-12-16). "నేలకొరిగిన వీరపుత్రుడు -" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-12-17.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link] - ↑ telugu, NT News (2024-12-17). "అస్తమించిన తెలంగాణ సాయుధ రైతాంగ యోధుడు". www.ntnews.com. Retrieved 2024-12-17.