జాతక కథలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Bhutanese painted thangka of the Jataka Tales, 18th-19th Century, Phajoding Gonpa, Thimphu, Bhutan

జాతక కథలు భారతదేశంలో ప్రాచుర్యం పొందిన బుద్ధుని పూర్వ జన్మల గురించిన జానపద కథల సమాహారం. క్రీ.పూ 300 — సా.శ. 400 మధ్యలో[1][2] రచించబడినట్టుగా చెప్పబడుతున్న ఈ కథలన్నీ పాళీ భాషలో లభ్యమయ్యాయి. తరువాత అనేక భాషల్లోకి తర్జుమా చేయబడ్డాయి. వీటి సంఖ్య సుమారుగా 550-600 మధ్యలో ఉంటుంది. ఈ కథలన్నింటిలోనూ, సాధారణ మానవుడు పాటించవలసిన ధర్మాలు, నీతి నిజాయితీలు, త్యాగం మొదలైన లక్షణాలతో పాటు చక్కటి సందేశం కూడా అంతర్లీనంగా ఇమిడి ఉంటాయి. బుద్ధుడు తన పూర్వజన్మల్లో వివిధ జాతులకు చెందిన మానవుడిగా, జంతువుగా జన్మిస్తాడు. చాలా కథలు ఇప్పుడు వారణాసి లేదా కాశీగా పిలువబడుతున్న బెనారస్ చుట్టూ అల్లబడ్డాయి. ఇది హిందువులకు చాలా పవిత్రమైన ప్రదేశం. ఈ నగరానికి దగ్గర్లో ముస్లిములకు, బౌద్ధులకు కూడా పవిత్రమైన ప్రదేశాలున్నాయి. బౌద్ధుల సాంప్రదాయం ప్రకారం గౌతముడు మొట్టమొదటి సారిగా ఈ నగరానికి కొద్ది దూరంలో ఉన్న సారనాథ్ అనే ప్రదేశం నుంచి ప్రారంభించాడని ప్రతీతి. చందమామ పత్రికలో ఈ జాతక కథలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.

జాతక కథలలో రామ కథ

[మార్చు]

పాకృత సాహిత్యంలో మనకు లభించే అతి ప్రాచీన రామ కథ బుద్ద జాతక కథల లోనిది. జాతక కథలు బుద్ద భగవానుని పూర్వ జన్మ గాథలు. ఇవి మొత్తం సుమారు 550-60 ఉన్నాయి. వీటిలో మొత్తం మూడు రామ కథలున్నాయి. జాతక కథల ప్రకారం రామ కథ:...... పూర్వం వారణాసిలో దశరధుడు అనే రాజు ధర్మ ప్రకారం రాజ్యం చేస్తున్నాడు. అతనికి పదహారు వేల మంది భార్యలున్నారు. కాని పట్టపు రాణికి మాత్రం ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కలిగారు. పెద్ద కుమారుని పేరు రామ పండితుడు. రెండో వాడు లక్ష్మణ కుమారుడు. కుమార్తె పేరు సీతా దేవి. పట్టపు రాణి మరణాంతరం దశరధుడు మరొక స్త్రీని వివాహం చేసు కుంటాడు. ఆమె ద్వారా ఒక కొడుకును కంటాడు. అతని పేరు భరతుడు. ఆమె రాజుకు మనోరంజక మౌతుంది. ఒక సందర్భంలో రాజు దశరధుడు తన భార్యను దగ్గరికి తీసుకొని నీకేం కావాలో కోరుకో' మంటాడు. ఆమె తన కోరికను తర్వాత చెప్తానని అప్పుడు తీర్చమని వాగ్దానం తీసుకుంటుంది. ఏడు సంవత్సరాల తర్వాత ఆమె తన భర్త అయిన దశరధుని వద్దకు వచ్చి ఆ నాడు తనకిచ్చిన వరాన్ని ఏకరువు పెట్టి ఇప్పుడు తీర్చమంటుంది. మాట తప్పని రాజు సరె నంటాడు. ఏడు సంవత్సరాల తర్వాత ఆమె రాజు వద్దకు వచ్చి తన కిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు తనకిచ్చిన వరాన్ని తీర్చ మంటుంది. రాజు చెప్పమనగా ఆమె తన కుమారుడైన భరతునకు రాజ్య పట్టాభిషిక్తున్ని చేయమంటుంది. దరశరధునకు కోపం వస్తుంది. ఆమెను తూల నాడాడు. కాని ఆమె తనకిచ్చిన మాటను నిలబెట్టుకోమని వేదిస్థూనె వుంటుంది. ఈమె ఏనాటికైనా తన కోర్కెను తీర్చు కోడానికి తన మొదటి ఇద్దరి కొడుకులను సంహ రిస్తుందేమోనని భయ పడి, తన పెద్ద కుమారు లిద్దరిని పిలిచి "నాయన లారా మీరు ఇక్కడుంటే మీకు ప్రణాపాయము. కనుక మీరు పన్నెండు సంవత్సరాలు ఎక్కడైనా, సామంత రాజ్యంలో గాని, అరణ్యంలో గాని గడిపి తిరిగి వచ్చి రాజ్యం చేయండి అని చెప్తాడు.

అప్పుడు రామ పండితుడు తండ్రి మాట ప్రకారం లక్ష్మణ కుమారుని తోను, సీత తోను హిమాలయాలకు వెళ్లతాడు. ఇలా కొంత కాలం జరుగు తుంది. ఇంత లో దశరధుడు మరణిస్తాడు. భరత కుమారునికి భరతుని రాజ్యాభిషేకానికి అమాత్యులు అడ్డు పడతారు. ఆ మాటలకు భరత కుమారుడు రామ పండితుణ్ని వన వాసం నుండి తీసుక వచ్చి రాజ్యాభిషేకం చేయిస్తానని అరణ్యానికి బయలు దేరుతాడు. రామ పండితుని కలిసి విషయం చెప్పి తనతో రావలసినదిగా వేడు కుంటాడు. దానికి రామ పండితుడు తన తండ్రి అదేశాను సారం పన్నెండు సంవత్సరాలు వన వాసం చేయాలి., ఇప్పటికి తొమ్మిది సంవత్సరాలు అయినది ఇక మూడు సంవత్సరాలు తర్వాత వస్తానని దృడంగా చెపుతాడు. భరతుడు బలవంతం చేయగా రామ పండితుడు తన పాదులను ఇస్తాడు. భరతుడు ఆ మూడు సంవత్సరాలు పాదుకలను రామ ప్రతినిధిగా వుంచి రాజ్యం చేస్తాడు. అమాత్యులు పాదుకలను సింహాసనం పై పెట్టి అభియోగాలకు తీర్పు చెప్పె వారు. తీర్పు సరిగా లేక పోతె పాదులకు పరస్పరం కొట్టు కుంటాయి. సరిగా వుంటే అవి ప్రశాంతంగా వుంటాయి. రామ పండితుడు మిగిలిన ఆ మూడు సంవత్సరాలు వనవాసం చేసి వారణాసికి తిరిగి వస్తాడు. భరత కుమారుడు ఎదురేగి స్వాగతం చెప్పి రాజ్యం అప్పగిస్తాడు. రామ పండితుడు పట్టభిషిక్తుడై సీతను పట్టపు రాణిని చేసి పదహారు వేల సంవత్సరాలు ధర్మాను సారంగా రాజ్యం చేస్తాడు.

పాటాంతరము: రామ పండితుడు వన వాసంలో వుండగా దశరధుడు మరణిస్తాడు. భరత కుమారుడు వనవాసంలో వున్న రామ పండితుని వద్దకు వెళ్లి తండ్రి మరణ వార్థను తెలియ జేస్తాడు. అందులకు రామ పండితుడు ఏ మాత్రము చలించ లేదు. ఆయన శోక పరి తత్పుడు కాకుండుటకు కారణ మేమని యడుగగా..... రాముడు అనిత్యతాస్వరూపం వివరించాడు. పిత్రుశోకంతొ విలపిస్తున్న తన భక్తునికి బుద్ద భగనావుడు పై రామ కథను చెప్పి వూరడిస్తాడు.

బుద్ద భగవానుడు ఈ ధర్మోపదేశం చేసిన జాతకాల రెందింటితోను ఇలా సరి పోల్చాడు. "ఆ కాలంలో మహారాజు శుద్దోధనుడు దశరధుడు. మహా మాయ రామ పండితుని తల్లి, తాహులుని తల్లి సీత, అనందుడు భరతుడు, సారి పుత్రుడు లక్ష్మణుడు. పరివారం బుద్ద పరిషత్తు. నేనే రామ పండితుడను"

ప్రాకృత వాగ్మయంలో రామ కథ, ఈ వ్వాస సంకలనాన్ని వ్రాసిన వారు డా: తిరుమల రామ చంద్ర. వారు ఈ గ్రంథాన్ని తన దౌహిత్రి అయిన అపరాజితకు అంకిత మిస్తూ గ్రంథారంబంలో మనవి మాటలు. వ్రాశారు. అవి చాల కుతూహలాన్ని కలిగిస్తాయి. వారి మాటలనే క్లుప్తంగా.......

అపరాజిత 1989 వ సంవత్సరంలో జనవరిలో పుట్టి 1990 సెప్టెంబరులో .... క్యానరు వ్వాదితో మరణించింది. ఆ వున్న కొన్ని నెలలు క్రమ శిక్షణతో మెలుగుతూ అపూర్వ ప్రతిభను కనబరిచింది. తప్పడడుగులు వేస్తూ జిలిబిల పలుకులు పలికే కాలానికే ఏవో పాటలు పాడుతూ ఒంటరిగా ఆడుకునేది. ఉదయం ఇంటి ముంగిట మల్లెపందిరి కింద రాలిన మల్లె పూలను ఏరుకొచ్చి మెట్ల మీద మాలలో పేర్చి ఏవో పాటలు పాడుతూ గొబ్బిళ్లు తడుతూ తిరిగేది. తాతా.... అమ్మమ్మ "పూజ పూలు అంటూ మల్లె పూవులు అందించేది. ఒక ఉదయం పూట ఏమిటీ పాటలు అని కుతూహులంగా విన్నాను. సంస్కృతపు పాటలాగ అనిపించాయి. పూజలో అమ్మమ్మ సంస్కృత పాటలు విని ఆబాణి పట్టుకుందేమో నని వూరుకున్నాను. మరొక మారు కూడ యాదృచ్చికంగా విన్నాను. ఈ సారి పాకృత గీతాల లాగ అనిపించాయి. ఆశ్చర్య పడి శ్రద్దగా విన్నాను. పదునైదు నెలల పాప ? ఏమిటీ విచిత్రం? అనుకుంటూ దగ్గరికెళ్లాను. పాప సిగ్గుపడి పూజ., పాట ఆపింది. అదే బాణి, అదే భాష - దమ్మ పదాన్ని గాధా సప్త శతిని నోరు తిరక్క ఇష్టం వచ్చి నట్లు సరళం చేసి పాడుతుంది. "ఏభాషమ్మా పాపా?" అనడిగాను. "పాళీ " తాతా అన్నది. అదిరి పడ్డాను. నేను వింటున్నది నిజమేనా? కల కాదు కదా.... అనుకుంటూ మరొక మారు " అప్పూ..... (అపరాజిత) ఎం భాషమ్మా... ఏం పాటమ్మా.." అని అడిగాను. "పాళీ తాతా...." అని గట్టిగా చెప్పి తన పనిలో లీనమై పోయింది. "

ఋష్యశృంగుని కధ

[మార్చు]

రోమపాదుడనే రాజు పాలిస్తున్న రాజ్యంలో ఒకప్పుడు ద్వాదశ వార్షికమైన్ కరువు సంభవించింది. పాడిపంటలు నశించాయి. ప్రజలు ఆకలి దప్పుపలతో బాధపడుతూ హాహాకారాలు చేయసాగారు. అప్పుడు మహర్షులు ఆయనతో విభాండక పుత్రుడైన ఋష్యశృంగుణ్ణి తీసుకువచ్చినట్లయితే రాజ్యంలో వర్షాలు కురుస్తాని అని తెలియజేసారు. ఆ ఋష్యశృంగుడుని రాజు విశ్వ ప్రయత్నం మీద రాజ్యానికి తెప్పించి, తన పుత్రిక అయిన శాంతను అతనికిచ్చి వివాహం చేసి తనవద్ద ఉంచుకున్నాడు. దేశంలో వర్షాలు కురిసాయి. రాజ్యం సుభిఖంగా మారింది. ఇది రామాయణం బట్టి తెలుస్తున్న కథ. కానీ ఈ జాతక కథలలో నళినికాజాతకకథలో బ్రహ్మదత్తుడు వారణాసిలో రాజ్యంచేస్తున్న కాలంలో బోధిసత్త్వుడు ఉదీప్య బ్రాహ్మణుల ఉత్తమవంశంలో జన్మించి, సమస్త విద్యలూ నేర్చుకున్నాడు. పెద్దవాడయినాక ఋషి ప్రవ్రజ్యను గ్రహించి హిమాలయ పర్వతాలకు పోయి ఘోరమైన తపస్సు చేసాడు. అతని సంబందం వల్ల ఒక లేడి గర్భం ధరించి ఒక మగబిడ్డను కన్నది. ఆబిడ్డకు ఋషిశృంగుడు అనే పేరువచ్చింది. తండ్రి అతనికి ప్రవ్రజ్యనిచ్చి యోగవిధిని నేర్పాడు. ఆబాలుడు శీఘ్రంగానే జ్ఞానం పొంది, తండ్రి ఆశ్రమంలోనే ఉంటు ఘోరమైన తపస్సు చేస్తూ ఉండేవాడు. వానికి స్త్రీ పురుష విచక్షణ లేదు. అతని తపస్సుకు ఇంద్రభవనం కంపించింది. ఆతని తపోభంగానికి ఇంద్రుడు ఆలోచించి మూడేళ్ళపాటు కాశీరాజ్యంలో వర్షాలు పడకుండా చేసాడు. పంటలు లేవు. ప్రజలు తహతహలాడిపోయారు. రాజును ఆశ్రయించారు. రాజు తీవ్రప్రయత్నాలు చేసినా లాభంలేకుండాపోయింది. ఒకనాటి రాత్రి ఇంద్రుడు రాజుకు స్వప్నంలో కనిపించి ఋష్యశృంగుని తపస్సు భంగంచేస్తే నేను వర్షంకురిపిస్తాను, అది నీ కుమార్తె నళిని వల్లనే గాని ఇతరులవలన సాధ్యపడదు అని తెలియజేసాడు. రాజు కుమార్తె ముందు భయపడినా తుదకు తండ్రి ఆనతిని శిరసావహించి ముని ఆశ్రమానికి అమాత్యుల సహాయంతో వెళుతుంది. అప్పుడు ఆశ్రమంలో ఋష్యశృంగుడు మాత్రమే ఉన్నాడు. నళిని ముని వేషంతో ఆశృమంలోనికి ప్రవేశించింది. ఆమె తనవంటి ముని అనుకొని అతిథి సత్కారలు చేసాడు ఋష్యశృంగుడు. అప్పుడు అమాయకుడైన ఋష్యశృంగుడుని కొద్దిరోజుల తరువాత ఆమె లొంగదీసుకొని ఆతనితో సంగమిస్తుంది. అక్కడ ఎక్కువకాలం ఉంటే ఆతని తండ్రి వచ్చి దండిస్తాడని భయపడి తన ఆశృమానికి రమ్మని దారితెలిపి తప్పించుకొంటుంది.ఈయన తపోభంగం వలన రాజ్యంలో వర్షాలు కురుసాయి. ఋష్యశృంగుని తండ్రి వచ్చి ఆంతా గ్రహించి తిరిగి ఋష్యశృంగుడిని ప్రవ్రజ్యలోకి మళ్ళిస్తాడు.

తెలుగు అనువాదాలు

[మార్చు]

జాతక కథలను తెలుగులోకి విద్వాంసులు గద్య పద్యాత్మకాలుగా అనువాదించారు. వాటిలో బుద్ధుని పూర్వ జన్మములు అనునది గద్యాత్మకము. సుప్రసిద్ధ విద్వాంసులు శిరోమణి సన్నిధానం సూర్యనారాయణశాస్త్రి గారి జాతక కథా గుఛ్ఛములు అనే పద్యానువాద గ్రంథాలు మిక్కిలి ప్రసిద్ధమైనవి. అటుపై సాహితీ అకాడమీ మాజీ ఉపాధ్యక్షులు తల్లావఝుల శివశంకరశాస్త్రి లేదా శివశంకర స్వామి జాతక కథలు అనే పేరుతోనే గద్య పద్యాత్మాకంగా అనువదించి వెలువరింపజేసారు. పాళీభాషలోని గాథలు సంస్కృత శ్లోకాలు మాదిరిగా సమానమైన నడక కలిగి ఉండవు ఇందులో. ఒకే గాథలో ఒక పాదం హ్రస్వంగాను, మరొకపాదం దీర్ఘంగాను-ఒక పద్ధతి కలిగి ఉండవు. అందువల్లన వీటిని తర్జుమా చేయటం చాలా క్లిష్టతరం. పాళీ ప్రాకృతంలో అనుభవం ఉండటం వలన శివశంకరస్వామి దీనిని తర్జుమా చేయుట సాధ్యపడినది. ఆయన వ్యవహారిక భాషకు చాలా దగ్గరగా ఉన్న సులభ గ్రాంధికంలో దీనిని రచించారు. గాథలను సులభంగా ఉండే ఆటవెలదులు, తేటగీతలు, మంజరీ ద్విపదులు, ముత్యాలసరాలు మున్నగు రీతులలో అనువదించారు. దీనిని మొత్తం 6 సంపుటాల్లో అనువదించారు.

మూలాలు

[మార్చు]

పాకృత వాగ్మయములో రామకథ, ...... డా: తిరుమల రామ చంద్ర. ప్రాకృత అకాడెమి ప్రచురణ., నెం. 5.

  • 1978 భారతి మాసపత్రిక.
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2022-08-11. Retrieved 2009-05-21.
  2. http://www.pitt.edu/~dash/jataka.html#about

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=జాతక_కథలు&oldid=4135787" నుండి వెలికితీశారు