తల్లావఝుల శివశంకరశాస్త్రి
తల్లావఝుల శివశంకరశాస్త్రి | |
---|---|
తల్లావఝుల శివశంకరశాస్త్రి | |
జననం | సెప్టెంబర్ 12, 1892 కాజ గ్రామం, గుంటూరు జిల్లా |
మరణం | 1972 |
ప్రసిద్ధి | ప్రసిద్ధ సాహితీవేత్త, నాటక రచయిత |
బంధువులు | తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి (మనుమడు) |
తండ్రి | కృష్ణశాస్త్రి |
తల్లి | లక్ష్మీదేవి |
తల్లావజ్ఝల శివశంకర శాస్త్రి (సెప్టెంబర్ 12, 1892 - 1972) సాహితీవేత్త, నాటక రచయిత. భావకవితా ఉద్యమ పోషకుడు. ఇతడు సాహితీ సమితి సభాధ్యక్షుడిగా ఉన్నాడు. తెనాలిలోని శ్రీరామ విలాస సభ నాటకసంస్థలో దర్శకుడిగా పనిచేశాడు.[1]
జీవిత విశేషాలు[మార్చు]
ఇతడు 1892, సెప్టెంబర్ 12న కృష్ణశాస్త్రి, లక్ష్మీదేవి దంపతులకు గుంటూరు జిల్లా, కాజ గ్రామంలో జన్మించాడు[2]. ఈత, గుర్రపుస్వారీ, చిత్రలేఖనం, తోటపని, టెన్నిస్ ఇతని అభిమాన విషయాలు. ఇతడు హిందీ, ఇంగ్లీషు, బెంగాలీ, సంస్కృతం, పాళీ భాషలలో నిష్ణాతుడు. ఆయా భాషలనుండి తెలుగులోనికి అనేక గ్రంథాలను అనువదించాడు. సాహిత్య అకాడెమీ, నేషనల్ బుక్ ట్రస్టులలో సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ ఉపాధ్యక్షుడిగా, శాశ్వత గౌరవ విశిష్ట సభ్యుడిగా ఉన్నాడు. నవ్యసాహిత్య పరిషత్తు, సాహితీసమితి వంటి సంస్థలను స్థాపించాడు. దేశ స్వాతంత్ర్య సమయంలో రెండు పర్యాయాలు కారాగార శిక్ష అనుభవించాడు.
మరణం[మార్చు]
1972లో మరణించాడు.
రచనలు[మార్చు]
- 1. కావ్యావళి. (రెండు భాగములు)
- 2. హృదయేశ్వరి (ఉపకావ్యము)
- 3. పద్మావతీ చరణ చారణ చక్రవర్తి (పద్య నాటిక -- ముద్రి)
- 4. రాజజామాత
- 5. సహజయానపంథీ
- 6. నోణక భార్య
- 7. వరపరీక్ష (ఈ నాలుగు గీతి నాటికలు)
- 8. వకుళమాల (గీతికాస్వగతము)
- 9. రత్నాకరము (గీతికాసంవాదము)
- 10. ఆవేదన (ఖండకావ్యము)
- 11. కవిప్రియ (పద్యనాటిక)
- 12. యక్షరాత్రి (గీతినాటిక)
- 13. సాధకుడు (వాకోవాక్యము)
- 14. కవిరాజు (సర్గబంధము)
- 15. వ్యాకరణ దర్శన చరిత్ర (ఆంధ్రీకరణము ఈ రెండును రచనలో నున్నవి)
- 16. మహారాష్ట్ర జీవనప్రభాతము
- 17. జీవనసంధ్య
- 18. మాధవీ కంకణము
- 19. రమాసుందరి
- 20. కాంచనమాల
- 21. కుంకుమ భరిణె (అచ్చువడిన నవలలు)
- 22. దీక్షితదుహిత (నాటిక)
- 23. ప్రభువాక్యం
బిరుదములు[మార్చు]
- విద్యావాచస్పతి
- మహోపాధ్యాయ
- కవిసార్వభౌమ
- సాహిత్యాచార్య
- సాహిత్యసామ్రాట్
- కవీంద్ర
మూలాలు[మార్చు]
- ↑ నాటక సమాజ దిక్సూచి శ్రీరామ విలాస సభ, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 23 జనవరి 2017, పుట.14
- ↑ "ఒంగోలు జిల్లా రచయితల మహాసభలు ప్రారంభ సంచిక, సంపాదకుడు- నాగభైరవ కోటేశ్వరరావు - జూన్ 1971- పుట 118". Archived from the original on 2020-09-25. Retrieved 2015-10-11.