జాయిస్ జార్జ్
Appearance
జాయిస్ జార్జ్ | |||
పదవీ కాలం 16 మే 2014 – 23 మే 2019 | |||
ముందు | పీ.టీ. థామస్ | ||
---|---|---|---|
తరువాత | డీన్ కురియకోస్ | ||
నియోజకవర్గం | ఇడుక్కి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | వజతోపే , ఇడుక్కి , కేరళ | 1970 ఏప్రిల్ 26||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | స్వతంత్ర | ||
జీవిత భాగస్వామి | అనుప మాథ్యూ | ||
సంతానం | 1 | ||
నివాసం | తాడియంపాడు, ఇడుక్కి , కేరళ | ||
వృత్తి | న్యాయవాది | ||
మూలం | [1] |
జాయిస్ జార్జ్ (జననం జననం 26 ఏప్రిల్ 1970) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఇడుక్కి లోక్‌సభ నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]జాయిస్ జార్జ్ 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఇడుక్కి లోక్‌సభ నియోజకవర్గం నుండి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి డీన్ కురియకోస్ పై 50,542 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2019లో నుండి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి డీన్ కురియకోస్ పై 171,053 ఓట్లతో,[3] 2024లో సీపీఎం అభ్యర్థిగా తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి డీన్ కురియకోస్ పై 133727 ఓట్లతో వరుసగా ఓడిపోయాడు.[4]
వివాదాలు
[మార్చు]- 2005లో షెడ్యూల్డ్ కులాల కోసం దేవికులం తాలూకాలో కేటాయించిన 28 ఎకరాల భూమిని జాయిస్ జార్జ్ ఆక్రమించాడని పేర్కొంటూ టైటిల్ డీడ్‌ను 2017లో సబ్ కలెక్టర్ రద్దు చేశారు.[5]
- 2021లో రాహుల్ గాంధీని "పెళ్లికాని ట్రబుల్ మేకర్" అని పిలిచి ఒక వివాదంలో చిక్కుకున్నాడు.[6]
- 2022లో గాడ్గిల్ నివేదికకి విరుద్ధంగా బఫర్ జోన్‌పై వివాదాస్పద వ్యాఖ్య చేశాడు.[7]
మూలాలు
[మార్చు]- ↑ The New Indian Express (16 March 2018). "Kerala MP Joice George on Ministry of Environment, Forest committee" (in ఇంగ్లీష్). Retrieved 3 August 2024.
- ↑ TimelineDaily (28 February 2024). "CPM Chooses Joice George For Idukki Constituency To Wrest Seat From Congress" (in ఇంగ్లీష్). Archived from the original on 3 August 2024. Retrieved 3 August 2024.
- ↑ The Times of India (24 May 2019). "Dean Kuriakose wins by huge margin in Idukki". Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Idukki". Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
- ↑ "Ex-MP Joice George, family lose 28-acre property in Idukki; title deeds revoked". www.onmanorama.com. Retrieved 2024-04-11.
- ↑ Outlook India (30 March 2021). "Kerala Polls 2021: Ex-MP Joyce George Regrets His 'Unmarried Trouble-Maker' Remark Against Rahul" (in ఇంగ్లీష్). Archived from the original on 3 August 2024. Retrieved 3 August 2024.
- ↑ Vellaram, Sandeep (2023-01-02). "Joice George ruffles farmers' feathers in Idukki after he says buffer zone is a reality". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-04-11.