జి.ఎస్. వరదాచారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జి.ఎస్. వరదాచారి
జననం(1932-10-24)1932 అక్టోబరు 24
మరణం2022 నవంబరు 3(2022-11-03) (వయసు 90)[1]
జాతీయతభారతీయుడు
వృత్తిసీనియర్‌ జర్నలిస్ట్‌, సినీ విమర్శకుడు

జి.ఎస్. వరదాచారి (1932, అక్టోబరు 24 - 2022, నవంబరు 3) సీనియర్ తెలుగు భాషా సినీ విమర్శకుడు, పాత్రికేయుడు.[2][3][4] 1988లో పదవీ విరమణ చేసేవరకు ఆంధ్రభూమి పత్రికకు సహ సంపాదకుడిగా ఉన్నారు.[5]

జీవిత విషయాలు

[మార్చు]

వరదాచారి 1932, అక్టోబరు 24న నిజామాబాదు జిల్లాలోని ఆర్మూరులో జన్మించాడు.[6] నిజాం పాలనలో బాల్యమంతా గడిసిన వరదాచారి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పి.జి. డిప్లమా ఇన్‌ జర్నలిజం చదివాడు. తరువాత కొంతకాలం ‘ది హిందూ’ పత్రికలో ఇంటర్న్‌షిప్‌ చేశాడు.

పాత్రికేయరంగం

[మార్చు]

కృష్ణా పత్రిక’ను తొలిసారిగా చదివిన వరదాచారి ఆ పత్రికకు పాఠకుడయ్యాడు.1948లో ఆంధ్ర జనత పత్రికతో తన జర్నలిజం వృత్తిని ప్రారంభించాడు. జర్నలిజం డిగ్రీతో ప్రవేశించిన అతికొద్ది మంది జర్నలిస్టులలో వరదాచారి ఒకడు. నాన్‌ ముల్కీ సంఘటనలు, ఆంధ్రప్రదేశ్‌ అవతరణ తరువాత జరిగిన చరిత్రకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వరదాచారి రాసిన సంపాదక లేఖగా పంపిన ‘స్వతంత్ర’ అనే రచనను పత్రిక వ్యాసం రూపంలో ప్రచురించింది.[7] అదే ఇతని తొలివ్యాసం. ఆంధ్రభూమి, ఈనాడు పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశాడు. తెలుగు భాషోద్యమ సమాఖ్య ఉపాధ్యక్షుడిగా ప్రభుత్వంలో తెలుగు భాష వినియోగం కోసం పోరాడాడు.[8] తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజం విద్యార్థులకు పాఠాలు బోధించాడు. పాత్రికేయరంగంలో తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు.

నిర్వహించిన హోదాలు

[మార్చు]
క్రమసంఖ్య హోదా పత్రిక/సంస్థ హోదా కాలం
1 ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ 1964-1966
2 అధ్యక్షడు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ 1980-1981
3 అసిస్టెంట్ ఎడిటర్ ఈనాడు 21 నవంబరు 1983 - 26 డిసెంబరు 1988
4 న్యూస్ ఎడిటర్ ఆంధ్రభూమి 4 మార్చి 1961 - 20 నవంబరు 1982
5 అసిస్టెంట్ ఎడిటర్ ఆంధ్ర జనత 26 జూన్ 1956 - 3 మార్చి 1961
6 జర్నలిజంలో విజిటింగ్ ప్రొఫెసర్ తెలుగు విశ్వవిద్యాలయం 23 డిసెంబర్ 1988 - ప్రస్తుతం

అవార్డులు - బిరుదులు

[మార్చు]
 1. పత్రాకర్ శిరోమణి బిరుదు (మొట్టమొదటి హిందీ పత్రిక ఉదంత మార్తాండ్ 150వ వార్షికోత్సవం సందర్భంగా 1976, నవంబరు 26న కోల్‌కతాలో జరిగిన సర్వ భాష పత్రకర్ సమ్మేళనంలో)
 2. దాసరి గోల్డ్ మెడల్ ఉత్తమ ఫిల్మ్ జర్నలిస్ట్‌ (1986)
 3. పత్రీకా రచనాచార్య బిరుదు (అక్టోబర్ 24, 1992న షష్టిపూర్తి కార్యక్రమంలో కిన్నెర సంస్థ)
 4. తెలుగు విశ్వవిద్యాలయం జర్నలిజంలో ప్రతిభా పురస్కారం (1999)
 5. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ జర్నలిస్ట్‌గా విఆర్ నార్ల జీవన సాఫల్య పురస్కారం - 2005[9]
 6. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉగాది పురస్కారం (2006)
 7. తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ విశ్వవిద్యాలయం (26 ఫిబ్రవరి 2007)

గ్రంథాలు

[మార్చు]

జర్నలిజం కోర్సు పుస్తకాలు కూడా రాశాడు. అనేక పుస్తకాలకు సంపాదకమండలి సభ్యుడిగా (పత్రికా పదకోశం) ఉన్నాడు.[10]

 • ఇలాగేనా రాయడం (2003)
 • దిద్దుబాటు (2003)
 • నార్ల వెంకటేశ్వరరావు (2009)[11]
 • మన పాత్రికేయ వెలుగులు (2010)
 • జ్ఞాపకాల వరద (2017)[6][12]

మరణం

[మార్చు]

వరదాచారి 2022, నవంబరు 3న హైదరాబాదులో మరణించాడు.

మూలాలు

[మార్చు]
 1. Sakshi (4 November 2022). "సీనియర్‌ జర్నలిస్టు జీఎస్‌ వరదాచారి కన్నుమూత". Archived from the original on 4 November 2022. Retrieved 4 November 2022.
 2. "TSR A.P. Cinegoers' awards on Nov.14". The Hindu (in Indian English). 2012-11-06. ISSN 0971-751X. Retrieved 2021-08-17.
 3. "Scribes decry government action against Sakshi". The Hindu (in Indian English). 2012-05-20. ISSN 0971-751X. Retrieved 2021-08-17.
 4. Reporter, Staff (2012-02-21). "Book authored by senior journalist released". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-08-17.
 5. "Scribes laud Sundaram". The New Indian Express. Archived from the original on 2021-08-17. Retrieved 2021-08-17.
 6. 6.0 6.1 "Read about on emescobooks.com". emescobooks.com. Archived from the original on 2021-08-17. Retrieved 2021-08-17.
 7. సాక్షి, వేదిక (14 May 2017). "విలువైన జ్ఞాపకాలు". Sakshi. గోపరాజు. Archived from the original on 25 January 2021. Retrieved 17 August 2021.
 8. "Demand Separate Ministry". www.archive.siasat.com. Retrieved 2021-08-17.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
 9. ":: Apuwj ::". Archived from the original on 1 February 2014. Retrieved 2021-08-17.
 10. "Book authored by G S Varadachari". www.exoticindiaart.com. Retrieved 2021-08-17.
 11. "Narla Venkateshwara Rao (Telugu)". www.exoticindiaart.com. Retrieved 2021-08-17.
 12. ఆంధ్రభూమి, అక్షర (9 June 2017). "ఆదర్శ పాత్రికేయ జీవితం". andhrabhoomi.net. పొత్తూరి వెంకటేశ్వరరావు. Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.

బయటి లింకులు

[మార్చు]