జి.వి. పూర్ణచందు

వికీపీడియా నుండి
(జి.వి. పూర్ణచంద్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
జి. వి. పూర్ణచందు
GV Purnachandu.JPG
నివాస ప్రాంతంవిజయవాడ
వెబ్‌సైటు
http://drgvpurnachand.blogspot.com

డా. జి.వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ఆయుర్వేద వైద్యులు, సాహితీవేత్త, పరిశోధకుడు, 120 గ్రంథాల రచయిత.

బాల్యం[మార్చు]

డా. జి.వి. పూర్ణచందు 23 ఏప్రిల్ 1957లో కృష్ణా జిల్లా కంకిపాడులో పుట్టారు. సత్యప్రసూన, జి.వి.జి.కె. చంద్రమౌళీశ్వరరావులు వీరి తల్లిదండ్రులు.

చదువు[మార్చు]

కృష్ణాజిల్లాలోని వివిధ గ్రామాలలో ఉన్నత పాఠశాల విద్య, విజయవాడ శాతవాహన కళాశాలలో (1973-75) ఇంటర్మీడియేట్, విజయవాడ డా॥నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో B.A.M.S. డిగ్రీ చదివారు.

వృత్తి, ప్రవృత్తి[మార్చు]

  • సుశ్రుత ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్ హాస్పిటల్, బకింగ్`హాం పేట పోష్టాఫీసు ఎదురు, విజయవాడ-520 002 కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ ఫిజీషియన్ గా పని చేస్తున్నారు.
  • కృష్ణాజిల్లా రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శి,
  • ప్రపంచ తెలుగు రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి,
  • నేషనల్ మెడికల్ అసోషియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు,
  • తన్నీరు కృష్ణమూర్తి విద్యాధర లయన్స్ ఐ హాస్పిటల్ చైర్మన్.

సాహితీ జీవితంలో ముఖ్యాంశాలు[మార్చు]

డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 120 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న “హంస” పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు.

ఆహారవేదం, తెలుగే ప్రాచీనం, నైలూ నుండి కృష్ణ దాకా, తెలుగుకోసం లాంటి విశేష పరిశోధనా గ్రంథాల రచయిత. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు. 20 బృహత్తర పరిశోధనా గ్రంథాలకు సంపాదకత్వం వహించారు

1980 దశకంలో మినీ కవితా ఉద్యమ సారధుల్లో ఒకరు. తెలుగు భాషోద్యమ ప్రముఖులు.

కృష్ణాజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా, ప్రపంచతెలుగు రచయితల సంఘం కార్యదర్శిగా తెలుగు భాషోద్యమాన్ని శక్తిమంతం చేయటానికి పరిశ్రమిస్తున్నారు. నాలుగు పర్యాయాలు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు, ఒక పర్యాయం జాతీయ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించారు, తెలుగు భాష విశిష్ట ప్రాచీనత జాతీయ సదస్సు, సింధు కృష్ణా లోయల నాగరికతల అధ్యయనం జాతీయ సదస్సు, కృష్ణాజిల్లా చారిత్రక వైభవం జాతీయ సదస్సు, న్యాయ వ్యవస్థలో తెలుగు అమలు సదస్సు లాంటి అనేక జాతీయ సదస్సుల నిర్వహణలో వీరిది ప్రధాన పాత్ర.

తెలుగు పసిడి, వజ్రభారతి, కృష్ణాజిల్లా సర్వస్వం, తెలుగు పున్నమి, తెలుగు వ్యాసమండలి, కృష్ణాజిల్లా సర్వస్వం, కృష్ణాతీరం, దేశభాషలందు తెలుగు లెస్స లాంటి 20 బృహత్తర ఆకర గ్రంథాలకు సంపాదకత్వం వహించారు.

కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పాటుకోసం, అందులో తెలుగు శాఖ ఏర్పాటు కోసం పోరాడిన వారిలో ఒకరు.

దాదాపు 10 విశ్వవిద్యాలయాలలోని తెలుగు శాఖలు వీరిని సత్కరించాయి. ఇంచుమించు 50 జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు.

వివిధ దిన, వార మాసపత్రికలలో రమారమి 35 శీర్షికలు నిర్వహించారు. ప్రస్తుతం 9 దిన వార మాసపత్రికలలో వీరి శీర్షికలు వెలువడుతున్నాయి.

తెలుగు భాష ప్రాచీనత నిరూపణకోసం తెలుగే ప్రాచీనం (ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం ప్రచురణ-2008) నైలూ నుండి కృష్ణ దాకా (ద్రవిడ విశ్వవిద్యాలయం ప్రచురణ-2008), ‘తెలుగుకోసం’ (ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి ప్రచురణ), తెలుగులో అతిథిపదాలు (గుత్తికొండ రామరత్నం చారిటబుల్ ట్రష్టు ప్రచురణ.) లాంటి పరిశోధనాగ్రంథాలు వెలువరించారు. ఆం. ప్ర ఆర్కయివ్స్ వారి `ఇతిహాస్ జర్నల్`, వీరి భాషా చరిత్ర పరిశోధనా వ్యాసాన్ని ప్రచురించింది.

లండన్ బ్రిటిష్ మ్యూజియంలో జరిగిన తొలి ప్రపంచ తెలుగు చరిత్ర మహాసభలలో తెలుగువారి ఆహారచరిత్ర పైన పరిశోధనాపత్ర సమర్పణ చేశారు.అక్కడి బ్రౌన్ సమాధి సందర్శించారు.

కుటుంబం[మార్చు]

భార్య అరుణాదేవి. పిల్లలు ఇద్దరు - లక్ష్మీ చేతన సాఫ్ట్‘వేర్ ఇంజనీర్ (డెట్రాయిట్), కుమారుడు మనోఙ్ఞ కార్తీక్ చెన్నై ఐ ఐ టిలో పి హెచ్‘డి చేస్తున్నాడు

రచనలు[మార్చు]

డా. జి వి పూర్ణచందు వందకుపైగా పుస్తకాలు రాశారు. వీటిలో సుమారు నలభై పుస్తకాలు సామాన్యులకు వైద్య రహస్యాలను వివరిస్తాయి.

35 సంపాదకత్వం/సహసంపాదకత్వం వహించారు. తెలుగు భాషాసంస్కృతుల పరివ్యాప్తికి, మూలాలను త్రవ్వి తీసేందుకు దోహద పడే బృహద్గ్రంథాలుగా ఇవి

ప్రసిద్ధి పొందాయి.

6 వైఙ్ఞానిక గ్రంథాలు,

3 కవితాసంపుటాలు

3 నవలలు

14 విమర్శనా గ్రంథాలు

9 చరిత్ర గ్రంథాలు,

5 జీవిత చరిత్ర గ్రంథాలు

23 వైద్యగ్రంథాలు,

11 ఆహార చరిత్ర/వైద్య గ్రంథాలు

11 సామాజిక రచనలు

4 ఇతర భాషల్లోకి అనువాదం అయిన గ్రంథాలు

35 వీవిధ పత్రికల్లో అనేక సంవత్సరాలపాటు కొనసాగిన శీర్షికలు వీరి కలం నుండి వెలువడ్డాయి.

ఆహార చరిత్ర గురించి మొత్తం 9 గ్రంథాలు వెలువరించగా, వాటిలోతరతరాల తెలుగు రుచులు పరిశోధనా గ్ర౦థ౦ తెలుగు వారి ఆహార చరిత్రపైన వెలువడిన తొలిగ్ర౦థ౦గా ప్రసిధ్ధి పొ౦ది౦ది.

తెలుగు విశ్వవిద్యాలయం వీరి "మన ఆహారం" ఆహారచరిత్ర గ్రంథాన్ని ప్రచురించింది. వీరి ‘ఆహారవేదం’ పరిశోధనా గ్రంథం అనేక పురస్కారాలను పొందింది.

వీరి రచనలు `కాంతిస్వప్న` దీర్ఘకవిత, సప్తసింధు నవల, జీవిత చరిత్ర రచనల పైన ఎంఫిల్, వీరి సాహితీ జీవితం పైన పిహెచ్.డి పరిశోధనలు జరిగాయి.

పురస్కారాలు[మార్చు]

2000 గుర్రం జాషువా మిలీనియం విశిష్ట పురస్కారం, అంబేద్కర్ జాతీయ యువజన సమితి, విజయవాడ;

2002 ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం - 'భాషాభిజ్ఞ' పురస్కారం, హైదరాబాదు;

2005 నార్ల వెంకటేశ్వరరావు విశిష్ట సాహితీ సేవా పురస్కారం, హైదరాబాదు;

2008 సర్వధారి నామ ఉగాది విశిష్ట పురస్కారం- శ్రీ విష్ణు సాయి జ్ఞానజ్యోతి ఆధ్యాత్మిక సాహితీసేవా సంస్థ విజయవాడ;

2008 కీ.శే.నండూరి సారంగపాణి ఆచార్య స్మారక విశిష్ట సాహితీ పురస్కారం, ఆంధ్ర సారస్వత సమితి మచిలీపట్నం;

2008 కాశీనాథుని నాగేశ్వరరావు ఫౌండేషన్-విశ్వదాత విశిష్ట సాహితీ పురస్కారం, యలకుర్రు;

2008 డా. ద్వా. నా శాస్త్రి విశిష్ట సాహితీ పురస్కారం, హైదరాబాదు;

2008 కృష్ణా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ వారి విశిష్ట సత్కారం, విజయవాడ;

2008 యువభారతి, హైదరాబాదు సహృదయ అభినందన పురస్కారం, హైదరాబాదు;

2008 ఆం.ప్ర. సాంస్కృతిక శాఖ, కిన్నెర ఆర్ట్ థియేటర్స్ విశిష్ట సత్కారం, హైదరాబాదు;

2008 ఆంధ్ర సారస్వత పరిషత్ హైదరాబాద్ వారి సత్కారం

2009 ఆం. ప్ర. అధికార భాషా సంఘం తెలుగు భాషా పురస్కారం, హైదరాబాదు;

2009 ఆకాశవాణి విజయవాడ కేంద్ర స్వర్ణోత్సవ సత్కారం;

2009 కొనకళ్ళ వెంకటరత్నం శతజయంతి సాహితీ పురస్కారం, పశ్చిమ గోదావరి జిల్లా రచయితల సంఘం;

2009 నేషనల్ మెడికల్ అసోసియేషన్ విశిష్ట పురస్కారం;

2009 కొమరగిరి వెంకట సత్యనారాయణ (బుచ్చినాయన) విశిష్ట సాహితీ పురస్కారం;

2009 వైజ్`మెన్ ఇంటర్నేషనల్ ప్రతిభా పురస్కారం;

2009 ఘంటసాల బౌద్ధ స్తూప ప్రారంభ సభలో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి సత్కారం

2010 గిడుగు రామ్మూర్తి భాషోద్యమ శతజయంతి పురస్కారం, తెలుగురథం, హైదరాబాదు;

2010 జ్యోత్స్న కళాపీఠం తెలుగు భాషా పురస్కారం, హైదరాబాదు;

2010 తెలుగు విశ్వవిద్యాలయం తిక్కవరపు రామిరెడ్డి కీర్తి పురస్కారం;

2010 ఆరుద్ర సాహితీ ప్రతిభా పురస్కారం, పోలవరపు కోటేశ్వరరావు సాహితీ పీఠం, ఆం.ప్ర సాంస్కృతీ సమాఖ్య, విజయవాడ;

2010 ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహితీ సత్కారం, విజయవాడ;

2011 ఆంధ్ర సాహిత్య పరిషత్, కాకినాడ శత జయంత్యుత్సవ సత్కారం;

2012 కృష్ణాజిల్లా కలెక్టర్`చే కృష్ణాజిల్లా సాంస్కృతిక మండలి సత్కారం, మచిలీపట్టణం;

2012 4వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయ సత్కారం;

2012 ఆచార్య పొన్నపల్లి వెంకట కృష్ణయ్య సాహితీ సత్కారం, విజయవాడ;

2012 ఆకాశవాణి విజయవాడ వారి స్వర్ణోత్సవ సత్కారం

2012 లలితకళాసమితి మచిలీపట్టణం వారి సత్కారం

2013 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది విశిష్ట సాహితీ పురస్కారం, హైదరాబాదు;

2013 ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (కృష్ణా అర్బన్) సత్కారం, విజయవాడ;

2013 రోటరీ క్లబ్ విజయవాడ వారి సాహితీ సత్కారం;

2014 సరసభారతి, ఉయ్యూరు వారి ఉగాది పురస్కారం;

2014 రూట్స్ హెల్త్ ఫౌండేషన్, విజయవాడ వారి ప్రతిభా పురస్కారం;

2014 ప్రపంచ తెలుగు సమాఖ్య సత్కారం, విజయవాడ;

2014 ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాల రాజమండ్రి వారి సాహితీ సత్కారం;

2014 శ్రీకళాసుధ చెన్నై వారి జాతీయ పురస్కారం.

2014 వేటూరి ప్రభాకరశాస్త్రి పీఠం, టి టి డి వారి సత్కారం,

2016 ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ గిడుగు రామమూర్తి తెలుగు భాషా పురస్కారం

2017 రాష్ట్రేతర తెలుగు సమాఖ్య బొంబాయి జీవనసాఫల్య పురస్కారం

2018 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హంస (కళారత్న) పురస్కారం

2018 పుట్టి వెంకటేశ్వర రావు "తెలుగు పసిడి" బిరుదు సత్కారం

2018 ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం వారిచే పుస్తకపఠన ప్రోత్సాహక పురస్కారం మరియు

వీరి పూర్తి రచనల ప్రదర్శన,

2019 సద్గురు శివానంద సనాతనధర్మ చారిటబుల్ ట్రష్టు వారి శ్రీరామనవమి ప్రతిభాపురస్కారం

2019 యర్రమిల్లి నరసింహారావు స్మారక విశిష్ట రచనా పురస్కారం.

2019 పరవస్తు చిన్నయసూరి పీఠం వారి తెలుగు భాషాపురస్కారం

2020 అజోవిభో వారి సత్కారం


మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]