Jump to content

జీరెడ్డి చెన్నారెడ్డి

వికీపీడియా నుండి
జీరెడ్డి చెన్నారెడ్డి
జననం(1915-02-26)1915 ఫిబ్రవరి 26
మరణం1998 May 16(1998-05-16) (వయసు: 83)
జాతీయతభారతీయుడు
చదువుఎం.ఎ., పి.హెచ్.డి., బి.ఎడ్., విద్వాన్
పాఠశాల/కళాశాలలుమద్రాసు విశ్వవిద్యాలయం,
ఆంధ్ర విశ్వవిద్యాలయం,
మైసూర్ విశ్వవిద్యాలయం
వృత్తిడైరెక్టర్
యజమానిశ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం
Organizationప్రాచ్యపరిశోధనాలయం
పేరుపడ్డదిరచయిత, పరిష్కర్త
Notable workదక్షిణ తార,
మకుట భంగము,
ప్రెసిడెంటు
భాగస్వామికమలమ్మ

జీరెడ్డి చెన్నారెడ్డి తెలుగు రచయిత, సంస్కృత పండితుడు, అనువాదకుడు, పరిశోధకుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు 1915, ఫిబ్రవరి 26వ తేదీన కడప జిల్లా పర్లపాడు గ్రామంలో జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం మద్రాసు విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయాలలో నడిచింది. ఇతడు ఎం.ఎ., బి.ఇడి., విద్వాన్ పట్టాలను పొందాడు.మైసూరు విశ్వవిద్యాలయం నుండి "తెలుగు సాహిత్యముపై వీరశైవమత ప్రభావము" అనే అంశంపై పరిశోధించి డాక్టరేటు పట్టా పుచ్చుకున్నాడు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాచ్య పరిశోధనా సంస్థకు డైరెక్టర్‌గా పనిచేశాడు[1]. ఇతడు 1998, మే 16న తన 83వయేట మరణించాడు.[2]

రచనలు

[మార్చు]
  1. భాసుని రామనాటకమూలములు[3]
  2. తెలుగు సాహిత్యముపై వీరశైవ మతప్రభావము (సిద్ధాంత గ్రంథం) [4] - 1996
  3. ఆంధ్రమహా భారతము, విరాట పర్వము[5]
  4. మకుట భంగము (నవల) -1947
  5. దక్షిణ తార (నవల) - 1950
  6. బృందావనం (నవల)
  7. ప్రెసిడెంటు (నాటకం) -1954
  8. ముప్పిరాల సుబ్బరాయకవి విరచిత ప్రద్యుమ్న చరితము (పరిష్కృతం) [6] - 1974
  9. కావ్యము - సమీక్ష[7] -1962
  10. శ్రీ వెంకటాచలమహాత్మ్యము (దామెర చినవెంకటరాయకవి విరచిత చంపూకావ్యం - పరిష్కృతం) [8] - 1962

మూలాలు

[మార్చు]
  1. Whos Who Of Indian Writers (1 ed.). న్యూఢిల్లీ: సాహిత్య అకాడమీ. p. 66. Retrieved 11 April 2020.
  2. డి.కె.చదువుల బాబు (December 2007). కడపజిల్లా సాహితీమూర్తులు (1 ed.). హైదరాబాదు: గౌరు తిరుపతిరెడ్డి. pp. 94–95.
  3. sources-of-bhasas-ramayana-plays
  4. telugu-sahityamupai-virasaiva-mata-prabhavamu
  5. andhramahabharatamu-virataparvamu
  6. muppirala-subbarayakavi-viracita-pradyumna-caritramu
  7. kavyamu-samiksa
  8. sri-venkatacala-mahatmyamu

బయటిలింకులు

[మార్చు]