ఘనశ్యాం దాస్ బిర్లా
ఘన్‌శ్యామ్ దాస్ బిర్లా | |
---|---|
జననం | ఏప్రిల్ 10 , 1894 పిలాని గ్రామం, |
మరణం | జూన్ 11 , 1983 |
వృత్తి | పారిశ్రామిక వేత్త |
ప్రసిద్ధి | హిందుస్థాన్ మోటార్ సంస్థ స్థాపకుడు యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (యుకో/UCO) ప్రారంభకుడు. |
తండ్రి | బలాదియోదాస్ |
జె.డి. బిర్లాగా పిలవబడే ఘన్ శ్యామ్ దాస్ బిర్లా భారతదేశపు అతి పెద్ద వ్యాపారపు సముదాయానికి యజమాని. ఆయన 1894 ఏప్రిల్ 10 వతేదీన పిలాని గ్రామంలో పుట్టాడు.
కుటుంబం,బాల్యం,విద్య
[మార్చు]ఘన్ శ్యామ్ దాస్ తాతగారైన శివనారాయణ బిర్లా పిలాని ప్రాంతంలో పెద్ద వ్యాపారి. ఇతడు తరువాతి కాలంలో కలకత్తా వెళ్ళి బట్టల వ్యాపారంలో ప్రవేశించాడు. వ్యాపారం పుంజుకొన్న తరువాత పిలాని గ్రామంలో ఒక హవేలీ నిర్మించాడు. ఇప్పటికీ ఉన్న దానిని బిర్లా హవేలి అంటున్నారు. అతడు నవల్గర్ కుటుంబం నుండి ఘన్ శ్యామ్ దాస్ తండ్రి అయిన బలాదియోదాస్ను పెంపకానికి తెచ్చుకొన్నాడు.
వ్యాపారం
[మార్చు]ఘన్ శ్యామ్ కూడా తాత తండ్రుల వలే కలకత్తా వెళ్ళి బట్టల వర్తకం సాగించాడు. దానితో పాటు వస్తుతయారీ యూనిట్లను దేశం నలుమూలలా స్థాపించాడు. 50 లక్షల పెట్టుబడి దాటిన తరువాత తన సోదరులతో కలిసి 1919లో గ్వాలియర్ పట్టణంలో సొంతానికి మిల్లు స్థాపించాడు. తరువాత బిర్లా రాజకీయాలలో రాణించాడు.1926లో బ్రిటిష్ వారి హయాంలో శాసనసభకు వెళ్ళాడు. తరువాత కార్ల వ్యాపారంలో ప్రవేశించి 1940లో హిందూస్తాన్ మోటార్స్ అనే సంస్థను స్థాపించాడు. దీని తరువాత సిమెంట్, ఇనుము, కెమికల్స్, ప్లాస్టిక్ పరిశ్రమలలో రాణించాడు. 1943 ప్రాంతంలో యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (యుకో/UCO) అనే సంస్థను కలకత్తాలో ప్రారంభించాడు. 1983 లో తన 90 వ ఏట మరణించాడు.
అవార్డులు, సత్కారాలు
[మార్చు]- 1957లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్‌తో గౌరవించింది.
బయటి లింకులు
[మార్చు]- Rs 2.80 Billion BITS Pilani Hyderabad Campus Foundation Laid
- AP CM Readies BITS Pilani Hyderabad Campus
- Milestone for BITS Pilani Hyderabad
- Chief Minister AP Lays the BITS Pilani Hyderabad Campus Foundation
- BITS Pilani Makes the Right Move at the Right Time
- People who shaped India
ఇతర విశేషాలు
[మార్చు]- బిర్లా మహాత్మాగాంధీ యొక్క మిత్రుడు. గాంధీ తన చివరి రోజుల్లో ఢిల్లీలో ఉన్న సమయంలో బిర్లా నివాసంలోనే ఉండేవాడు.
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- 1894 జననాలు
- భారతీయ పారిశ్రామికవేత్తలు
- పద్మవిభూషణ పురస్కార గ్రహీతలు
- 1983 మరణాలు
- బ్రిటిషు భారతదేశ కేంద్ర శాసనసభ సభ్యులు