జే.సీ. ప్రభాకర రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జే.సీ. ప్రభాకర రెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 - 2019
ముందు జే సీ దివాకర్ రెడ్డి
తరువాత కేతిరెడ్డి పెద్దారెడ్డి
నియోజకవర్గం తాడిపత్రి నియోజకవర్గం

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2021 మార్చి 18 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం 1952
తాడిపత్రి, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు జె.సి. నాగిరెడ్డి, నాగ లక్ష్మమ్మ
జీవిత భాగస్వామి జె.సి. ఉమా రెడ్డి
సంతానం జె.సి. ఆస్మిత్‌ రెడ్డి
వృత్తి రాజకీయ నాయకుడు

జూతురు చిన్న ప్రభాకర రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

జే.సీ. ప్రభాకర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి ఆగస్ట్ 1987 నుండి ఆగస్టు 1992 వరకు తొలిసారి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌గా పని చేశాడు. ఆయన ఆ తరువాత మార్చి 2000 నుండి మార్చి 2005 వరకు రెండోసారి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌గా, అక్టోబర్ 2005 నుండి అక్టోబర్ 2010 వరకు తాడిపత్రి మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా పని చేశాడు.

జే.సీ. ప్రభాకర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరి 2014లో జరిగిన ఆంద్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3] ఆయన ఆ తరువాత 2019లో పోటీ చేయకుండా తన కుమారుడు జె.సి. ఆస్మిత్‌ రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించగా ఆయన ఓడిపోయాడు, 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు.

మూలాలు[మార్చు]

  1. Zee News Telugu (18 March 2021). "తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా జేసీ ప్రభాకర్ రెడ్డి, పంతం నెగ్గించుకున్న TDP". Archived from the original on 4 June 2022. Retrieved 4 June 2022.
  2. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  3. "Andhra Pradesh Assembly Election Results in 2014". Elections in India. Archived from the original on 2020-10-28. Retrieved 2022-06-05.