టార్గెట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టార్గెట్
దర్శకత్వంరమేష్ రాజా
స్క్రీన్ ప్లేరమేష్ రాజా
దీనిపై ఆధారితంబేసిక్ ఇన్‌స్టింక్ట్ 
by పాల్ వర్హోవెన్
నిర్మాతసంగిశెట్టి దశరథ, బి.రామకృష్ణ
తారాగణంశ్రద్ధా దాస్
ముమైత్ ఖాన్
గీతా సింగ్
వల్లభనేని జనార్ధన్
ఛాయాగ్రహణంవి.సురేష్ కుమార్
కూర్పుకొల్లూరి రమేష్
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
శ్రీ సాయి సూర్య పిక్చర్స్
విడుదల తేదీ
2009 మే 22 (2009-05-22)
భాషతెలుగు

టార్గెట్ శ్రీ సాయి సూర్య పిక్చర్స్ బ్యానర్‌పై రమేష్ రాజా దర్శకత్వంలో వెలువడిన తెలుగు సినిమా. ఈ సినిమా 2009, మే 22 న విడుదలయ్యింది. 1992లో వచ్చిన బేసిక్ ఇన్‌స్టింక్ట్ అనే హాలీవుడ్ సినిమాకు ఇది అనుసరణ.

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రమేష్ రాజా
  • కూర్పు: కొల్లూరి రమేష్
  • సంగీతం: కోటి
  • ఛాయాగ్రహణం: వి.సురేష్ కుమార్

కథ[మార్చు]

నందిని నవలా రచయిత్రి. తన సోదరి మందాకిని పేరుతో రచనలు చేస్తూ ఉంటుంది. ఆమె వ్రాసిన ఎర్రగులాబీలు నవల ద్వారా ఆమెకు మంచి పేరు వస్తుంది. ఆ నవలలో వర్ణించిన విధంగానే ఒక బాక్సర్ హత్య చేయబడతాడు. పోలీసులు ఆ హత్యలో మందాకినిని అనుమానిస్తారు. ఆ నవలలో మర్మకళ అనే పురాతన విద్యను వర్ణిస్తుంది. ఆ హత్య కూడా అదే విధంగా చేయబడి ఉంటుంది. ఈ కేసును పరిశోధించడానికి బోస్ అనే ఆఫీసర్‌ను నియమిస్తారు. బోస్ కూడా మందాకినిని హంతకురాలిగా అనుమానిస్తాడు కానీ తన పరిశోధనలో నిరూపించలేకపోతాడు. లై డిటెక్టర్ పరీక్ష రిజల్టు కూడా ఆమె హత్యచేయలేదనే వస్తుంది. అయినా మందాకినినే బోస్ నేరస్తురాలిగా భావిస్తాడు. అసలు ఈ మందాకిని ఎవరు? ఆమె హంతకురాలా? కాక పోతే అసలు నేరస్థులు ఎవరు? అనేదే మిగిలిన కథ.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=టార్గెట్&oldid=4095225" నుండి వెలికితీశారు